Asian Games 2026: బుల్లెట్ ట్రైన్‌లో టీమిండియా ప్రయాణం | Team-India-Lands-Nagoya-Play-Asian Games-Travels-Bullet Train-Tokyo | Sakshi
Sakshi News home page

Asian Games 2026: బుల్లెట్ ట్రైన్‌లో టీమిండియా ప్రయాణం

Sep 26 2026 3:03 PM | Updated on Sep 26 2026 3:14 PM

Team-India-Lands-Nagoya-Play-Asian Games-Travels-Bullet Train-Tokyo

Photo Credit: BCCI Twitter

ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు టీమిండియా గ‌త‌వార‌మే జ‌పాన్‌లో అడుగుపెట్టింది. అయితే జ‌పాన్‌తో చారిత్ర‌క మ్యాచ్ అనంత‌రం రాజ‌ధాని టోక్యోలో గ‌డిపిన టీమిండియా బృందం శ‌నివారం ఆసియా గేమ్స్ జ‌రుగుతున్న న‌గోయాకు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో టోక్యో నుంచి న‌గోయాకు టీమిండియా బుల్లెట్ ట్రైన్‌లో ప్ర‌యాణించ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ త‌న ఎక్స్‌లో పంచుకుంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్ కార‌ణంగా హెడ్‌కోచ్ గంభీర్ భార‌త్‌లోనే ఉండిపోవ‌డంతో, శ్రేయ‌స్ అయ్య‌ర్ టీంకు మెంటార్ క‌మ్ కోచ్‌గా మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అనంత‌రం శ్రేయ‌స్ నేతృత్వంలోని జ‌ట్టు గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చింది. 


PC: BCCI Twitter

భారత్‌కు సీడింగ్‌, ఐసీసీ ర్యాంకింగ్‌ ఆధారంగా ఆసియా గేమ్స్‌లో నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ లభించిన విషయం తెలిసిందే.  సోమవారం జరిగే రెండో క్వార్టర్‌ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. 2023 ఆసియా గేమ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని టీమిండియా స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన సంగ‌తి తెలిసిందే.


PC: BCCI Twitter

కాగా ఈసారి క్రీడలకు మాత్రం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఫుల్‌ మెంబర్స్‌ జట్టుతో బరిలోకి దిగింది. శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని భారత జట్టులో అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శివమ్‌ దూబే, తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌ తదితర స్టార్లు ఉన్నారు.

ఇదీ చదవండి: టీమిండియా తరఫున అదే చివరిది: విరాట్‌ కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement