Photo Credit: Twitter
జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో అఫ్గానిస్తాన్‌ను దురదృష్టం వెంటాడిందని చెప్పొచ్చు. నేపాల్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసిన అఫ్గానిస్తాన్ క్వార్టర్స్‌లో టీమిండియాపై గెలిచి సెమీస్ చేరాలని భావించింది. కానీ ఆఫ్గన్ పాలిట వరుణుడు విలన్‌గా మారాడు.
వర్షం అంతరాయం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా సీడింగ్, టాప్ ర్యాంక్ ఆధారంగా సెమీస్‌లో అడుగుపెట్టగా, పదో ర్యాంకులో ఉన్న అఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
కట్‌చేస్తే.. మూడేళ్ల క్రితం, హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో అఫ్గానిస్తాన్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. నాడు వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్తాన్ రజతం సాధించగా, వరుస విజయాలతో టాప్ లేపిన రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా స్వర్ణం ఎగరేసుకుపోయింది. పైన రెండింటిని గమనించి చూస్తే.. అఫ్గానిస్తాన్, టీమిండియాలతో పాటు వర్షం ఇక్కడ కామన్‌గా కనిపిస్తోంది.
నాటి ఆసియా గేమ్స్ ఫైనల్లో ఏ వర్షమైతే మ్యాచ్‌కు అడ్డుపడి, అఫ్గానిస్తాన్‌కు పతకం అందించిందో.. ఇవాళ అదే వర్షం ఆ జట్టును సగర్వంగా ఇంటికి సాగనంపడంలో విజయవంతమైంది. ఈ రెండు సందర్భాల్లోనూ టీమిండియానే ప్రత్యర్థి కావడం ఇక్కడ యాదృశ్చికం. అలా అఫ్గానిస్తాన్ హార్ట్‌బ్రేక్ అవ్వడానికి వర్షం పరోక్షంగా కారణమయ్యింది.
ఇదీ చదవండి: Asian Games Cricket: సెమీఫైనల్‌కు టీమిండియా


