Photo Credit: Twitter
జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 30 పతకాల మార్క్‌ను టచ్ చేసింది. గత ఆసియా క్రీడల్లో సెంచరీ మార్క్‌ను దాటిన భారత్ ఈసారి అన్ని పతకాలు సాధించడం కష్టమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అథ్లెటిక్స్‌లో భారీగా పతకాలు వస్తాయనే ఆశలను మన అథ్లెట్లు నెరవేరుస్తూ వస్తున్నారు.
ఇప్పటివరకు భారత్ ఖాతాలో 30 పతకాలు చేరగా, ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలున్నాయి. శనివారం కబడ్డీలో రెండు స్వర్ణాలు రాగా, అథ్లెటిక్స్ విభాగం నుంచి మూడు పతకాలు వచ్చి చేరాయి. కాగా స్వ్కాష్‌లో మహిళల విభాగంలో అనాహత్, పురుషుల విభాగంలో అభయ్ సింగ్‌లు ఫైనల్లో అడుగుపెట్టి పతకాలు ఖాయం చేశారు. ఇక హాకీలో భారత పురుషుల జట్టు శనివారం ఆతిథ్య జపాన్‌ను ఓడించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.
షాట్‌పుట్‌లో రజతం
మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ కాంస్యం నెగ్గగా.. తాజాగా పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ రజతం గెలుచుకున్నాడు. ఇవాళ జరిగిన పురుషుల షాట్‌పుట్ ఫైనల్లో తజిందర్ తన ఐదో ప్రయత్నంలో షాట్‌పుట్‌ను 20.64 మీటర్ల దూరం విసిరి బెస్ట్ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు రజతం ఖాయం చేసుకున్నాడు. ఇరాన్‌కు చెందిన మొహమ్మద్రెజా తయబైస్ 20.81 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం సాధించాడు.
ప్రాచీకి కాంస్యం
మహిళల 400 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ ప్రాచీ చౌదరీ కాంస్యం ఒడిసిపట్టింది. నగోయా వేదికగా జరిగిన ఫైనల్ రేసులో ప్రాచీ 53.21 సెకన్లలో గమ్యాన్ని చేరింది. బహ్రెయిన్‌కు చెందిన సాల్వా నాసర్ 49.20 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం గెలుచుకోగా, ఇరాన్‌కు చెందిన జహ్రా జరేయి 52.38సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం సాధించింది. మరో భారత అథ్లెట్ కిరణ్ పహాల్ 53.41 సెకన్లలో గమ్యాన్ని చేరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
Heartiest congratulations to Prachi Choudhary on winning the Bronze Medal in the Women’s 400m at the Asian Games 2026.#Cheer4Bharat pic.twitter.com/wXXhElJ2ux
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 26, 2026
REDEMPTION FOR TOOR!
Tajinderpal Singh Toor fights back to win Asian Games SILVER with a best throw of 20.64m.
Down in third after Round 4, he delivered when it mattered most — 20.64m in Round 5 to climb onto the podium.
Just 17cm off GOLD.
And now: THREE STRAIGHT ASIAN GAMES…— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 26, 2026
ఇదీ చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు


