ఆర్చరీలో వరల్డ్‌ రికార్డు సమం.. పతకాల వేటలో మను బాకర్‌ | India At Asian Games 2026 Day 8 Updates | Sakshi
Sakshi News home page

ఆర్చరీలో వరల్డ్‌ రికార్డు సమం.. పతకాల వేటలో మను బాకర్‌

Sep 27 2026 9:31 AM | Updated on Sep 27 2026 9:31 AM

India At Asian Games 2026 Day 8 Updates

ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భారత్‌ ఇవాళ (ఎనిమిదో రోజు) మరిన్ని పతకాలపై కన్నేసింది. స్క్వాష్‌లో అబయ్‌ సింగ్‌, అనాహత్‌ సింగ్‌ తమ సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ రజత పతకాలు ఖాయం చేసుకున్నారు. ఫైనల్లో విజయం సాధిస్తే ఆ పతకాలు స్వర్ణంగా మారనున్నాయి.

డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌ చివరి ఐదు ఈవెంట్లలో పోటీ పడనున్నాడు. అథ్లెటిక్స్‌లోనూ భారత్‌ పతకాలపై ఆశలు పెట్టుకుంది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో నిరాశపరిచిన తర్వాత, మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పతకాలు సాధించాలని మను బాకర్, ఈషా సింగ్ ఆసక్తిగా ఉన్నారు.

ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. మహిళల జట్టు ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. పురుషుల జట్టు రౌండ్‌ ఆఫ్‌ 16లో యూఏఈని, క్వార్టర్‌ఫైనల్లో భూటాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. మహిళల జట్టు రౌండ్‌ ఆఫ్‌ 16లో మంగోలియాను, క్వార్టర్‌ఫైనల్లో కజకిస్థాన్‌ను ఓడించింది.

మహిళల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ ఓటమి పాలైంది.

ఇదీ చదవండి: వైభవ్‌ రూపంలో వారికి ప్రమాదం​ పొంచి ఉంది..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement