Photo Credit: BCCI Twitter
వెస్టిండీస్‌తో తొలి వన్డే సందర్భంగా టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. రేపు తిరువనం తపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. శుక్రవారం జరిగిన టీమిండియా ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లో సూపర్ ఫామ్ కనబరిచిన రోహిత్ అదే ఆటను విండీస్‌తో తొలి వన్డేలోనూ ప్రదర్శించాలని పట్టుదలతో ఉన్నాడు.
రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు రోహిత్ 288 వన్డే మ్యాచ్‌లాడి 11,895 పరుగులు సాధించాడు. ఇందులో 34 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డేల్లో 12వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు రోహిత్‌కు మరో 105 పరుగులు అవసరం.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఆఖరి వన్డేలో సూపర్‌సెంచరీతో మెరిసిన హిట్‌మ్యాన్.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే తిరువనంతపురంలోనూ శతకం సాధించాలని భావిస్తున్నాడు. రోహిత్ ఫామ్‌లో ఉంటే ఇదేమీ పెద్ద విషయం కాదు. తొలి వన్డేలో ఈ మైలురాయిని అందుకోలేనప్పటికీ, వన్డే సిరీస్ ముగిసేలోపే 12వేల మార్కును చేరుకోవడం ఖాయం.
దీంతో పాటు రోహిత్ శర్మను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. అదేంటంటే, మరో 135 పరుగులు చేస్తే వన్డేల్లో ఓపెనర్‌గా 10వేల పరుగుల మార్క్‌ను అందుకుంటాడు. తద్వారా వన్డేల్లో ఓపెనర్‌గా పదివేల పరుగుల మార్క్ అందుకున్న నాలుగో బ్యాటర్‌గా, భారత్ తరఫున రెండో బ్యాటర్‌గా నిలవనున్నాడు. సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
ఇక వెస్టిండీస్‌పై కూడా వన్డేల్లో రోహిత్ శర్మకు మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు విండీస్‌తో 37 వన్డేలు ఆడిన రోహిత్ 1,613 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలున్నాయి.
ఇదీ చదవండి: ఓటమి బాధలో ఉన్న ఆసీస్‌కు షాక్.. స్వదేశానికి స్టార్ ఆటగాడు!


