source: X
ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్‌లో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరింది. హాంకాంగ్ చైనాతో ఇవాళ జరగాల్సిన తొలి క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో పాక్ ఫైనల్-4లోకి అడుగు పెట్టింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో టాస్ కూడా సాధ్యపడలేదు. దీంతో మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్ ఆధారంగా పాక్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
పాకిస్తాన్‌తో పాటు భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా ర్యాంకింగ్స్ కారణంగా నేరుగా నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్) చేరుకోగా.. మలేషియా, హాంగ్‌కాంగ్ గ్రూప్-బి నుంచి, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-ఏ నుంచి క్వార్టర్‌ఫైనల్‌కు చేరాయి.
ఇవాళే జరుగనున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్.. భారత్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు జరుగబోయే మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీలంక-నేపాల్, బంగ్లాదేశ్-మలేషియా తలపడతాయి. అక్టోబర్ 1న రెండు సెమీఫైనల్స్ మ్యాచ్‌లు, 3న కాంస్య పతక మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ (స్వర్ణం కోసం) జరుగనున్నాయి.
ఇదీ చదవండి: సెమీస్‌లో భారత ఆర్చరీ జట్లు


