ఫైనల్లో భారత స్క్వాష్ స్టార్
భారత టాప్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ సెమీఫైనల్ మ్యాచ్... సటోమీ వతనబె (జపాన్)తో జరుగుతున్న పోరులో తొలి రెండు గేమ్‌లు చేజారిపోయాయి. మూడో గేమ్‌లో కూడా 8–10తో ఓటమికి చేరువగా నిలిచింది. ఈ దశలో ఒక్కసారిగా చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన అనాహత్ ఆపై మరింత మెరుగైన ప్రదర్శనతో మ్యాచ్‌ను సొంతం చేసుకొని ఫైనల్లోకి అడుగు పెట్టింది.
చివరకు 3–2 (9–11, 11–13, 12–10, 11–6, 11–3)తో అనాహత్ విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో భారత ఆటగాడు అభయ్ సింగ్ కూడా ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో అభయ్ 3–0 (11–3, 12–10, 11–6)తో పాకిస్తాన్‌కు చెందిన ముహమ్మద్ ఇర్ఫాన్‌ను ఓడించాడు. స్క్వాష్ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలు 2028 ఒలింపిక్స్‌కు నేరుగా క్వాలిఫై అవుతారు.
లక్ష్యసేన్ నిష్క్రమణ...
బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో పీవీ సింధు, ఉన్నతి హుడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–9, 21–13తో టొమొకా మియకాజి (జపాన్)ను ఓడించగా, ఉన్నతి హుడా కూడా ప్రిక్వార్టర్స్‌లో 21–19, 21–13తో వరల్డ్ నంబర్ 6 పుత్రి కుసుమ (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించింది.
మహిళల డబుల్స్‌లో కూడా భారత జంట పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ 24–22, 21–18తో వరల్డ్ నంబర్ 3 మయు మట్సుమొటొ–యుకీ ఫుకుషిమాపై గెలుపొంది క్వార్టర్స్ చేరింది. అయితే పురుషుల విభాగంలో ఇద్దరు భారత ఆటగాళ్లు లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి కూడా పరాజయంతో నిష్క్రమించారు. లక్ష్యసేన్ 12–21, 21–15, 14–21తో లో కీన్ యు (సింగపూర్) చేతిలో, ఆయుశ్ 16–21, 21–19, 17–21తో చో టిన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయంపాలయ్యారు.


