మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan Congratulates Indian Womens Kabaddi Team For Winning Gold Medal In Asian Games 2026, Check Post Inside | Sakshi
Sakshi News home page

మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు

Sep 26 2026 12:56 PM | Updated on Sep 26 2026 1:45 PM

YS Jagan Mohan Reddy Congratulates Indian Womens kabaddi team for winning Gold medal in Asian Games 2026

ఏషియన్‌ గేమ్స్‌ 2026లో స్వర్ణ పతకం గెలిచిన మహిళల కబడ్డీ జట్టుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఫైనల్లో ఇరాన్‌పై ఉత్కంఠభరిత విజయంతో స్వర్ణం గెలిచి దేశం గర్వించేలా చేశారని ప్రశంసించారు. 

సంజు దేవి అద్భుత ప్రదర్శనతో పాటు చివరి నిమిషాల్లో జట్టు ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఆకట్టుకుందని కొనియాడారు. దేశంలోని మరింత మంది యువతులు క్రీడల వైపు అడుగులు వేయడానికి ఈ విజయం స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.

కాగా, హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్‌ ఇరాన్‌ను 37-34తో ఓడించి, వరుసగా రెండో ఆసియా క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం.మరోవైపు ఇవాళే పురుషుల కబడ్డీ జట్టు కూడా ఇరాన్‌తో స్వర్ణం​ కోసం పోటీపడనుంది.

మహిళల కబడ్డీలో పతకంతో భారత్‌ ఖాతాలో మూడో స్వర్ణం, మొత్తంగా 27వ పతకం చేరింది. ప్రస్తుతం భారత్‌ పతకాల పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది.  చైనా 169 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 

ఇదీ చదవండి: ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్‌


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement