kabaddi
-
అజేయంగా... ఆసియా చాంపియన్‌గా!
టెహ్రాన్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత మహిళల కబడ్డీ జట్టు తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఇరాన్లో జరిగిన మహిళల ఆసియా కబడ్డీ ఆరో చాంపియన్‌షిప్‌లో టీమిండియా టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో, ఆ తర్వాత ఫైనల్లోనూ జైత్రయాత్ర కొనసాగించి ఐదోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. టైటిల్ పోరులో భారత జట్టు 32–25 పాయింట్లతో తేడాతో ఆతిథ్య ఇరాన్ జట్టును ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 56–18 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపై ఘనవిజయం అందుకుంది. లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో టీమిండియా 64–23 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై, రెండో మ్యాచ్‌లో 76–21 పాయింట్లతో థాయ్‌లాండ్ జట్టుపై, మూడో మ్యాచ్‌లో 73–19 పాయింట్లతో మలేసియా జట్టుపై గెలుపొందాయి. మొత్తం ఏడు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ జట్లు... గ్రూప్ ‘బి’లో ఇరాన్, ఇరాక్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘బి’లోని నాలుగో జట్టు చైనీస్ తైపీ జట్టు చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో రాణించిన భారత జట్టు ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే వరల్డ్‌కప్ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఆసియా చాంపియన్‌షిప్ నెగ్గిన భారత జట్టుకు సోనాలి విష్ణు షింగేట్ కెపె్టన్‌గా, పుష్ప రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. జాతీయ చాంపియన్‌షిప్‌లో ఇండియన్ రైల్వేస్ తరఫున ఆడిన సోనాలి గోల్డెన్ రెయిడ్‌తో తన జట్టును విజేతగా నిలిపింది. పూజా కజిలా, నిధి శర్మ, పూజా నర్వాల్, ఆమ్రపాలి గలాండె, నేహా దక్ష్ , సంజూ దేవి, జ్యోతి ఠాకూర్, సాక్షి శర్మ, భావన దేవి, రీతూ మిగతా సభ్యులుగా ఉన్నారు. 2005లో హైదరాబాద్‌లో తొలిసారి ఆసియా చాంపియన్‌షిప్‌ను నిర్వహించగా... భారత జట్టు విజేతగా అవతరించింది. అనంతరం 2007లో టహ్రాన్ (ఇరాన్)లో జరిగిన రెండో ఆసియా చాంపియన్‌షిప్‌లో, 2008లో మదురై (భారత్)లో జరిగిన మూడో ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. 2008 తర్వాత ఎనిమిదేళ్లకు మళ్లీ ఆసియా చాంపియన్‌షిప్ జరిగింది. 2016లో బుసాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన నాలుగో ఆసియా చాంపియన్‌షిప్‌లో దక్షిణ కొరియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. 2017లో గొర్గాన్ (ఇరాన్)లో జరిగిన ఐదో ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత జట్టు దక్షిణ కొరియాను ఓడించి నాలుగోసారి చాంపియన్‌గా> నిలిచింది. 2017 తర్వాత మళ్లీ ఎనిమిదేళ్లకు నిర్వహించిన ఈ మెగా ఈవెంట్లో మరోసారి భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. -
National Kabaddi Championship: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లకు నిరాశ
కటక్: డిఫెండింగ్ చాంపియన్ హరియాణా శుక్రవారం మొదలైన సీనియర్ జాతీయ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. తెలుగు రాష్ట్రాల జట్లకు ఓటమి ఎదురవగా... హరియాణాతో పాటు రైల్వేస్, మధ్యప్రదేశ్ జట్లు కూడా భారీ విజయాలతో టోర్నీని ఆరంభించాయి. పూల్ ‘ఎ’లో హరియాణా 50–20 స్కోరుతో తెలంగాణ జట్టును ఓడించింది.పూల్ ‘డి’లో మధ్యప్రదేశ్ 59–35తో ఆంధ్రప్రదేశ్‌పై ఘనవిజయం సాధించింది. ఇదే పూల్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో చండీగఢ్ 40–24తో గుజరాత్‌పై గెలిచింది. పూల్ ‘బి’లో రైల్వేస్ 59–17తో మణిపూర్‌పై ఏకపక్ష విజయం సాధించగా... పూల్ ‘ఎఫ్’లో ఒడిశా 57–28తో విదర్భపై జయభేరి మోగించింది. పూల్ ‘సి’లో మహారాష్ట్ర 39–35తో కేరళపై పోరాడి గెలిచింది.బరిలో ఉన్న 30 జట్లను ఎనిమిది పూల్స్‌గా విభజించి ముందుగా ప్రిలిమినరీ మ్యాచ్‌ల్ని నిర్వహిస్తున్నారు. ఒక్కో పూల్ నుంచి రెండేసి జట్ల చొప్పున నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. -
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11: ఎదురులేని పుణెరి పల్టన్
హైదరాబాద్, 4 నవంబర్ 2024 : డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్ టాప్ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 49-30తో పుణెరి పల్టన్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ సమిష్టిగా మెరిసిన పుణెరి పల్టన్ 19 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేయటం విశేషం. పుణెరి పల్టన్ ఆటగాళ్లలో ఆకాశ్ షిండె (11 పాయింట్లు) సూపర్ టెన్తో మెరువగా.. పంకజ్ మోహితె (8 పాయింట్లు), మోహిత్ గోయత్ ( 5 పాయింట్లు), ఆమన్ ( 5 పాయింట్లు), గౌరవ్ ఖత్రి ( 5 పాయింట్లు) అదరగొట్టారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమన్ సింగ్ ( 13 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఒంటరి పోరాటం చేశాడు. పుణెరి పల్టన్ ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించగా, గుజరాత్ జెయింట్స్ ఐదు మ్యాచుల్లో నాల్గో పరాజయం చవిచూసింది.పల్టన్ వన్‌సైడ్ షో : వరుస విజయాల జోరుమీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్.. గుజరాత్ జెయింట్స్‌పై పంజా విసిరింది. ప్రథమార్థంలోనే ఆ జట్టుపై ఏకంగా 21 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. ప్రథమార్థం తొలి ఐదు నిమిషాల్లో, చివరి ఐదు నిమిషాల ఆటలో గుజరాత్ జెయింట్స్‌ను ఆలౌట్ చేసిన పుణెరి పల్టన్ 30-9తో వన్‌సైడ్ షో చేసింది. కెప్టెన్ అస్లాం ఇనందార్ బరిలో లేకపోయినా.. ఆకాశ్ షిండే, పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లు కూతలో కేక పెట్టించారు. పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లు కండ్లుచెదిరే సూపర్ రెయిడ్లతో ఆకట్టుకున్నారు. డిఫెన్స్‌లో గౌరవ్ ఖత్రి, ఆమన్ ట్యాకిల్స్ జెయింట్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. తొలి పది నిమిషాల్లో 14-5తో ముందంజ వేసిన పుణెరి పల్టన్.. తర్వాతి పది నిమిషాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాయింట్లు సాధించింది. గుజరాత్ జెయింట్స్ పూర్తిగా తేలిపోయింది. గుమన్ సింగ్ కూతలో మెరిసినా.. ఇతర ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారు.గుజరాత్ పుంజుకున్నా.. పుణెరి అదే జోరు : విరామం అనంతరం సైతం పుణెరి పల్టన్ జోరు తగ్గలేదు. గుజరాత్ జెయింట్స్ ఆట కాస్త మెరుగైనా.. పుణెరి పల్టన్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో రాణించలేదు. ద్వితీయార్థం తొలి పది నిమిషాల తర్వాత పుణెరి పల్టన్ 41-16తో 25 పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన గుజరాత్ జెయింట్స్ ఆఖరు ఐదు నిమిషాల ఆట మిగిలి ఉండగా పుణెరి పల్టన్‌ను ఆలౌట్ చేసింది. పాయింట్ల అంతరం తగ్గించేందుకు చివరి ఐదు నిమిషాల్లో మంచి ప్రయత్నమే చేసింది. అయినా, పుణెరి పల్టన్ అలవోకగా సీజన్లో ఐదో విజయం సాధించింది. ద్వితీయార్థంలో పుణెరి పల్టన్ 19 పాయింట్లు సాధించగా, గుజరాత్ జెయింట్స్ 21 పాయింట్లు దక్కించుకుంది. -
హైదరాబాద్ : మొదలైన ప్రో కబడ్డీ పోటీలు..బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సందడి (ఫొటోలు)
-
సివంగివే సివంగివే... నీ త్యాగమే గుర్తించగా.. సాహో అంటూ మోకరిల్లదా లోకమే
పాటలు అంటే సరదాగా పాడుకునేవే కావు శక్తి మాత్రలు కూడా. తాజా విషయానికి వస్తే ఇండియన్ ఉమెన్ కబడ్డీ కోచ్ కవితా సెల్వరాజ్ ‘రెయిన్ డ్రాప్ ఫౌండేషన్’ నిర్వహించిన సమావేశంలో విజయ్ ‘బిగిల్’ (తెలుగులో విజిల్) సినిమాలో ఏఆర్ రెహమాన్ పాడిన ‘సివంగివే’ పాట ఎంత ఇన్స్పైర్ చేసిందో చెప్పింది. స్వయంగా ఆ పాట పాడింది. డెబ్బై వేలకు పైగా వ్యూస్‌తో ఈ వీడియో దూసుకుపోతోంది. అట్లీ డైరెక్షన్లో వచ్చిన ‘బిగిల్’ సినిమాలో విజయ్ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా నటించాడు. మహిళా క్రీడాకారులలో స్ఫూర్తి, ధైర్యం నింపి విజయం వైపు తీసుకువెళ్లే క్రమంలో వినిపించే పాట సివంగివే. ఈ పాట (తెలుగు)లో నుంచి కొన్ని లైన్లు... ‘అడుగులే జలిపించు/ పిడుగులై ఒళ్లు విరుచుకో/ విను వీధి దారిన మెరుపులా/ భూమిని బంతాడు సివంగివే సివంగివే/ తలవంచె మగజాతి నీకే/ నీ త్యాగమే గుర్తించగా/సాహో అంటూ మోకరిల్లదా లోకమే -
నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే.. : మంత్రి పొన్నం
సంగారెడ్డి: గ్రామీణ యువత క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడా స్ఫూర్తి ఐక్యతను ప్రోత్స హిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పోతారం(ఎస్) లో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను సందర్శించి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే ఆడేదని, ఈ ఊరు నుంచి కబడ్డీ క్రీడాకారులు పోలీసులు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కబడ్డీ క్లబ్ అధ్యక్షుడు మడక కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్‌లు కేడం లింగమూర్తి, బత్తిని సాయిలు, ఎంపీటీసీ భొమ్మగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ రథం అందజేస్తా.. లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్, కరీంనగర్ రెనే ఆస్పత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని సీవీ రామన్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో మంత్రి వైద్య పరీక్షలు చేసుకున్నారు. శిబిరంలో ప్రముఖ ఛాతీ వైద్యులు, గుండె సంబంధించిన వైద్యులు, జనరల్ ఫిజీషియన్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు, వైకుంఠ రథాలు పెట్టుకోవడానికి వసతి కోసం కలెక్టర్, ఆర్డీఓలతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లయన్స్ క్లబ్‌కు నా తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అయిలేని అనిత, వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, లయన్స్ క్లబ్ నిర్వాహకులు రాజగోపాల్రావు, కాయిత నారాయణ రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రిని సన్మానించిన ఆర్టీసీ ఉద్యోగులు హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ ఉద్యోగులు శాలువా కప్పి సన్మానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017 సంవత్సరానికి సంబంధించి వేతన సవరణ 21 శాతం ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి చదవండి: హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా.. : బీబీ పాటిల్ -
క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేలా.. ‘ఆడుదాం ఆంధ్ర’
డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ: కబడ్డీ క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ వెంకటరెడ్డి) అన్నారు. బుధవారం రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలకు సంబంధించి విశాఖపట్నంలో మంగళవారం రాత్రి ముగింపు కార్యక్రమం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారన్నారు. కబడ్డీలో రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులను మరింత తీర్చిదిద్దాలంటూ సీఎం జగన్మోహన్రెడ్డి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌కు బాధ్యత అప్పగించారన్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్‌లో భాగంగా ప్రో కబడ్డీ క్యాంప్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమన్, బాలకృష్ణారెడ్డిలను, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కోచింగ్ క్యాంపునకు సంధ్య, సతీష్‌లను అప్పగించారన్నారు. దానికి కట్టుబడి వారిని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రో కబడ్డీ తరహా ఆంధ్ర కబడ్డీ లీగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్, వైజాగ్ సెక్రటరీ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాలు బెణికింది అంతే
చిత్తూరు కలెక్టరేట్: గత టీడీపీ ప్రభుత్వం క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం చూపింది. క్రీడాకారులు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిస్తేజంగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆడుదాం ఆంధ్రా పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీ ఎత్తున క్రీడలను నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఆయా క్రీడల్లో గ్రామీణ ఆణిముత్యాలను వెలికితీస్తోంది. అయితే వీటిపైనా రామోజీరావు తన వక్రబుద్ధిని చాటుకున్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో ఒక కబడ్డీ క్రీడాకారిణి గాయపడితే ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ‘ఈనాడు’లో అసత్య కథనాన్ని అచ్చేశారు. ‘సాయం కావాలా.. వెళ్లి సీఎంను అడగండి’ అనే శీర్షికతో విషం జిమ్మారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఇవి.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఆర్పురం గ్రామానికి చెందిన మునెమ్మకు కబడ్డీ అంటే ఎంతో ఇష్టం. టీడీపీ పాలనలో క్రీడలకు ప్రోత్సాహం లేకపోవడంతో ఆమె కబడ్డీ పట్ల ఉన్న ఆసక్తిని చంపేసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా పోటీలు నిర్వహించడంతో ఎంతో సంతోషపడింది. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. గత నెల 25న నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఆమె ఎడమ కాలు బెణికింది. ఆ సమయంలో అక్కడున్న వైద్యాధికారులు, అధికారులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే కాలు బెణికిందంతే అని చెప్పి తన భర్తతో కలిసి పుత్తూరుకు వెళ్లి మునెమ్మ కట్టు కట్టించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎడమకాలు బెణికిన మునెమ్మ వైద్య చికిత్సల నిమిత్తం మంగళవారం అధికారులు రూ.35 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్డీవో చిన్నయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ, కార్వేటినగరం తహసీల్దార్ పుష్పవతి, ఎంపీడీవో శ్రీధర్‌లు మునెమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి సమస్యలేదని, ఆటల్లో గాయాలు సహజమేనని మునెమ్మఅధికారులకు తెలిపారు. ఆడే సమయంలో ఎడమ కాలు బెణికిందని చెప్పారు. ఆ సమయంలో నొప్పి ఏమీ లేకపోవడంతో తామే పుత్తూరుకు వెళ్లి కట్టు కట్టించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని మునెమ్మకు అధికారులు హామీ ఇచ్చారు. -
Pro Kabaddi 2024: పట్నా పైరేట్స్‌కు ఎనిమిదో గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో సొంతగడ్డపై పట్నా పైరేట్స్ జట్టు అదరగొట్టింది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ జట్టు 32–20 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఈ టోర్నీలో పైరేట్స్కిది ఎనిమిదో విజయం కావడం విశేషం. పట్నా తరఫున సందీప్ (7 పాయింట్లు), అంకిత్ (6 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–36తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. హరియాణా తరఫున శివమ్ 12 పాయింట్లు, సిద్ధార్థ్ 11 పాయింట్లు, వినయ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. -
కబడ్డీ.. కబడ్డీ... గెలిచింది
40 ఏళ్ల క్రితం సమాజం ఛీత్కారాల మధ్య కబడ్డీ ఆటను ఎంచుకుంది. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. వివక్షలను ఎదుర్కొంది. అవార్డులను గెలుచుకుంది. వందలాది అమ్మాయిలను చాంపియన్లుగా మలిచి అంతర్జాతీయ కబడ్డీ కోచ్‌గా పేరొందింది మహారాష్ట్రలోని నాసిక్ వాసి శైలజా జైన్. ఆటుపోట్ల మధ్య ౖధైర్యంగా ఎంచుకున్న మార్గం గురించి ఎన్నో విషయాలను పంచుకుంటుంది. ‘‘నా చిన్నతనం అంతా నాగపూర్‌లో గడిచింది. అమ్మ టీచర్, నాన్న బ్యాంకు ఆఫీసర్. అమ్మకు క్రీడలంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే చీర కట్టుకుని కబడ్డీ ఆడేది. నేను కూడా ఆమె నుండి ఈ గుణాన్ని వారసత్వంగా పొందాను. అమ్మనాన్నలకు నాతో కలిపి నలుగురం ఆడపిల్లలం సంతానం. కానీ, నేనే క్రీడాకారిణి అయ్యాను. స్కూల్లో జరిగే క్రికెట్, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ.. ప్రతి పోటీలో పాల్గొనేదానిని. ఒక నెల రోజులు ఇంటికి దూరంగా క్రికెట్ క్యాంపులో చేరడానికి వెళ్లాను. ఈ రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేవు కానీ, యాభై ఏళ్ల క్రితం అంటే ఆడపిల్లలు ఆడుకోవడం అంత సులువు కాదు. హాఫ్ ప్యాంట్ ‘అమ్మాయి ఎదిగింది. హాఫ్ ప్యాంట్ వేసుకొని మగపిల్లల్లా ఆడుకోవడానికి బయటకు వెళుతోంది చూడు’ అని స్థానికులు చెప్పుకునేవారు. కానీ, మా అమ్మనాన్నలు ఎప్పుడూ అలాంటి మాటలు పట్టించుకోలేదు. నాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు, సపోర్ట్‌గా నిలిచారు. కబడ్డీ క్లబ్లో చేరడంతో నా జీవితమే మారిపోయింది. మొదటి మార్పు నాగపూర్‌లోనే మరాఠా లాన్సర్స్ పేరుతో కబడ్డీ క్లబ్ ఉండేది. అక్కడి కోచ్ నా స్నేహితుల్లో ఒకరిని ప్రాక్టీస్‌కు పిలిచారు. నన్ను పిలవలేదు. ఆ రోజు చాలా ఏడ్చాను. నాకు అవకాశం రాదనుకున్నాను. కానీ నేరుగా క్లబ్‌కి వెళ్లి, కోచ్‌తో నాకూ ఆడాలని ఉందని చెప్పాను. వారి అనుమతితో క్లబ్లో చేరిపోయాను. అటు నుంచి మిగతా క్రీడలను వదిలేసి కబడ్డీపైనే దృష్టి పెట్టాను. గ్రౌండ్‌కు చేరుకోవడంలో నేనే ముందుండేదానిని. వేరే వాళ్లు రాకముందే గ్రౌండ్ ఊడ్చటం, నీళ్లు చల్లడం, మార్కింగ్ చేయడం మొదలైన పనులన్నీ చేసేదాన్ని. చీకటి దారుల గుండా.. ఇంటికి గ్రౌండ్‌కి మధ్య 12 కి.మీ దూరం. అందుకే ఇంట్లో సైకిల్ కావాలని పట్టుబట్టాను. సైకిల్‌పై కాలేజీకి, ప్రాక్టీస్ కోసం క్లబ్‌కు వెళ్లేదాన్ని. దీని కోసం నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్ ఏరియాను దాటాల్సి వచ్చేది. సాయంత్రం 5 గంటల నుంచే సివిల్ లైన్స్ మొత్తం నిర్మానుష్యంగా మారేవి. కానీ, నేను 8 గంటలకు చీకట్లో అదే మార్గంలో సైకిల్‌పై ఇంటికి వచ్చేదాన్ని. ఎప్పుడూ భయం అనిపించలేదు. ఎవరైనా వేధించినప్పుడు నడిరోడ్డుపై కొట్టి గుణపాఠం చెప్పేదాన్ని. చిన్న చిన్న అవార్డులైనా... యూనివర్శిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాను. చిన్న చిన్న అవార్డులు వచ్చినా గర్వంగా ఫీలయ్యేదాన్ని. నాకు నేనే అత్యుత్తమ ప్లేయర్‌ననే విశ్వాసం పెరుగుతుండేది. పెళ్లయ్యే వరకు అదే మైదానంలో రోజూ ప్రాక్టీస్ చేసేదాన్ని. పెళ్లి తర్వాత నాసిక్‌కు వచ్చాను. అప్పటికే చదువు పూర్తయింది కాబట్టి ఉద్యోగం వేటలో ఉన్నాను. ఆ సమయంలో రాష్ట్ర కోచ్‌ని కలిశాను. కోచ్ అవడానికి ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ నుంచి కోర్సు చేయాలని సలహా ఇచ్చారు. బెంగళూరు వెళ్లి కోర్సు పూర్తి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక క్రీడా విభాగంలో కోచ్ ఉద్యోగం వచ్చింది. పాఠశాల స్థాయి నుంచి... కబడ్డీ, ఖోఖో ఆటలకు నేనే కోచ్‌ని. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను సిద్ధం చేయడం ప్రారంభించాను. నా శిక్షణలో అమ్మాయిలు అవార్డులు గెలుచుకోవడం చూసి నాలో ధైర్యం కూడా పెరుగుతూ వచ్చింది. శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అందుకు మా అత్తింటివారు ఎలాంటి అడ్డు చెప్పలేదు. స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఆరు నెలల్లోనే దానిని తిరిగి ఇచ్చేశాను. ప్రమోషన్ తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారని చెప్పారు. కానీ, ప్రమోషన్ పేరుతో ఆఫీసులో కూర్చొని ఉండటం నా వల్ల అయ్యే పని కాదు. గ్రౌండ్‌లోనే నా భవిష్యత్తు ఉందని బలంగా నమ్మేదాన్ని. అందుకే, తక్కువ డబ్బు వచ్చినా గ్రౌండ్‌ను వదలలేదు. డిప్రెషన్‌ను అధిగమించి.. నా దగ్గర శిక్షణ తీసుకున్న 400 మంది అమ్మాయిలకు జాతీయ స్థాయిలో ఆడే అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నాను. రికార్డ్ ఉన్నప్పుటికీ టీమ్ ఇండియా టీ షర్ట్ ధరించే అవకాశం రాలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపికైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అడుగడుగునా అవరోధాలు. దీంతో డిప్రెషన్‌కు గురయ్యాను. కొన్నాళ్లు ఏం చేయాలో అర్థం కాని స్థితి. 2008లో జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో కోచ్‌గా అవకాశం వచ్చింది. ఫలితాలు బాగుండటంతో ఆ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వెళ్తానని అందరికీ చెప్పాను. నా కల నెరవేరుతుందని అనుకున్నాను. కానీ, నా ఆశలు మళ్లీ నేలకు జారాయి. అదే ఏడాది మళ్లీ ప్రమోషన్ వచ్చింది. 2014 వరకు అదే జాబ్‌లో కొనసాగి రిటైరయ్యాను. అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అంతర్జాతీయంగా అవకాశాలు... రిటైరయ్యాక ఇరాన్ నుండి బాలికల జట్టుకు కోచ్‌గా ఉండమని ఆహ్వానం అందింది. మా ఇంట్లోవాళ్లు ఆ దేశంలో ఉండటం సులభం కాదన్నారు. ఒకసారి పాస్‌పోర్ట్‌పై ఇరాన్ ముద్ర పడితే ఇక అంతే అన్నారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా వెళ్లాను. అలా మొదలైన నా ప్రయాణం రెండేళ్లకు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల వరకు వెళ్లింది. అక్కడి అలవాట్లు, తిండి, భాష, వేషధారణ అన్నీ మనకు భిన్నమైనవే. అయినా లభించిన అవకాశాన్ని బంగారంగా మార్చుకునే ధైర్యాన్ని పెంచుకున్నాను. నేను జైన్ కమ్యూనిటీకి చెందినదానిని, మాంసాహారం తినలేను. ఇరాన్లో శాకాహారం దొరకడం చాలా కష్టం. కోచ్‌గా ఉంటూ నాన్‌వెజ్ తినకుండా ఉండటం ఎలా సాధ్యం అని అక్కడివాళ్లు ఆశ్చర్యపోయేవారు. భారతదేశానికి వచ్చినప్పుడు నా ఆహారానికి కావల్సిన పదార్థాలను తీసుకెళ్లేదాన్ని. కానీ, ఆహారం గురించి పై అధికారులకు ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. రాని భాషలు నేర్చుకున్నాను. టీమ్‌తో అనుబంధాలను పెంచుకున్నాను. ఏడాదిన్నరలో 14 క్యాంపులు నిర్వహించాను. జకార్తా నుంచి భారత్‌కు జకార్తా ఆసియా క్రీడల్లో నా జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకొని భారత జట్టుతో ఫైనల్స్‌కు ఎంపికయ్యింది. ఆ మ్యాచ్‌లో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. నా దేశానికి ప్రత్యర్ధిగా నేనే ఉన్నాను... దీంతో తిండి, నిద్రకు దూరమయ్యాను. కానీ, నా బాధ్యత గుర్తుకొచ్చింది. నా జట్టు అమ్మాయిలను ప్రోత్సహించాను. నేను చెప్పిన ట్రిక్కులు పాటించి, గెలుపొందారు. స్వర్ణం గెలిచిన తర్వాత అమ్మాయిలు గ్రౌండ్లో ఉత్సాహంగా జెండాతో పరుగులు ప్రారంభించారు. నా చేయి పట్టుకుని ‘మేడమ్ రండీ.. మీ వల్లే మాకు బంగారు పతకం వచ్చింది..’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ, వారితో ‘నా కాంట్రాక్ట్ మిమ్మల్ని ఫైనల్ మ్యాచ్ వరకే, అది పూర్తయిపోయింది. నా భారత ఆటగాళ్లు బాధపడుతుంటే, నేను సంబరాలు చేసుకోలేను’ అని చెప్పాను. తొలిసారి భారత్ ఓడిపోయి ఇరాన్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రలో నా పేరు కూడా నమోదయ్యింది. స్వదేశానికి... ‘నా దేశాన్ని గెలిపించుకోవాలే కానీ, పరాయి దేశాన్ని కాదు’ అనే ఆలోచనతో తిరిగి నాసిక్ వచ్చేశాను. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న గిరిజన బాలికలకు కబడ్డీలో శిక్షణ ఇస్తున్నాను. వారిని నా అకాడమీకి తీసుకువచ్చి డైట్ కిట్స్ ఇస్తుంటాను. ఇందుకు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నుంచి సహాయం అందుతుంది. గిరిజన బాలికలు క్రీడల్లో చాలా బాగా రాణిస్తున్నారు. దేశానికి మంచి క్రీడాకారిణులు లభించేలా వారిని తీర్చిదిద్దడంలో ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను’’ అని వివరించారు శైలజా జైన్. -
Adudam Andhra 2023 Photos: అంతటా క్రీడా సంబరం.. ఆడుదాం ఆంధ్రాకు అద్భుత స్పందన (ఫొటోలు)
-
Adudam Andhra : ఆట సూపర్ హిట్ (ఫొటోలు)
-
ఏపీ క్రీడా సంబురం: టాలెంట్ హంట్‌లో CSK.. ఇంకా
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి పట్టం కట్టేందుకు వీలుగా ప్రవేశపెట్టిన అతిపెద్ద క్రీడోత్సవాన్ని గుంటూరులో ఆరంభించారు. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ ఇందుకు వేదికైంది. దేశచరిత్రలోనే మైలురాయి పోటీల ప్రారంభం సందర్భంగా సీఎం వైస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ఈ క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే మైలురాయి. ఈ రోజు నుంచి... 47 రోజులపాటు ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను నిర్వహించనున్నాం. ఆడుదాం ఆంధ్రా గొప్ప పండుగ. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి వ్యాయామం వల్ల బీపీ, డయాబెటిక్.. అదుపులో ఉంటాయి. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసరం. అందుకే..గ్రామస్థాయి నుంచి అడుగులేస్తున్నాం. గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి .. దేశానికి అందిస్తాం. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో.. తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో.. పోటీలు జరుగుతాయి. 9 వేల ప్లే గ్రౌండ్స్ రెడీగా ఉన్నాయి. 47 రోజుల్లో.. 5 దశల్లో పోటీల నిర్వహణ ఉంటుంది. ఈ క్రీడా సంబురాలు ప్రతి ఏడాది జరుగుతాయి. రూ.12 కోట్లకు పైగా నగదు బహుమతులు అందజేస్తాం’’ అని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా.. ►తొలి దశలో.. జనవరి 9వ తేదీ వరకు.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పోటీలు.. ►జనవరి 10 నుంచి 23 వరకు.. మండల స్థాయిలో పోటీలు.. ►జనవరి 24 నుంచి 30 వరకు.. నియోజకవర్గ స్థాయిలో పోటీలు.. ►ఫిబ్రవరి 6వ తేదీ నుంచి.. 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. అదే విధంగా ఉదయం 5 గంటల నుంచి.. సాయంత్రం 7 గంటల వరకు.. పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. ఆడుదాం ఆంధ్ర- మరిన్ని విశేషాలు ►రిఫరీలుగా.. 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ►పోటీ పడనున్న.. 34.19 లక్షల క్రీడాకారులు ►వీరిలో.. 10 లక్షల మందికిపైగా మహిళలు.. రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం ►గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను.. ప్రోత్సాహించాలనే లక్ష్యంతో.. రూ.119.19 కోట్లతో సీఎం జగన్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పోటీలను నిర్వహిస్తోంది. దాదాపు రూ.42 కోట్లతో..క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో.. కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన.. 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లు ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు. ►ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో.. మండలస్థాయిలో 17.10 లక్షల .. టీ షర్టులు, టోపీలతో కూడిన కిట్లు. ప్రొఫెషనల్స్‌ను గుర్తించేందుకు..ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం ►క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్.. ఆంధ్రా క్రికెట్ ఆసోషియేషన్ ►బ్యాడ్మింటన్‌లో సింధు.. శ్రీకాంత్ బృందాలు ►వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్.. ►కబడ్డీలో- ప్రొకబడ్డీ ఆర్గనైజర్లు.. ►ఖోఖోలో- రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు.. టాలెంట్ హంట్ చేయనున్నారు. ►ఆన్లైన్, ఆఫ్ లైన్లో.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు.. ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం.. వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణ ఇప్పించి.. ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో.. అవకాశం కల్పించే దృక్పథంతో.. పోటీలను సీఎం జగన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
చాలా కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాం..టైటిల్ మనదే
-
విద్యార్థులతో కబడ్డీ ఆడుతున్న మంత్రి ఆర్కే రోజా
-
స్టూడెంట్స్ తో కబడ్డీ ఆడి దుమ్మురేపిన మంత్రి రోజా
-
Asian Games 2023: కబడ్డీలో భారత్‌కు స్వర్ణం
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ స్వర్ణ పతక జోరు కొనసాగుతుంది. ఈ ఒక్క రోజే భారత్ ఖాతాలో 6 స్వర్ణ పతకాలు చేరాయి. తాజాగా పురుషుల కబడ్డీలో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో భారత్.. ఇరాన్‌పై 33-29 తేడాతో నెగ్గింది. ఏషియన్ గేమ్స్ పురుషుల కబడ్డీలో మొత్తంగా భారత్‌కు ఇది 8వ స్వర్ణం. ఈ పతకంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 28కి చేరింది. మొత్తంగా ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఇప్పటివరకు 103కు (28 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు) చేరింది. ప్రస్తుతానికి పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. చైనా ఇప్పటివరకు 366 పతకాలు (193 స్వర్ణాలు, 107 రజతాలు, 66 కాంస్యాలు) సాధించింది. పతకాల పట్టికలో జపాన్ రెండో స్థానంలో (177; 48 స్వర్ణాలు, 62 రజతాలు, 67 కాంస్యాలు) ఉంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా (183; 39 స్వర్ణాలు, 55 రజతాలు, 89 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది. -
పాకిస్తాన్‌ను షేక్ చేస్తున్న 'స్లాప్' కబడ్డీ.. వీడియో వైరల్
మన దేశంలో కబడ్డీ ఆటకు యమ క్రేజ్ ఉంది. ముఖ్యంగా కబడ్డీ వరల్డ్‌కప్ పోటీల్లో మన దేశం మూడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఇండోర్ గేమ్‌గా పిలవబడే కబడ్డీ ఆటలో మనోళ్లు కింగ్ అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నారు. అటు వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ, మెడల్స్‌లోనూ మన దేశమే అగ్రస్థానంలో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో కబడ్డీకి ఉన్న క్రేజ్ దృశ్యా ప్రో కబడ్డీ లీగ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రో కబడ్డీ లీగ్ తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్లో స్లాప్ కబడ్డీ(Slap Or Tappad) తెగ వైరల్ అవుతోంది. వినటానికి కొత్తగా ఉన్నా ఆటతీరు మాత్రం కడుపుబ్బా నవ్వుకునేలా ఉంది. సాధారణంగా ఏడుగురు ఉండే కబడ్డీలా కాకుండా ఈ ఆట ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఒక ఆటగాడు కొట్టడం ద్వారా పాయింట్‌ను స్కోరు చేస్తాడు. మరో ఆటగాడు ఈ పాయింట్‌ని కోల్పొకుండా ప్రత్యర్థి నుంచి కాపాడుకుంటాడు. ఇందులో పంచ్‌లను ఫౌల్ లుగా పరిగణిస్తారు. ఇప్పుడు ఈ స్లాప్ కబడ్డీ నెట్టింట వైరల్ అవుతోంది. ఆటను చూడటానికి వచ్చిన వారి నుంచి వచ్చే డబ్బునే విజేతకి ఇస్తారు. ప్రస్తుతం స్లాప్ కబడ్డీకి పాకిస్తాన్లో ఎంతో ప్రజాదరణ ఉంది. ''ఒక ఆటగాడు తన ప్రత్యర్థిని ఎన్నిసార్లైనా కొట్టవచ్చు. ఇక్కడ సంఖ్య అంత ముఖ్యం కాదు. ఆటగాళ్లు గాయాలు తగలకుండా ప్రయత్నిస్తారు.'' అని పాకిస్థాన్ స్లాప్ ఆటగాడు ఒకరు మీడియాకు తెలిపారు. What fighting style is this 😧 pic.twitter.com/D5mNAXEVwK — Woman of Wonder 🐳 (@WonderW97800751) June 29, 2023 చదవండి: Ashes 2023: అండర్సన్‌పై వేటు.. బ్రూక్‌కు ప్రమోషన్; మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే WI Vs IND 2023: దిగ్గజంతో చేతులు కలిపిన రోహిత్, విరాట్.. -
Volleyball: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కొత్త పార్ట్నర్ పల్లవోలో పడోవా
భారతదేశపు ప్రీమియర్ వాలీబాల్ జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, ఇటలీకి చెందిన సూపర్‌లిగాకు చెందిన ప్రముఖ క్లబ్ పల్లవోలో పడోవాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని వల్ల బ్లాక్ హాక్స్ ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి కోచింగ్ మరియు విస్తృత మౌలిక సదుపాయాలను అందుబాటులోకి రానున్నాయి. అత్యుత్తమ వ్యూహాలు మరియు సాహసోపేత నిర్ణయాలకు పెట్టింది పేరైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, భారత వాలీబాల్‌లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో మొదటి ప్రపంచ స్థాయి కోచ్‌ను నియమించడం, సంచలనాత్మక షోబిజ్ అనుభవాన్ని సృష్టించడం మరియు అభిమానుల తో అనుబంధం విస్తరించడానికి ప్రముఖులను చేర్చుకుంది బ్లాక్ హాక్స్. 🔥 𝗔 𝗚𝗔𝗠𝗘-𝗖𝗛𝗔𝗡𝗚𝗘𝗥! We are going to usher in a new era in global volleyball, as our partnership with @pallavolopadova will see players and coaches get a chance to learn from some of the best in the world! 🏐#HawkAttack #HyderabadBlackHawks #PallavoloPadova pic.twitter.com/2RHS80kb85 — Hyderabad Black Hawks (@blackhawkshyd) May 19, 2023 ఇటాలియన్ సూపర్లిగాలో ప్రధాన కేంద్రంగా పల్లవోలో పడోవా ఉంది. అత్యుత్తమ గేమ్ సెన్స్ ద్వారా తన ఆటగాళ్లను శక్తివంతం చేయడంలో ఈ క్లబ్ పేరు గాంచింది. వీరిద్దరి భాగస్వామ్యం వల్ల రాబోయే రోజుల్లో బ్లాక్ హాక్స్ అనేక మంది ఆటగాళ్లను ఇటలీలోని పడోవాకు శిక్షణ కోసం పంపుతుంది. అలాగే ప్రపంచ స్థాయి కోచింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మరియు యూత్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రూపొందించడంలో బ్లాక్ హాక్స్‌కు పడోవా తమ కోచ్‌లను భారత్‌కు పంపుతుంది. బ్లాక్ హాక్స్ ముఖ్య యజమాని, అభిషేక్ రెడ్డి కంకణాల మాట్లాడుతూ " ప్రపంచంలోనే అతిపెద్ద టాలెంట్ పూల్ భారతదేశం దగ్గర ఉంది. మన ప్రతిభావంతులైన యువతను ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా తీర్చిదిద్దడానికి, మాకు అత్యున్నత మౌలిక సదుపాయాలు మరియు అగ్రశ్రేణి కోచింగ్ రెండూ అవసరం. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ మరియు పడోవాతో మా కొత్త భాగస్వామ్యం తో మేము దానిని సాకారం చేస్తున్నాము" అని అన్నారు. 💪🏻𝐀 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐈𝐂 𝐏𝐀𝐑𝐓𝐍𝐄𝐑𝐒𝐇𝐈𝐏! We are delighted to join hands with @pallavolopadova to bring a new era in global volleyball! 🏐#HawkAttack #HyderabadBlackHawks #RuPayPrimeVolley #AsliVolleyball #PallavoloPadova pic.twitter.com/Io3vgCNDCN — Hyderabad Black Hawks (@blackhawkshyd) May 19, 2023 పడోవా ప్రెసిడెంట్, జియాన్కార్లో బెట్టియో, మాట్లాడుతూ.. "కోచింగ్‌లో 50 సంవత్సరాల అనుభవం ఉంది, మేము మా నైపుణ్యాన్ని ఇక్కడి ఆటగాళ్లకు పంచడానికి ఆసక్తిగా ఉన్నాము, మేము మా క్లబ్‌లు వాలీబాల్ భవిష్యత్తును పునర్నిర్మించగలవనే నమ్మకం తో ఉన్నాము " అని అన్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యొక్క సూత్రప్రాయ స్పాన్సర్ A23 ఈ పార్ట్‌నర్‌షిప్‌పై సంతోషం వ్యక్తం చేసింది. "వాలీబాల్ వంటి నైపుణ్యం కలిగిన ఈవెంట్లను విస్తృత ప్రేక్షకులకు అందించడానికి మేము అంకితభావంతో ఉన్నాము. ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా మా బ్రాండ్ విజిబిలిటీని మాత్రమే కాకుండా భారతీయ వాలీబాల్ క్రీడాకారులు కు ప్రపంచ వేదికను అందిస్తుంది. మేము ఈ అవకాశం గురించి మరింత ఆసక్తి గా ఉన్నాము " అని అన్నారు. -
మీరెప్పుడైనా కబడ్డీ డ్యాన్స్ చూశారా? మీకోసమే ఈ వీడియో..
-
పల్నాడు జిల్లా పసుమర్రులో 17 ఏళ్ల ఫిరోజ్ గుండెపోటుతో మృతి
-
విషాదం: కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన 19 ఏళ్ల యువకుడు, చూస్తుండగానే...
సాక్షి, అనంతపురం: నిర్దిష్ట కారణాలేంటో తెలియదుగానీ ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా నిండా పాతికేళ్లు కూడా లేని యువత హార్ట్ అటాక్‌తో చూస్తుండగానే ప్రాణాలు విడుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నెల 1న అనంతపురం జిల్లాలో 19 ఏళ్ల తనూజ నాయక్ అనే యువకుడు కబడ్డీ ఆడుతూ కుప్పకూలిపోయాడు. అతన్ని బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండే తమ బిడ్డకు గుండెపోటు ఏంటని ఆ తల్లిదండ్రులు స్థాణువయ్యారు. దేవుడు తమకు అన్యాయం చేశాడని, ఆడుతూ పాడుతూ తిరిగే తమ కుమారుడికి ఇంత చిన్న వయసులో ఈ ప్రాణాలు తీసే రోగమేంటని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు తనూజ నాయక్ది మడకశిర మండలం అచ్చంపల్లి తండా. అనంతపురం పట్టణంలోని పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ ఫస్టియర్ చదువుతున్నాడు. కాగా, కబడ్డీ ఆడుతూ తనూజ నాయక్ కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు!) 17 ఏళ్లకే ప్రాణాంతక ‘పోటు’ పల్నాడు జిల్లా పసుమర్రులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఫిరోజ్‌కు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. -
మార్చి 2 నుంచి అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ పోటీలు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్-2023 మార్చి 2 నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్(ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్ శివారు హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం లభించేందుకు ఏఎస్ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జన్నార్ తెలిపారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్ ముంబై, పుణే మహానగర్ పరివాహన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొంటున్నాయని వివరించారు. కబడ్డీ పోటీలను గురువారం (మార్చి 2) ఉదయం 9.30 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారక తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు. -
విజయనగరం: కబడ్డీ ఆటలో యువకుడు మృతి
-
మూడేళ్ళ తర్వాత హైదరాబాద్‌లో కబడ్డీ సందడి
-
ఏపీ కబడ్డీ జట్టుకు కాంస్యం
పంచ్‌కుల (హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అండర్–18 మహిళల కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 15–50 పాయింట్ల తేడాతో హరియాణా చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర 45–23తో తమిళనాడును ఓడించి నేడు జరిగే ఫైనల్లో హరియాణాతో అమీతుమీకి సిద్ధమైంది. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకూ కాంస్య పతకాలు అందజేస్తారు. చదవండి: Kho Kho -League: ఖో–ఖో లీగ్‌లో జీఎంఆర్, అదానీ ఫ్రాంచైజీలు -
తగ్గేదేలే: నువ్వా.. నేనా?
-
రోజా కూతకు రాగానే మారుమోగిపోయిన స్టేడియం
-
తిరుపతి నగరంలో జాతీయ కబడ్డీ పోటీలు
-
కబడ్డీ పోటీలకు ముస్తాబు అవుతున్న తిరుపతి
-
కబడ్డీ కబడ్డీ.. అంటూ బరిలోకి స్పీకర్ తమ్మినేని సీతారాం
సరుబుజ్జిలి/పాతపట్నం: సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపే ప్రజాప్రతినిధులు కాస్త విరామం తీసుకున్నారు. ప్రత్యర్థులు, రాజకీయాలంటూ ఎప్పుడూ హాట్‌హాట్‌గా కనిపించే నేతలు రాజకీయాలకు కాసేపు విరామం పలికి.. కూల్‌గా ఆటలాడారు. ఇందుకు ‘సీఎం కప్’ పోటీలు వేదికగా నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం క్రీడా పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ.. కబడ్డీ.. అంటూ బరిలోకి దిగారు. స్వయంగా తన కుమారుడు చిరంజీవి నాగ్‌తో తలపడి స్పీకర్ తమ్మినేని కబడ్డీ ఆడటం అందరినీ అలరించింది. అలాగే, పాతపట్నం మండలం కొరసవాడ పాఠశాల మైదానంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్వయంగా బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. చదవండి: (సీతమ్మ పెద్ద మనసమ్మ.. రూ.3 కోట్ల విలువైన..) -
భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా.. వీడియో వైరల్
MLA Roja Playing Kabaddi Video: నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్ మీట్’ నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 16 వరకు కొనసాగే ఈ క్రీడా పోటీలను సోమవారం రోజా దంపతులు ప్రారంభించారు. చదవండి: నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్: సీఎం జగన్ ఈ సందర్భంగా టాస్ వేసి కూతకు జట్టును ఎంపిక చేశారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ సరదాగా కాసేపు కబడ్డీ ఆడారు. సెల్వమణి, రోజా రెండు జట్లుగా విడిపోయి ఆటగాళ్లతో కలిసి హుషారుగా కబడ్డీ ఆడారు. కోర్టులోకి దిగి కూత పెట్టడానికి వెళ్లిన రోజాను ఔట్ చేయడానికి భర్త సెల్వమణి ప్రయత్నించగా విఫలమయ్యారు. అనంతరం సెల్వమణి కూడా కూతకు వెళ్లినా ఆయనను రోజాతో పాటు ఇతర క్రీడాకారులు ఔట్ చేయలేకపోయారు. సరదాగా రోజా కబడ్డీ ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చదవండి: AP Formation Day: ఏపీ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు -
భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా
-
మీరొస్తే కూత.. మేమొస్తే కోత: కబడ్డీ ఆడిన భారత్-అమెరికా సైనికులు
వాషింగ్టన్: భారత్-అమెరికా సైన్యాల మధ్య యుద్ధ్ అభ్యాస్ సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి 29వరకు దాదాపు 14 రోజుల పాటు జరగనున్న ఈ సంయుక్త విన్యాసాల్లో మన దేశం ఆర్మీ తరపున 350 మంది జవాన్లు పాల్గొంటుండగా.. అమెరికా నుంచి 300 మంది సైనికులు హాజరవుతున్నారు. అమెరికా బలగాలతో కలిసిపోయేందుకు... భారత సైన్యం వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో శనివారం ఇరు దేశాల సైనికులు కలిసిపోయి.. రెండు జట్లుగా ఏర్పడి కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాయి. అమెరికన్ సైన్యం మన కబడ్డీ కూత మోత మోగించగా.. భారత జవాన్లు ఫుట్‌బాల్ పోటీలో గోల్స్ మీద గోల్స్ చేశారు.. ఈ స్నేహపూర్వక క్రీడల్లో రెండు దేశాల సైన్యాలు... నాలుగు మిశ్రమ జట్లుగా ఏర్పడి పోటీ పడి.. క్రీడా స్ఫూర్తిని చాటారు. (చదవండి: మేరా భారత్ మహాన్: భగవద్గీత స్ఫూర్తి.. ఆకాశాన్ని అంటిన కీర్తి) మంచులో సందడి ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు మంచును విసురుకుంటూ ఎంజాయ్ చేశారు.. భారత్-అమెరికా సైన్యాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. ఇరుదేశాల సైన్యం ఒకరినినొకరు అర్థం చేసుకునేందుకు ఈ క్రీడలు బాగా ఉపయోగపడినట్లు సైనికాధికారులు తెలిపారు. భారత్- అమెరికా సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాలను 17వ సారి నిర్వహిస్తున్నారు. రెండు సైన్యాల మధ్య అవగాహన, పరస్పర సహకారం పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత్-అమెరికా సైన్యాల 16వ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బికానేర్లో జరిగాయి. చదవండి: ఒక మెట్టు కాదు... వంద మెట్లు పైకెదిగాం #WATCH | As part of 'Ice-breaking activities', Indian Army contingent and American contingent participated in friendly matches of Kabaddi, American Football and Volleyball at Joint Base Elmendorf Richardson, Anchorage, Alaska (US) (Video Source: Indian Army) pic.twitter.com/Xe6uM0NigT — ANI (@ANI) October 17, 2021 -
Viral: కబడ్డీ ఆడిన బీజేపీ మహిళా ఎంపీ
భోపాల్: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సరదాగా కబడ్డీ ఆడారు. ఆమె కబడ్డీ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం ఆమె భోపాల్‌లోని ఓ కాళీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె యువతుల కబడ్డీ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీని మహిళా క్రీడాకారులు కబడ్డీ ఆడాల్సిందిగా కోరారు. దీంతో ఆమె కొర్టులోకి అడుగుపెట్టి కబడ్డీ ఆడారు. ప్రస్తుతం ఆమె వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌పై బయటకు వచ్చారు. 2008 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో చోటు చేసుకున్న పేలుళ్లలో ఎంపీ సాధ్వి నిందితురాలు ఉన్న విషయం తెలిసిందే. कल गरबा आज भोपाल सांसद @SadhviPragya_MP आज मां काली के दर्शन के लिए पहुंचीं,वहां ग्राउंड में मौजूद खिलाड़ियों के अनुरोध पर महिला खिलाड़ियों के साथ कबड्डी खेली।😊 pic.twitter.com/X1wWOg55aW — Anurag Dwary (@Anurag_Dwary) October 13, 2021 -
డిసెంబర్లో ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 2021 ప్రారంభం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ డిసెంబర్ 22 నుంచి మొదలుకానుంది. అయితే మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎనిమిదో సీజన్ ఒకే ఒక వేదికలో నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌లన్నీ బెంగళూరులోనే నిర్వహిస్తామని లీగ్ కమిషనర్, మశాల్ స్పోర్ట్స్ సీఈఓ అనుపమ్ గోస్వామి తెలిపారు. గతేడాది వైరస్ భయాందోళనల నేపథ్యంలో ఈవెంట్‌ను రద్దు చేశారు. పీకేఎల్–7 చివరిసారిగా 2019లో జరగ్గా బెంగాల్ వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. -
కరోనాతో అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు కన్నుమూత
మాలూరు: కరోనా భూతం అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు టి.గోపాలప్ప (35)ని బలిగొంది. తాలూకాలోని కప్పూరు గ్రామానికి చెందిన గోపాలప్ప భారత జట్టు తరఫున జాతీయ, ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొన్నాడు. రెండేళ్ల నుంచి గ్రామంలోని యువకులకు కబడ్డీలో శిక్షణ నిస్తున్నాడు. ఆయన వారం రోజుల నుంచి కరోనాతో కోలారు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. -
భారత కబడ్డీ మాజీ ప్లేయర్ తేజస్వినికి క్రీడా శాఖ సాయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడి భర్తను కోల్పోయిన భారత మహిళల కబడ్డీ జట్టు మాజీ సభ్యురాలు వి. తేజస్విని బాయికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ సంక్షేమ నిధి ద్వారా తేజస్వినికి సహాయం అందించారు. కర్ణాటకకు చెందిన తేజస్విని, ఆమె భర్త నవీన్ ఈనెల ఒకటిన కరోనా బారిన పడ్డారు. తేజస్విని ఇంటివద్దే కోలుకోగా... ఆమె భర్త నవీన్ (30 ఏళ్లు) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 11వ తేదీన తుదిశ్వాస విడిచాడు. నవీన్ తండ్రి కూడా కరోనా వైరస్‌తోనే మృతి చెందారు. 2011లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ పొందిన తేజస్విని 2010 గ్వాంగ్జూ, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరించింది. తేజస్వినికి ఐదు నెలల పాప ఉంది. ఆర్థిక సాయంగా లభించిన మొత్తాన్ని పాప భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తేజస్విని పేర్కొంది. -
చిత్తూర్: నగరిలో కబడ్డీ పోటీలను ప్రారంభించిన రోజా
-
నాని సినిమా తరహా ఘటన.. కబడ్డీ కూతకు వెళ్లి..
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో భీమిలి కబడ్డీ జట్టు సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లిన ఆటగాడు అవుట్ అయిన తర్వాత తిరిగొస్తూ గుండెపోటు గురయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే మృతి చెందాడు. వల్లూరు మండలంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వల్లూరు మండలంలోని గంగాయపల్లి మోడల్ స్కూల్ ఆవరణలో ఆర్కే యువసేన ఆధ్వర్యంలో శనివారం కబడ్డీ పోటీలు జరిగాయి. చెన్నూరు, తప్పెట్ల గ్రామాల జట్లు తలపడ్డాయి. ( గర్భంలోని శిశువు మాయం.. మహిళ ఆందోళన ) కొండపేటకు చెందిన నరేంద్ర ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లాడు. అవుట్ అయిన తర్వాత వెనక్కు తిరిగొస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. దీంతో నరేంద్ర సొంత గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నల్లగొండ ఈగల్స్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్–3లో నల్లగొండ వారియర్స్ జట్టు అదరగొట్టింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మైదానంలో జరిగిన ఈ టోర్నీలో నల్లగొండ ఈగల్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 44–39తో మంచిర్యాల టైగర్స్‌పై గెలుపొంది టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. తొలుత రైడింగ్‌లో మల్లికార్జున్ (24 పాయింట్లు) విజృంభించడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి నల్లగొండ ఈగల్స్ జట్టు 23–21తో స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలోనూ సమష్టిగా రాణించిన నల్లగొండ 21 పాయింట్లు స్కోర్ చేసి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆసాంతం ఆకట్టుకున్న పి. మల్లికార్జున్ ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మాŠయ్చ్’ అవార్డు అందుకున్నాడు. 3 పాయింట్లు సాధించిన కార్తీక్ యాదవ్ (మంచిర్యాల టైగర్స్) ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యాడు. సైబరాబాద్‌పై వరంగల్ గెలుపు మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ జట్టు ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 39–26తో సైబరాబాద్ చార్జర్స్‌ను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మ్యాచ్ ప్రారంభంలో సైబరాబాద్ జట్టు చెలరేగింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ 21–11తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో చెలరేగిన వరంగల్ వారియర్స్ అనూహ్య రీతిలో విజయం సాధించింది. రైడర్ జి. రాజు 17 పాయింట్లతో చెలరేగడంతో రెండో అర్ధభాగంలో ఏకంగా 28 పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. వరంగల్ జోరు ముందు సైబరాబాద్ చతికిలబడింది. ఈ మ్యాచ్‌లో ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’గా జి.రాజు, ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’గా వి. రమేశ్ ఎంపికయ్యారు. -
వరంగల్ వారియర్స్‌కు తొలి ఓటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్–3లో దూసుకుపోతోన్న వరంగల్ వారియర్స్ జట్టుకు తొలి దెబ్బ పడింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో వరంగల్ వారియర్స్ ఓటమి పాలైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 52–35తో వరంగల్ వారియర్స్‌పై గెలుపొంది వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. నల్లగొండ ఈగల్స్ రైడర్ మల్లికార్జున్ 23 రైడ్ పాయింట్లతో విజృంభించడంతో మ్యాచ్ ఆరంభం నుంచి ఆ జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత 26–14తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. తర్వాత రెండో అర్ధభాగంలోనూ అదే జోరు కనబరిచి 26–21తో మ్యాచ్‌ను గెలుపొందింది. మల్లికార్జున్ ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోగా... 5 పాయింట్లు సాధించిన సాయి రామ్ (నల్లగొండ ఈగల్స్) ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. మరో మ్యాచ్‌లో కరీంనగర్ కింగ్స్ 60–22తో హైదరాబాద్ బుల్స్‌పై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో కరీంనగర్ కింగ్స్ 33–8తో దూసుకెళ్లింది. రెండో అర్ధభాగంలో హైదరాబాద్ కాస్త పోరాడినప్పటికీ కరీంనగర్ కింగ్స్ ఎక్కడా తగ్గకుండా పాయింట్లు సాధించింది. 15 రైడ్ పాయింట్లు సాధించిన మునీశ్ కుమార్ ‘బెస్ట్ రైడర్’గా, 6 పాయింట్లు సాధించిన శివ కుమార్ ‘బెస్ట్ డిఫెండర్’గా నిలిచారు. మరో మ్యాచ్‌లో మంచిర్యాల టైగర్స్ 42–31తో గద్వాల్ గ్లాడియేటర్స్‌ను ఓడించి టోర్నీలో మూడో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టు తరఫున నితిన్ పన్వర్ 14 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. తొలి అర్ధభాగంలో 22–15తో ఆధిక్యంలో నిలిచిన మంచిర్యాల టైగర్స్ రెండో అర్ధభాగంలో మరో 20–16తో మ్యాచ్‌ను గెలుపొందింది. ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద మ్యాచ్’గా నితిన్.. ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’గా శుభమ్ నిలిచారు. -
కోహ్లికి నాకు కొన్ని పోలికలు నిజమే
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి, తనకి రెండు విషయాల్లో పోలిక ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. ఆమె నటించిన 'పంగా' సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆమె విరాట్ గురించి మాట్లాడుతూ.. నాకు, కోహ్లికి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని ఎంతో మంది చెప్తుంటారు. నిజమే మా మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. పంగా రివ్యూ: మహిళలు, అస్సలు మిస్సవకండి 'మేము ఇద్దరం ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నాం. దీంతో ఎక్కువ అభిమానులను సంపాదించాం. అంతేకాకుండా కోహ్లికి దూకుడు ఎక్కువ అని విమర్శిస్తుంటారు. నేను కూడా ఎంతో దూకుడుగా ఉంటాను. క్రీడాకారుడి జీవితం అంత సులువు కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆట కోసం వారు తీవ్రంగా సాధన చేస్తారు. ఫిట్నెస్ కోసం ఎంతో శ్రమిస్తారని' కంగనా తెలిపారు. కాగా కంగనా రనౌత్ నటించిన తాజా హిందీ సినిమా 'పంగా' ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో కంగనా జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నటించింది. అశ్వినీ అయ్యర్ తివారి దర్శకత్వం వహించారు. (పైలెట్ కంగనా) -
పంగా రివ్యూ: ప్రతి ఒక్కరూ చూడాల్సిందే
బాలీవుడ్ సంచలన హీరోయిన్ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘పంగా’. ఈ చిత్రంలో ఆమె మహిళా కబడ్డీ మాజీ చాంపియన్ జయ నిగమ్ పాత్రను పోషించారు. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించిన పంగాలో జస్సీ గిల్, రిచా చద్దా, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్‌తో మంచి మార్కులు కొట్టేసిన ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఇక ఇదే రోజు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ విడుదలైంది. ఈ నేపథ్యంలో పంగా బాక్సాఫీస్ దగ్గర గెలుస్తుందా? లేదా అనేది చూద్దాం... కథ: ఇది ఓ మహిళా కబడ్డీ క్రీడాకారిణి జయ నిగమ్ బయోపిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. కానీ బంధాలను, ఆశయాలను ఒకే తాటిపైకి తేవడం సాధ్యమేనా అన్న అంశాన్ని దర్శకురాలు చాలా చాకచక్యంగా తెరకెక్కించారు. ఇక పెళ్లికి ముందు యువతి ఎలా ఉన్నా వివాహం అనంతరం ఆమె బరువు బాధ్యతలు తలకెత్తుకోక తప్పదు. అందులోనూ జయ నిగమ్ (కంగనా రనౌత్) బ్యాంకు ఉద్యోగి. అయితే జాతీయ అవార్డు అందుకున్న జయ పెళ్లికి ముందు అందరి చేత నీరాజనాలు అందుకుంటుంది. కానీ గృహిణిగా మారిన తర్వాత కనీసం గుర్తింపు కూడా కరువవుతుంది. దీంతో ఆమె మనసు మరోసారి కబడ్డీ వైపు మళ్లుతుంది. భారత్ తరపున అంతర్జాతీయ చాంపియన్‌షిప్ గెలవాలని కలలు కంటుంది. ఆ లక్ష్యం నెరవేరిందా? దానికోసం ఆమె ఎన్ని పాట్లు పడింది? ఈ క్రమంలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిందా? లేదా అటు కుటుంబాన్ని, ఇటు తన కబడ్డీ ప్రాక్టీస్‌ను ఎలా సమతుల్యం చేసిందనేది సినిమా చూస్తేనే కిక్కుంటుంది. విశ్లేషణ: అద్భుతమైన కథకు ఎలాంటి కృత్రిమ రంగులద్దకుండా నేర్పుగా తెరకెక్కించారు దర్శకురాలు అశ్వినీ అయ్యర్. కథలో అనూహ్య మలుపులు, థ్రిల్స్, కొసమెరుపులు పెద్దగా కనిపించవు. కథ ఆసాంతం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులను తనవెంట తీసుకుపోతుంది. ఇక మధ్యతరగతి బంధాలను, వారి జీవితాలను కూడా తెరపై హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. జయ తన జీవితంలో మరోసారి కబడ్డీ వైపు అడుగులు వేసే కీలక సన్నివేశాన్ని డ్రమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు. జయ కబడ్డీ ఆడాలన్న నిర్ణయాన్ని తొలుత ఆమె తల్లే వ్యతిరేకిస్తుంది. కానీ స్నేహితురాలు, స్కౌట్ మీను (రిచా చద్దా) ప్రోత్సాహంతో లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. ఇక ఇక్కడే అసలు కథ మొదలువుతుంది. ఓ గృహిణిగా, క్రీడాకారిణిగా ఆమె రెండింటినీ బ్యాలెన్స్ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ ఆమె భర్త ప్రశాంత్(జస్సీ గిల్) ఆమె ఆశయానికి వత్తాసు పలకడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అయితే అటు ఇంటి పనులను, ఇటు పిల్లలను చూసుకోవాలంటే ఆయన తలప్రాణం తోకకొస్తుంది. మరోవైపు జయ తాను కోల్పోయిన ఫిట్నెస్ను సాధించునేందుకు పరుగు మొదలుపెడుతుంది. ఓవైపు ఎమోషనల్‌గా, మరోవైపు కబడ్డీ పోరాట సన్నివేశాల్లోనూ కంగనా విశేషంగా ఆకట్టుకుంది. కబడ్డీ గురించి చెప్పాలంటే అది గ్రామీణ క్రీడ. ఒక్కసారి కూత మొదలుపెట్టి కాలు కదిపారంటే ప్రత్యర్థిని ఓడించే రావాలన్న కసిగా కదన రంగంలోకి దూకుతారు. ఈ క్రమంలో వారికి గాయాలైనా దాన్ని పట్టించుకోరు. కబడ్డీ చూడటానికి కాస్త హింసాత్మకంగా కనిపించినా ఆద్యంతం ఆసక్తికరంగా, మరింత రసవత్తరంగా సాగుతుంది. ఈ కబడ్డీ పోరే సినిమాకు ప్రధాన ఆయుధం. దాన్ని దర్శకురాలు సినిమాకు సంపూర్ణంగా వినియోగించుకుంది. జయ కబడ్డీ కోర్టులో ప్రత్యర్థులను మట్టి కరిపించే దృశ్యాలు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వవంటే అతిశయోక్తి కాదు. మొత్తంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మహిళలు తప్పక చూడాల్సిన సినిమా అని పలువురు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. కలెక్షన్ల మాట ఎలా ఉన్నా ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసును హత్తుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: పంగా ట్రైలర్ వచ్చెయ్నా అమ్మా?: కంగనా -
కబడ్డీ అంటే ప్రాణం.. కాసులు లేక దైన్యం
అసలే నిరుపేద కుటుంబం. ఆపై పెద్ద దిక్కు కోల్పోవడం, అన్ని తానై తండ్రిలేని లోటును కనిపించకుండా తన కుమారుడిని ఉన్నతుడిని చేయాలనే సంకల్పంతో కూలి పనులు చేస్తూ చదివిస్తోంది ఓ తల్లి.. అదే ఉన్నత ఆశయంతో, తల్లి సంకల్పాన్ని సాకారం చేసేందుకు చదువుతోపాటు కబడ్డీలో రాణిస్తూ జాతీయ స్థాయిలోనూ అవార్డులు సాధిస్తున్నారు కొందుర్గుకు చెందిన విద్యార్థి శ్రీకాంత్. అయితే ఈ నెల 22న మధ్యప్రదేశ్‌లో జరిగే పోటీలలో పాల్గొనేందుకు దాతల సహకారాన్ని అర్థిస్తున్నాడు. రంగారెడ్డి :కొందుర్గు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కృష్ణయ్య దంపతులకు పావని, శ్రీకాంత్ అను ఇద్దరు సంతానం. పావని పెళ్లైంది. అయితే రెండేళ్ల క్రితం తండ్రి కృష్ణయ్య మృతిచెందాడు. ఇక ఈ కుటుంబంలో మిగిలింది తల్లి పార్వతమ్మ, కూమారుడు శ్రీకాంత్. తన కూమారుడిని ఎలాగైనా మంచి చదువులు చదివించి ఉన్నతమైన భవిష్యత్ అందించాలన్నదే పార్వతమ్మ కోరిక. తల్లి ఆశయాన్ని నెరవేర్చేందుకు శ్రీకాంత్ చదువులోనూ, అటు క్రీడలోనూ రాణిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో కొందుర్గు బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి సైతం శ్రీకాంత్‌ను క్రీడలో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఉన్నత పాఠశాలలో పీఈటీలు అనితారాణి, రామచంద్రుడు సూచనలు, సలహాలు పాటిస్తూ ఎన్నో జాతీయ పతకాలు సాధించారు. శ్రీకాంత్ సాధించిన విజయాలు ప్రస్తుతం కొందుర్గు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీకాంత్ 2017 డిసెంబర్లో నిర్వహించిన కబడ్డీ అండర్–17 విభాగంలో చెన్నైలో జరిగిన జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని ప్రథమ బహుమతి అందుకున్నారు. అదేవిధంగా 2018 నవంబర్‌లో రాజస్థాన్‌లో నిర్వహించిన జాతీయ కబడ్డీ పోటీల్లోనూ ఢిల్లీ జట్టుతో పోటీపడి ప్రథమ స్థానం పొందారు. ఇక 2019 సెప్టెంబర్‌లో పాండిచ్చేరి జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం ఈ నెల 22న మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల కోసం ఎన్నికయ్యారు. దాతల సహకారంతోనే .. కాగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు శ్రీకాంత్‌కు ఆర్థిక పరిస్థితులు అంతగా లేకపోవడం వల్ల దాతల సహకారంతోనే అన్ని పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 22న మధ్యప్రదేశ్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక వనరుల కోసం దాతల కోసం ఎదురు చూస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాలన్నదే నా కోరిక. చిన్నతనంలో లక్ష్మీదేవి టీచర్, పెద్దయ్యాక పీఈటీలు అనితారాణి, రామచంద్రుడు ఇద్దరు టీచర్లు సూచించిన సలహాలు నాకు స్ఫూర్తిని నింపాయి. ఇక నాయకుల ఆర్థిక సహాయంతోపాటు మా పాఠశాల ఉపాధ్యాయులు రూ. 500 చొప్పున అందించి నన్ను జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు పంపించడం నాలో మరింత పట్టుదలను నింపింది.– కబడ్డీలో రాణిస్తున్న శ్రీకాంత్ నా కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవాలి నా కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే నా కోరిక. కుటుంబాన్ని పోషించే నా భర్త మృతిచెందాడు. ఇక ఉన్న ఒక్కగానొక్క కొడుకును ఉన్నతమైన భవిష్యత్ అందించాలని ఉంది. నా కొడుకు జాతీయ కబడ్డీ పోటీల్లో బహుమతి అందుకున్నాడని తెలియగానే చెప్పరాని సంతోషం వచ్చింది. మరిన్ని ఉత్తమ బహుమతులు అందుకొని మంచి భవిష్యత్ పొందాలని నా కోరిక. ఇందుకు దాతలు సహకరించాలి. – పార్వతమ్మ, శ్రీకాంత్ తల్లి -
కబడ్డీ ఆటలో గొడవ.. కొట్టుకు చచ్చారు
సాక్షి, లావేరు: మండలంలోని మురపాక గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి కబడ్డీ టోర్నమెంటులో అంపైర్ ఏకపక్ష నిర్ణయాలతో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇది తీవ్ర స్థాయిలో ఘర్షణకు దారితీయగా ఒకరికొకరు భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాలకు చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలకు చెందిన 22 మందిపై కేసులు నమోదు చేశారు. లావేరు స్టేషన్ హెచ్‌సీ రమణ వివరాల ప్రకారం... వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఓ కాలనీలో కబడ్డీ టోర్నమెంటు నిర్వహించారు. ఈ టోర్నమెంటులో అంపైర్ ఏకపక్షంగా వ్యవహరించడంతో ఓ జట్టు యువకులు ఆటను బహిష్కరించారు. దీంతో గ్రామానికి చెందిన రెండు కాలనీలకు చెందిన వారి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో ఇరువర్గాల వారు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కాలనీకి చెందిన బొట్ట గురయ్య, వడ్డి రమణ, కోరాడ ఈశ్వరరావులకు గాయాలయ్యాయి. మరో కాలనీకి చెందిన గుడివాడ పాపారావు, రాకోటి అశోక్, మారుబారుకి గణేష్‌లకు గాయాలయ్యాయి. వీరిని శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లావేరు పోలీసులు మురపాక గ్రామానికి వెళ్లి ఇరువర్గాల నుంచి వివరాలను సేకరించారు. 22 మందిపై కేసుల నమోదు పరస్పరం ఫిర్యాదుల మేరకు ఇరు వర్గాలకు చెందిన 22 మందిపై కేసు నమోదు చేసినట్లు లావేరు ఎస్ఐ చిరంజీవి బుధవారం తెలిపారు. ఓ వర్గానికి చెందిన వీ అప్పన్న, కే నాగరాజు, వీ లక్ష్మణ, బీ గురయ్య, వీ సూర్యనారాయణ, కే పాపారావు, జీ యర్రబాబు, వీ అప్పయ్యలపైనా, మరోవర్గానికి చెందిన జీ పాపారావు, బీ యర్రయ్య, పీ సూరిబాబు, ఎం చిన్న, ఎం అశిరినాయుడు, ఎం వెంకటరమణ, ఏ తేజ, ఆర్ గణేష్, ఆర్ చంటి, ఎం శ్రీహరి, ఆర్ సుధ, ఆర్ అశోక్, ఎం శ్రీనులపైనా కేసులు నమోదు చేశామన్నారు. -
విద్యార్థులతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే సీతక్క
సాక్షి, వరంగల్ : సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేసే ములుగు ఎమ్మెల్యే సీతక్క తాజాగా కబడ్డీ ఆడారు. ములుగు మండలం జాకారంలోని బాలికల మినీ గురుకుల పాఠశాలలో శుక్రవారం ‘ఎంటర్టైన్మెంట్ డే’ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టుదలతో విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఆకాక్షించారు. చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని అన్నారు. ఇక ఎమ్మెల్యే కబడ్డీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
కోహ్లి కబడ్డీ జట్టు ఇదే..!
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి కబడ్డీపై బాగానే ఆసక్తి ఉన్నట్లు ఉంది. ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో భాగంగా శనివారం ముంబై వేదికగా యు ముంబై-పుణె పల్టాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కోహ్లి.. పనిలో పనిగా తన కబడ్డీ జట్టును కూడా ప్రకటించేశాడు. కోహ్లి ఏంటి.. కబడ్డీ ఏంటీ అనుకుంటున్నారా.. ఒకవేళ కబడ్డీ జట్టుకు తాను సారథ్యం వహిస్తే ఎవర్ని ఎంపిక చేస్తాను అనే దానిపై సరదాగా ముచ్చటించాడు. ఇందులో పలువురు భారత క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాడు కోహ్లి. అందులో సహచర ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి తొలి ప్రాధాన్యత ఇచ్చాడు. ధోనితో పాటు రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, రిషభ్ పంత్, బుమ్రా, కేఎల్ రాహుల్‌లకు తన జట్టులో చోటిచ్చాడు. వీరిలో ఉమేశ్ యాదవ్, బుమ్రాలు స్పెషలిస్టులుగా కోహ్లి పేర్కొన్నాడు. ఇక క్రికెట్‌ను కబడ్డీని సమాంతరంగా పోల్చితే అంటూ కోహ్లికి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా బదులిస్తూ.. రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్ల ప్రస్తావన తీసుకొచ్చాడు. తనకు ధోనికి వారిద్దరూ కాపీలంటూ పేర్కొన్నాడు. ఇక కబడ్డీగురించి మాట్లాడుతూ.. ఈ గేమ్ మన సంస్కృతిలో ఒక భాగమన్నాడు. చిన్నతనంలో మనమంతా ఏదొక సమయంలో కబడ్డీ ఆటను ఎక్కువగా ఆస్వాదించిన వాళ్లమేనని తెలిపాడు. వరల్డ్‌లో మన కబడ్డీ జట్టు అత్యుత్తమ జట్టుగా ఉందంటే దానికి ఆ క్రీడపై మనకున్న మక్కువే కారణమన్నాడు. -
ఖో–ఖో లీగ్ నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: గ్రామీణ క్రీడ ఖో–ఖో మరింత ఆకర్షణీయంగా మారనుంది. క్రికెట్, కబడ్డీ, రెజ్లింగ్ తరహాలోనే ఖో–ఖోలోనూ ఇటీవల లీగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌లో ‘అల్టిమేట్ ఖో–ఖో’ పేరుతో జరుగనున్న ఈ లీగ్... తొలి సీజన్‌తోనే ప్రేక్షకాదరణ పొందేం దుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఖో–ఖో ఆట నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఇందులో భాగంగా ఆట మొత్తం నిడివిని 36 నిమిషాల నుంచి 28 నిమిషాలకు తగ్గించింది. దీంతో రెండు ఇన్నింగ్స్‌లలోనూ ప్రతి జట్టు ఏడు నిమిషాల చొప్పున ఆడుతుంది. దీంతో ఆటలో వేగం పెరగడంతో పాటు ఆసక్తికర పోరాటాలు ప్రేక్షకులని రంజింపచేస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు. దీనితో పాటు అధిక పాయింట్లు పొందడానికి వీలుగా ‘వజీర్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం వజీర్‌గా వ్యవహరించే ఆటగాడు అయితే తనకు అనుకూలంగా అయితే ఎడమవైపు, లేదా కుడివైపుకు పరిగెత్తి పాయింట్లను సాధించవచ్చు. వజీర్ ట్రంప్‌కార్డుగా ఉపయోగపడుతూ పాయింట్లు పెంచుకునేందుకు ఉపయోగపడతాడు. అంతేకాకుండా స్కోరింగ్ విధానంలోనూ కొన్ని మార్పుచేర్పులు చేశారు. దీని ప్రకారం స్కైడైవ్ ద్వారా జట్టుకు అదనంగా ఒక పాయింట్ సాధించే వీలుంటుంది. మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆటగాళ్లకు రివ్యూ కోరే అవకాశాన్ని కూడా కల్పించారు. ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు రివ్యూలు కోరవచ్చు. ఒకవేళ రివ్యూలో విఫలమైతే ప్రత్యర్థి జట్టుకు ఒక పాయింట్‌ను కేటాయిస్తారు. ఈ మార్పులు అభిమానులకు ఖో–ఖోను మరింత చేరువ చేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కొత్త ఫార్మాట్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని భారత ఖో–ఖో సమాఖ్య చైర్మన్ రాజీవ్ మెహతా అన్నారు. భారత్‌లో నైపుణ్యమున్న ఆటగాళ్లకు అల్టిమేట్ ఖో–ఖో లీగ్ మంచి అవకాశమని చెప్పారు. -
కబడ్డీలో మరో లీగ్
న్యూఢిల్లీ: ప్రేక్షకుల నుంచి విపరీత ఆదరణ పొందిన గ్రామీణ క్రీడ కబడ్డీలో మరో లీగ్ రానుంది. ‘ఇండో ఇంటర్నేషనల్ ప్రీమియర్ కబడ్డీ లీగ్ (ఐపీకేఎల్)’ పేరిట మే 13న ప్రారంభం కానున్న ఈ లీగ్ జూన్ 4 వరకు అభిమానులను అలరించనుంది. లీగ్ విశేషాలతో పాటు లోగోను బుధవారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొన్నారు. పుణే, మైసూర్, బెంగళూరు వేదికల్లో ఈ టోర్నీని నిర్వహిస్తామని ఐపీకేఎల్ డైరెక్టర్ రవికిరణ్ ప్రకటించారు. తొలి సీజన్లో 44 మ్యాచ్‌లను నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 160 మంది క్రీడాకారులు ఇందులో తలపడనున్నారు. వీరిలో 16 మంది విదేశీ ఆటగాళ్లు. ఆటగాళ్లకు యాజమాన్యం ఇచ్చే ప్రైజ్‌మనీ, జీతంతో పాటు, లీగ్ ద్వారా వచ్చే రెవెన్యూలో 20 శాతం అందజేయడం ఈ లీగ్ ప్రత్యేకత. డీడీ స్పోర్ట్స్‌తో పాటు 18 చానల్స్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ మూడు దశలుగా జరుగుతుంది. తొలి దశలో పుణేలోని బాలేవాడి స్టేడియంలో మే 13నుంచి 21వరకు 20 మ్యాచ్‌లు జరుగుతాయి. తర్వాత మైసూర్‌లోని చాముండీ విహార్ స్టేడియంలో మే 24నుంచి 29 వరకు 17 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జూన్ 1నుంచి 4వరకు ఫైనల్‌తో కలిపి మొత్తం 7 మ్యాచ్‌లు జరుగుతాయి. బెంగళూరు రైనోస్, చెన్నై చాలెంజర్స్, డైలర్ ఢిల్లీ, తెలుగు బుల్స్, పుణే ప్రైడ్, హరియాణా హీరోస్, ముంబై చిరాజ్, రాజస్తాన్ రాజ్‌పుత్స్ జట్లు టైటిల్కోసం తలపడనున్నాయి. టోర్నమెంట్ లోగో ఆవిష్కరణ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ‘జకార్తా పాలెంబాంగ్ ఆసియా క్రీడల కబడ్డీ టోర్నీలో భారత్ ఓడినప్పుడు నాతో పాటు దేశం మొత్తం బాధపడింది. కబడ్డీ దేశానికి గర్వంగా నిలిచే క్రీడ. కబడ్డీలో ఐపీకేఎల్ రావడం హర్షించదగిన విషయం. మరింత మంది కబడ్డీ ప్లేయర్లకు ఈ లీగ్ ఉపయోగపడుతుంది’ అని సెహ్వాగ్ అన్నాడు. -
రూ. 50 కోట్లు...200 మంది ఆటగాళ్లు!
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌కు సంబంధించి రెండు రోజుల పాటు సాగిన వేలం మంగళవారం ముగిసింది. 12 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 200 మంది ఆటగాళ్లను ఎంచుకున్నాయి. వీరిలో 173 మంది భారత ఆటగాళ్లు కాగా, 27 మంది విదేశీయులు ఉన్నారు. ఇందుకోసం ఫ్రాంచైజీలు మొత్తం రూ. 50 కోట్లు ఖర్చు చేశాయి. కేటగిరీ ‘బి’లో డిఫెండర్ మహేందర్ సింగ్, రైడర్ మన్జీత్ సింగ్‌లకు అత్యధిక మొత్తాలు లభించాయి. మహీందర్‌ను బెంగళూరు బుల్స్ రూ. 80 లక్షలకు తీసుకోగా, మన్‌జీత్‌ను పుణేరీ పల్టన్ రూ. 63 లక్షలకు ఎంచుకుంది. ఆల్‌రౌండర్స్ కేటగిరీలో యు ముంబా రూ. 89 లక్షలతో సందీప్ నర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేసుకుంది. తొలి రోజు సోమవారం సాగిన ప్రధాన వేలంలో ఇద్దరు ఆటగాళ్లు సిద్ధార్థ్ దేశాయ్ (రూ. 1.45 కోట్లు), నితిన్ తోమర్ (రూ.1.20 కోట్లు)లకు కోటి రూపాయలకు పైగా విలువ లభించింది. రెండో రోజు ‘ఎ’ కేటగిరీ డిఫెండర్స్ విభాగంలో రూ.60 లక్షలకు విశాల్ భరద్వాజ్‌ను తెలుగు టైటాన్స్ సొంతం చేసుకుంది. సీజన్–7 ఈ ఏడాది జూలై 1నుంచి అక్టోబర్ 9 వరకు జరుగుతుంది. మరో వైపు తనకు భారీ మొత్తం లభించడంపై సిద్ధార్థ్ దేశాయ్ స్పందిస్తూ... ‘వేలంలో నాకు పలికిన ధర చూసి ఉక్కిరిబిక్కిరయ్యాను. నాది సాధారణ కుటుంబం. మా నాన్న రైతు. కబడ్డీ ఆటగాడిగా ఎదగడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. నన్ను ఇంత పెద్ద మొత్తానికి ఎంచుకొని నా ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించిన తెలుగు టైటాన్స్‌కు కృతజ్ఞతలు. టోర్నీలో బాగా ఆడి జట్టును గెలిపించేందుకు వంద శాతం కృషి చేస్తా’ అని అన్నాడు. తెలుగు టైటాన్స్ జట్టు ఇదే... సిద్ధార్థ్ దేశాయ్, సూరజ్ దేశాయ్, రాకేశ్ గౌడ (రైడర్స్), విశాల్ భరద్వాజ్, కృష్ణ మదన్, సి. అరుణ్, అబోజర్ మిగాని (డిఫెండర్స్), అర్మాన్, డ్యూయెట్ జెన్నింగ్స్, ఫర్హద్ రహీమి, శివగణేశ్ రెడ్డి, మనీశ్, ఆకాశ్ చౌదరి, అమిత్ కుమార్ (ఆల్‌రౌండర్లు) -
భారత కబడ్డీ సమాఖ్య అధ్యక్షునిగా జ్ఞానేశ్వర్
సాక్షి, హైదరాబాద్: భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య నూతన కార్యవర్గం కొలువుదీరింది. సమాఖ్య అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎన్నికవగా... ఉపాధ్యక్షులుగా దినేశ్ పటేల్, కె. జగదీశ్వర్ యాదవ్ నియమితులయ్యారు. రిటర్నింగ్ అధికారి నీరజ్ గుప్తా ఆధ్వర్యంలో భారత అమెచ్యూర్ కబడ్డీ సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్‌లో 14 మంది సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భారత కబడ్డీ సమాఖ్య కార్యదర్శిగా తేజస్వీ సింగ్, కోశాధికారి నిరంజన్ సింగ్ వ్యవహరించనున్నారు. ఎ. సఫియుల్లా, కుల్దీప్ కుమార్ గుప్తా, కుమార్ విజయ్ సింగ్, రుక్మిణి కామత్ సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికవగా... అశోక్ చౌదరి, భువనేశ్వర్, హనుమంత్ గౌడ, కుల్దీప్ సింగ్ దలాల్, రాజ్‌కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తమ బాధ్యతలు నిర్వహిస్తారు. -
చాంపియన్ రంగారెడ్డి జట్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి బాలుర జట్టు చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి 42–40తో నల్లగొండపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరుజట్లు పోటీపోటీగా తలపడటంతో రంగారెడ్డి తొలి అర్ధభాగంలో 20–18తో స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం అదే ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజేతగా నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 32–26తో మహబూబ్‌నగర్‌పై, నల్లగొండ 52–39తో హైదరాబాద్‌పై గెలిచాయి. బాలికల టైటిల్‌పోరులో నల్లగొండ 74–35తో నిజామాబాద్‌పై అలవోక విజయాన్ని సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన నల్లగొండ జట్టును నిజామాబాద్ ప్లేయర్లు నిలువరించలేకపోయారు. సెమీస్ మ్యాచ్‌ల్లో నిజామాబాద్ 84–42తో రంగారెడ్డిపై, నల్లగొండ 53–37తో వరంగల్‌పై నెగ్గాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ సంఘం కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు. -
కబడ్డీ.. కబడ్డీ
కర్నూలు, బండిఆత్మకూరు: నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కాసేపు క్రీడాకారుడిగా మారిపోయారు. బండిఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జోనల్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ క్వార్టర్ ఫైనల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో జోష్ నింపేందుకు శిల్పా.. కబడ్డీ... కబడ్డీ అంటూ రైడింగ్‌కు వెళ్లి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. -
కూతకు సై
విశాఖ స్పోర్ట్స్: కబడ్డీ కూతకు ఆతిథ్య తెలుగు టైటాన్స్ సిద్ధమైంది. ఆరో సీజన్ దీటుగానే ప్రారంభించినా మధ్యలో కాస్త తడబాటుతో వెనుకబడింది. హోమ్‌టౌన్‌లోనే టైటాన్స్ చెలరేగనుండటంతో ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు నిలిచే ఉన్నాయి. ఈ సీజన్లో 12 జట్టు రెండు జోన్లుగా తలపడుతున్నాయి. 12 వారాల పాటు సాగనున్న ఈ సీజన్లో ఇప్పటికే ఎనిమిది వారాలు అయిపోయాయి. ఇక చివరి నాలుగు వారాల్లో విజేత ఎవరో తేలిపోనుంది. కీలకమైన ఈ లెగ్ హోమ్‌టౌన్‌లోనే జరగనుండటంతో తెలుగు టైటాన్స్ భవితవ్యం తేలిపోనుంది. ఇంకా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆడాల్సి ఉండగా.. ఇక్కడే ఆరు మ్యాచ్‌లు ఆడనుండటంతో ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తామనే దీమాను తెలుగు టైటాన్స్ జట్టు గురువారం జరిగిన మీడియా సెషన్లో వ్యక్తం చేసింది. ఏ జోన్లో ఆరు జట్లు ఉండగా తొలి రెండు స్థానాల్లో యు ముంబ, ఫార్చున్ జెయింట్స్ కొనసాగుతున్నాయి. జోన్–బిలో తెలుగు టైటాన్స్ ఆడుతుండగా తొలి రెండు స్థానాల్లో బెంగళూర్ బుల్స్, పాట్నా పైరేట్స్ కొనసాగుతున్నాయి. రైడింగ్ నుంచి డిఫెన్స్‌కు... తెలుగు టైటాన్స్ జట్టులో స్టార్ ఆటగాడు రాహుల్ రైడింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పటికే 700 పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా నమోదయ్యాడు. అయితే రాహుల్‌ను ప్రత్యర్థి జట్లు డిఫెండ్ చేయడంతో జట్టులోని మిగిలిన ఆటగాళ్లపై ఆధారపడ్డామని జట్టు సీఈఓ పవన్ అంటున్నారు. సీజన్లో చావోరేవో తెల్చుకోవల్సిన మ్యాచ్‌ల్లో విజయమే లక్ష్యంగా పోరాడతామంటున్నారు. జట్టు మేనేజర్ త్రినాథ్ మాట్లాడుతూ ఆట జరిగే రోజును బట్టి వ్యూహాలు మారుతాయంటున్నారు. హోమ్ లెగ్ కలిసొచ్చేనా.. జోన్–బీలో ఆడుతున్న తెలుగు టైటాన్స్ ప్రస్తుత ఆరో సీజన్లో ఇప్పటికి పదమూడు మ్యాచ్‌లాడింది. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. జోన్–బీలో ఆడుతున్న ఆరు జట్లలో తెలుగు టైటాన్స్ ప్రస్తుతానికి నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న లెగ్‌లో తెలుగు టైటాన్స్ హోమ్‌టౌన్‌లో ఆడుతున్నందున వరుస విజయాలందుకుంటే ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలున్నాయి. అయితే జోన్–బీలో కనీసం మూడో స్థానానికైనా చేరుకోవాల్సి ఉంటుంది. విశాఖలో ఆరుమ్యాచ్‌లు ఆడనుంది. బి జోన్లోనే టాప్–2లో నిలిచిన జట్లతో ఆడాల్సి ఉంది. ఇక ఇదే జోన్లో చివరి స్దానంలో కొనసాగుతున్న యోధా జట్టుతోనూ తలపడనుంది. అయితే కలిసి వచ్చే అంశం పూల్‌ఏలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతోనూ మ్యాచ్‌లున్నాయి. దీంతో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. తెలుగు టైటాన్స్ వీరే... ఆల్‌రౌండర్ విశాల్ భరద్వాజ్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా రైడింగ్ దిట్ట రాహుల్ ఉండనే ఉన్నాడు. అంకిత్, కమల్, మోసిన్, నీలేష్, రజ్నీష్, రక్షిత్‌లు రైడింగ్‌కు సిద్ధంగా ఉన్నారు. అనుజ్, ఫర్హాద్, సొంబిర్ రైట్ కవర్లో డిఫెండ్ చేయనుండగా అనిల్, మనోజ్, దీపక్ లెఫ్ట్ కవర్లో డిఫెండ్ చేయనున్నారు. సెంటర్లో అబ్జోర్, కృష్ణ ఉండగా అర్మాన్, మహేందర్ ఆల్‌రౌండ్ ప్రతిభ చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. తప్పులు సరిదిద్దుకుంటున్నాం... చివరి లెగ్ పోటీల్లో డూ ఆర్ డైగా తలపడాల్సి ఉంది. హోమ్‌లెగ్‌లో ఆడుతుండటం కలిసివచ్చే అంశమే. కనీసం ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గినా ప్లేఆఫ్‌కు చేరుకున్నట్లే. ఇంకా తొమ్మిది మ్యాచ్‌లు ఈ సీజన్లో ఆడాల్సి వుంది. సీజన్ ప్రారంభంలో బలమైన జట్టుగా ఉన్న తెలుగు టైటాన్స్ కాస్తా వెనుకబడింది. తొలి లెగ్‌లో ఆడిన జట్టే ఇక్కడ ఆడనుంది. 18 మందిలో ఏడుగురు సీనియర్లు ఈ పోటీల్లో తలపడనున్నారు. – తెలుగు టైటాన్స్ కెప్టెన్ విశాల్ భరద్వాజ్ తెలుగు టైటాన్స్‌తో... 7వ తేదీన రాత్రి 8 గంటలకు ఫారŠుచ్యన్ జెయింట్స్‌తో 8వ తేదీన రాత్రి 9 గంటలకు పింక్ ఫాంథర్స్తో 9వ తేదీన రాత్రి 9 గంటలకు హర్యానా స్టీలర్స్‌తో 11వ తేదీన రాత్రి 9 గంటలకు యూపి యోధాతో 12వ తేదీన రాత్రి 9 గంటలకు బెంగళూర్ బుల్స్‌తో 13వ తేదీన రాత్రి 8 గంటలకు పాట్నా పైరెట్స్‌తో -
శ్రీకాంత్‌ను ఖాళీ చేయించండి
విజయవాడ స్పోర్ట్స్: కబడ్డీలో రాణించాలనే మా కున్న ఆశలపై, ప్రతిభపై కొన్నేళ్లుగా యలమంచిలి శ్రీకాంత్ నీళ్లు చల్లడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు ఆరోపించారు. ఈ విషయమై మూడేళ్లుగా ఎంత మంది అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ కమిషనర్, శాప్ ఉన్నతాధికారులు, నగర పోలీసు అధికారులు, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ అండదండలు ఉండడంతో శ్రీకాంత్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని అన్నారు. కె.చైతన్య, ఇ.రామకృష్ణ, వి.పూర్ణతోపాటు సుమారు 30 మంది వర్థమాన క్రీడాకారులు మంగళవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్ అవినీతికి, అసోసియేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో అసోసియేషన్ నుంచి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తొలిగించిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పటి శాప్ ఎండీ బంగారురాజుకు శ్రీకాంత్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధంతో సుమారు రూ.6లక్షల విలువచేసే అధునాతన జిమ్ కేటాయిస్తే, ఆ జిమ్‌లో శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పపడిన విషయాన్ని గుర్తు చేశారు. అతను ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని కబడ్డీ అసోసియేషన్ రూమ్‌లు, జిమ్ ఆక్రమించి ఖాళీ చేయడం లేదన్నారు. దీనిపై తాము, కృష్ణాజిల్లా కబడ్డీ అసోసియేషన్ అడహక్ కమిటీ పెద్దలు శాప్ అధికారులకు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు, 1100 ప్రజావేదికకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమన్నారు. అసోసియేషన్ రూమ్‌లు, శాప్ ఇచ్చిన జిమ్ ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాంత్ చేతుల్లో నుంచి రూమ్‌లు, జిమ్‌ను విడిపించాల్సిన మునిసిపల్ కమిషనర్ జె.నివాస్ కూడా మిన్నకుండిపోయారన్నారు. ఇందుకు సీఎం కార్యాలయంలోని కీలమైన ఓ ఎమ్మెల్సీ ఒత్తిడి కారణమని ఆరోపించారు. ఆ ఎమ్మెల్సీ పేరును త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. 2017 మే నెలలో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంపు నిధులను రూ.4,85,000 నిబంధనలకు విరుద్దంగా శ్రీకాంత్‌కు చెందిన సొంత అకౌంట్లోకి బదాలాయించారన్నారు. దీనిపై ప్రస్తుత శాప్ ఎండీ విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ వయసు ధ్రువీకరణ పత్రాలతో అడ్డగోలు సెలెక్షన్స్ ఇస్తే వాటిపై తాము సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా పట్టించుకోలేదన్నారు. దొంగ సర్టిఫికెట్లతో ఆడినవారికి అప్పటి శాప్ ఎండీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. విచారించిన సీఐడీ అధికారులు అప్పటి శాప్ ఎండీ నివేదికను పంపిస్తే ఆ ఫైల్‌ను అతీగతీలేకుండా లేకుండా చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కబడ్డీ అసోసియేషన్ రూమ్‌లు ఖాళీ చేయించి, ప్రాక్టీస్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
కబడ్డీ క్రీడాకారిణిలపై వేటు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని ముగ్గురు కబడ్డీ క్రీడాకారిణులపై క్రమశిక్షణా రాహిత్యం కింద అసోసియేషన్ ఏడాది కాలం సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే మేనేజర్‌గా వ్యవహరించిన వ్యక్తికి కూడా ఇదే శిక్ష విధించింది. ప్రస్తుతం జిల్లా క్రీడావర్గాల్లో ఇదే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. సంఘం ప్రతినిధులు, కోచ్‌లు తెలిపి న వివరాల ప్రకారం.. గత కొద్దికాలంగా ముద్దా డ గౌరి(శ్రీకూర్మం), జుత్తు భవానీ(దేశమంతుపు రం, జమ్ము), కరగాన సంధ్య (శ్రీకూర్మం, గొల్లవీధి) జిల్లా కబడ్డీ అసోసియేషన్ విధి విధానాల కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. శిక్షణ సమయంలో కోచ్‌లను అగౌరవపరుస్తూ లేనిపోని దు్రçష్పచారం చేస్తున్నారు. అలాగే ఈనెల 18 నుంచి 20 వరకు విజయనగరం వేదికగా జరిగిన 66వ ఏపీ రాష్ట్ర సీనియర్స్(పురుషులు, మహిళ ల) కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో అవమానకర రీతిలో ప్రవర్తించారు. అన్ని జిల్లాల క్రీడాకారులు, సంఘాల బాధ్యుల సమక్షంలో శ్రీకాకుళం జిల్లా పరువు ప్రతిష్టలను మంటగలిపే విధంగా వ్యవహారించడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో! పరిస్థితి చేయి దాటిపోవడంతో తీవ్రంగా పరిగణించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు క్రీడాకారిణులపై వేటుకు రంగం సిద్ధమయ్యారు. అలాగే ఇదే పోటీలకు మేనేజర్‌గా వ్యవహరించి న సీనియర్ క్రీడాకారిణి పి.ఝాన్సీ(చిన్నాపురం)ని సైతం ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఇదే విషయమై శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదా నంలోని డీఎస్ఏ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ సమావేశంలో వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సస్పెన్షన్ విషయాన్ని కబడ్డీ సంఘం నాయకులు ధ్రువీకరించారు. ఈ సస్పెన్షన్ ఏడాదిపాటు ఉంటుందని కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేని చిరంజీవిరావు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన కాపీలను డీఎస్ఏ జిల్లా కార్యాలయం, జిల్లా ఒలింపిక్ సంఘం, రాష్ట్ర కబడ్డీ సంఘం, సంఘం జిల్లా అధ్యక్షుడు గౌతు శ్యామ్‌సుందర్‌శివాజీ, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయం, జిల్లా పీఈటీ సంఘానికి చేరవేసినట్లు ఆయన తెలిపారు. వీరంతా ఎటువంటి అధికారిక కబడ్డీ పోటీలు, ఎంపికల్లో పాల్గొనేం దుకు వీలులేదని పేర్కొన్నారు. భవిష్యతులో క్రీడాకారుల్లో మార్పు కనిపించినట్లయితే సం ఘం కార్యవర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు క్రీడాకారిణుల సస్పెన్షన్ విధానాన్ని పలువురు పీఈటీలు వ్యతి రేకించినా.. కబడ్డీ సంఘం ఉనికికే విఘాతం కలిగేలా వ్యవహరించడం ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని మెజారిటీ సభ్యులు పట్టుబట్టినట్లు సమాచారం. సమావేశంలో డీఎస్ఏ కోచ్ ఎస్. సింహాచలం, సాధు శ్రీనివాసరావు, ఎం.నీలా ద్రి, టి.ఈశ్వర్రావు, రవి, రమేష్, లోకేశ్వర్‌రావు, నారాయణ, వివిధ జోన్ల ప్రతినిధులు, పీఈటీలు పాల్గొన్నారు. -
దక్షిణ మధ్య రైల్వే జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వే మహిళల కబడ్డీ టోర్నమెంట్లో ఆతిథ్య దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్ లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీ లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఎస్సీఆర్ 37–17తో సెంట్రల్ రైల్వేపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో వెస్ట్రన్ రైల్వే, నార్తర్న్ రైల్వే వరుసగా 3, 4 స్థానాలను సాధించాయి. బహుమతి ప్రధానోత్సవంలో ఎస్సీఆర్ జీఎం వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదన్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలిండియా రైల్వే కబడ్డీ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వే కబడ్డీ మహిళల టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్స్ వేదికగా బుధవారం జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మహిళల విభాగంలో జరుగుతోన్న ఈ టోర్నీలో రైల్వేస్‌కు చెందిన ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీ శుక్రవారంతో ముగుస్తుంది. ఇందులో పాల్గొన్న దక్షిణ మధ్య రైల్వే, సెంట్రల్ రైల్వే, ఈస్ట్రన్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, నార్తర్న్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ఈస్ట్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే జట్లను రెండు ‘పూల్’లుగా విభజించి పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా ఎస్సీఆర్ అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తితో రాణించి ఆటగాళ్లు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. -
వరంగల్ వారియర్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో వరంగల్ వారియర్స్ మూడో విజయాన్ని సాధించింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 38–23తో హైదరాబాద్ బుల్స్‌ను ఓడించింది. వరంగల్ జట్టులో విక్రాంత్‌కు ‘బెస్ట్ రైడర్’, నీలేశ్‌కు ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డులు లభించాయి. మరో మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 28–20తో మంచిర్యాల టైగర్స్‌పై విజయం సాధించింది. నల్లగొండ ఈగల్స్ తరఫున మల్లికార్జున ‘బెస్ట్ రైడర్’ అవార్డును అందుకోగా... మంచిర్యాల టైగర్స్ జట్టులో జి. రమేశ్ ‘బెస్ట్ డిఫెండర్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. -
కరీంనగర్ కింగ్స్‌కు తొలి గెలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో కరీంనగర్ కింగ్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. సరూర్‌నగర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 44– 26తో పాలమూరు పాంథర్స్ జట్టుపై ఘనవిజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో నల్లగొండ ఈగల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న కరీంనగర్ కింగ్స్... పాంథర్స్‌పై ఎదురులేని విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభంలో గట్టి పోటీనిచ్చిన పాలమూరు పాంథర్స్ ఆతర్వాత తడబడింది. కింగ్స్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ తొలి అర్ధభాగాన్ని 22–13తో ముగించారు. రెండో అర్ధభాగంలోనూ పాంథర్స్ తేలిపోవడంతో కరీంనగర్ జట్టును విజయం వరించింది. విజేత జట్టులో మునీశ్ ‘బెస్ట్ రైడర్’, కె. శ్రీనివాస్ ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డులను అందుకున్నారు. మరో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 40–21 నల్లగొండ ఈగల్స్‌పై విజయం సాధించింది. నేడు జరుగనున్న మ్యాచ్‌ల్లో హైదరాబాద్ బుల్స్‌తో గద్వాల్ గ్లాడియేటర్స్, రంగారెడ్డి రైడర్స్‌తో మంచిర్యాల టైగర్స్ తలపడనున్నాయి. -
రంగారెడ్డి రైడర్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో రంగారెడ్డి రైడర్స్ జట్టు ఆకట్టుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చివర క్షణాల్లో విజృంభించిన రంగారెడ్డి రైడర్స్ 26–19తో హైదరాబాద్ బుల్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి సమానంగా పోరాడినప్పటికీ రంగారెడ్డి తొలి అర్ధభాగాన్ని 13–10తో ముగించింది. చివరి వరకు అదే ఆధిక్యాన్ని కొనసాగించి గెలుపును అందుకుంది. విజేత జట్టు తరఫున పి. అన్వేశ్ ‘బెస్ట్ రైడర్’ అవార్డును అందుకున్నాడు. -
రజత, కాంస్యాలు సంతృప్తిని ఇవ్వట్లేదు
న్యూఢిల్లీ: కబడ్డీ ప్రపంచస్థాయి క్రీడగా ఎంతగా పరిణామం చెందిందో చెప్పేందుకు తాజా ఆసియా క్రీడల ఫలితాలే నిదర్శనమని భారత మహిళల కబడ్డీ జట్టు కోచ్ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కబడ్డీకి కంచుకోట అయిన భారత జట్ల ఓటమి... గ్రామీణ క్రీడలో ప్రపంచ దేశాలు పురోగమనాన్ని తెలుపుతోందని అన్నారు. ఆసియా క్రీడల చరిత్రలోనే కబడ్డీ ఈవెంట్లో భారత్ స్వర్ణం లేకుండా వెనుదిరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత పురుషుల జట్టు సెమీస్‌లో ఇరాన్ చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకోగా... మహిళల జట్టు ఫైనల్లో 24–27తో ఇరాన్ చేతిలోనే ఓడిపోయి రజతంతో తృప్తిపడింది. ఈ ఫలితాలు నిరాశ కలిగించాయన్న శ్రీనివాస్‌రెడ్డి రజత, కాంస్యాలను సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయని చెప్పారు. ‘మేం ఎప్పుడూ స్వర్ణం కోసమే బరిలోకి దిగాం. మహిళల విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణం సాధించే అవకాశాన్ని కోల్పోవడం బాధిస్తోంది. కబడ్డీ ఆట విశ్వవ్యాప్తమైంది. ఇందులో పతకం సాధించేందుకు ప్రపంచ దేశాలు ఆరాటపడుతున్నాయి’ అని తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన వివరించారు. కబడ్డీ ప్లేయర్లకు గుర్తింపు కూడా లేని దశ నుంచి ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలు ఈ క్రీడను ఆడే స్థితికి ఆట అభివృద్ధి చెందిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘2014లోనే చైనీస్ తైపీ కబడ్డీ ఆడటం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు ఆ దేశం పతకం బరిలో నిలుస్తోంది. దీన్ని బట్టే కబడ్డీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పొచ్చు. ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్ల అర్జున అవార్డు దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఒకానొక సమయంలో మిల్కాసింగ్ నేతృత్వంలోని కమిటీ కేవలం ఐదారు దేశాలు ఆడే కబడ్డీకి అర్జున అవార్డు ఇవ్వటమేంటని ఆ దరఖాస్తును తిరస్కరించారు. ప్రస్తుతం 40 దేశాలు ఈ క్రీడలో సత్తా చాటుతున్నాయి’ అని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రొ కబడ్డీ లీగ్ ద్వారా స్వదేశీ, విదేశీ ఆటగాళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పారు. భారత ఆటగాళ్ల ఆటను విదేశీ ప్లేయర్లు శ్రద్ధగా గమనిస్తున్నారని, ఇక మనవాళ్లు మరింత కఠినంగా శ్రమించాల్సి ఉందని పేర్కొన్నారు. కొన్నేళ్ల కఠోర శ్రమ అనంతరం ఇరాన్ జట్టు స్వర్ణం గెలిచిందని అన్నారు. ప్రస్తుతం ఆ జట్టుకు భారత్‌కు చెందిన శైలజా జైన్ కోచ్‌గా ఉండటంతో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుందని వివరించారు. ‘భారత్ నుంచి చాలామంది కోచ్‌లు ఇరాన్‌కు వెళ్లారు. ఆరు నెలల కాలంలోనే పటిష్టమైన జట్టును తయారు చేయడం ఏ కోచ్‌కూ సాధ్యం కాదు. గతంలో చేసిన కృషి ప్రస్తుతం ప్రతిఫలిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టుకు శైలజా జైన్ కోచ్‌గా ఉండటంతో ఆమెకు ఆ ఖ్యాతిని ఇస్తున్నారు’ అని ఆయన విశ్లేషించారు. -
ఆసియా క్రీడల్లో కబడ్డీ జట్టుకు ఊహించని షాక్
-
ఏషియాడ్‌లో నేటి భారతీయం
జిమ్నాస్టిక్స్: మహిళల బ్యాలెన్స్ బీమ్ ఫైనల్: దీపా కర్మాకర్ (మ.గం. 3 నుంచి) కబడ్డీ: మహిళల ఫైనల్: భారత్ వర్సెస్ ఇరాన్; (మ.గం.1.30 నుంచి) షూటింగ్: ఉ.గం.7.30 నుంచి) పురుషుల 300 మీ. స్టాండర్డ్ రైఫిల్: అమిత్, హర్జీందర్ సింగ్ పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్: శివమ్ శుక్లా, అనీష్; మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ : మను భాకర్, హీనా సిద్ధూ టెన్నిస్: పురుషుల డబుల్స్ ఫైనల్: బోపన్న, దివిజ్ శరణ్గీబబ్లిక్/డెనిస్ (కజకిస్తాన్); సింగిల్స్ సెమీస్: ప్రజ్నేశ్ వర్సెస్ డెనిస్ ఇస్తోమిన్ వెయిట్‌లిఫ్టింగ్: మహిళల 63 కేజీలు: రాఖీ హల్దార్ (మధ్నాహ్నం గం.12.30 నుంచి) బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్: శ్రీకాంత్ వర్సెస్ విన్సెంట్ (హాంకాంగ్); ప్రణయ్ వర్సెస్ వాంగ్చరొయెన్ (థాయ్‌లాండ్) (మ.12 గం.నుంచి). -
ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారి..
జకర్తా: ప్రపంచ కబడ్డీ చాంపియన్ భారత్‌కు ఆసియా క్రీడల్లో ఊహించని షాక్ తగిలింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫైనల్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. సెమీఫైనల్లో భాగంగా గురువారం బలమైన ఇరాన్ చేతిలో 18-27 తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఇరాన్ ఆటగాళ్లు.. బలమైన డిఫెన్స్‌తో అజయ్ ఠాకూర్‌సేనకు పాయింట్లు చిక్కకుండా అడ్డుకున్నారు. బలమైన డిఫెండింగ్ గల ఇరాన్ సూపర్ ట్యాకిల్ పాయింట్లతో విరుచుకపడింది. దీంతో ఆత్మరక్షణలో పడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు తలవంచారు. టీమిండియా సారథి అజయ్ ఠాకూర్, ప్రో కబడ్డీ లీగ్ స్టార్ రైడర్లు ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరీ, రిషాంక్ దేవడిగా, మోనూ గోయత్‌లు ఇరాన్ డిఫెండింగ్ ముందు తేలిపోయారు.భారత రైడర్లు పాయింట్లు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక డిఫెండింగ్‌లోనూ భారత ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు. తొలుత డిఫెండర్ గిరీష్ మారుతి ఎర్నాక్ రాణించినా చివర్లో విఫలమయ్యారు. మోహిత్ చిల్లర్, దీపక్ నివాస్ హుడా, సందీప్ నర్వాల్‌లు కూడా చేతులెత్తాశారు. భారత ఆటగాళ్లు సమిష్టిగా విఫలమవ్వడంతో ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుస్తుందనుకున్న జట్టు తొలి సారి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక మరోవైపు భారత మహిళల కబడ్డీ జట్టు ఆసియా క్రీడల్లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత మహిళల జట్టు 27-14తేడాతో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసి కనీసం రజతం ఖాయం చేశారు. -
ఆసియన్ కబడ్డీ: అజయ్ ఠాకూర్‌కే పట్టం
హైదరాబాద్: దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీ గెలుచుకొని ఉత్సాహంగా ఉన్న భారత కబడ్డీ జట్టు మరో సమరానికి సిద్దమైంది. ఏడు సార్లు ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత టీమిండియా మరోసారి విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆగష్టులో ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియన్ గేమ్స్‌లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆసియన్ గేమ్స్‌లో పాల్గోనే 12 మంది సభ్యులతో కూడిన కబడ్డీ జట్టును అఖిల భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య (ఏకేఎఫ్) ప్రకటించింది. తమిళ్ తలైవాస్ సారథి అజయ్ ఠాకూరే మరోసారి టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు. సీనియర్లను పూర్తిగా పక్కకు పెట్టిన సమాఖ్య యువకులతో కూడిన జాబితాను విడుదల చేసింది. సీనియర్లు రాకేశ్ కుమార్, అనూప్ కుమార్, మంజీత్ చిల్లర్, సురేంద్ర నాడాలకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. మరోసారి.. ఆసియన్ గేమ్స్‌లో పోటీపడుతున్న పదిజట్లలో టీమిండియానే అన్ని విధాలుగా బలంగా కనిపిస్తోంది. మరోసారి విజేతగా నిలవాలని భారత్ జట్టు ఆశపడుతోంది. ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్, రిషాంక్ దేవడిగ, రోహిత్ కుమార్, మోనూ గోయత్‌లతో రైడింగ్ విభాగం బలంగా ఉండగా.. దీపక్ నివాస్ హుడా, సందీప్ నర్వాల్, గిరీష్ మారుతి ఎర్నాక్, మోహిత్ చిల్లర్, రాజు లాల్ చౌదరీ, మల్లేష్ గంగాధరిలతో ఢిఫెండింగ్ దుర్భేద్యంగా ఉంది. -
భారత్ అదరహో
దుబాయ్: ఆరు దేశాలు పాల్గొన్న దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగి ట్రోఫీ చేజిక్కించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో ప్రపంచ చాంపియన్ భారత్ 44–26తో ఇరాన్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ ప్రథమార్ధం ముగిసేసరికి 18–11తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ జయభేరి మోగించింది. బలమైన భారత డిఫెన్స్‌ను ఛేదించలేక ఇరాన్ చతికిలబడింది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 9 రైడ్ పాయింట్లతో సత్తా చాటాడు. -
‘మమ్మల్ని వేధింపులకు గురి చేశారు’
విజయవాడ: ఏపీ కబడ్డీ సంఘంలో లైంగిక ఆరోపణల ఎపిసోడ్‌పై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. తమను ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి కార్యదర్శి వీరలంకయ్య వేధిస్తున్నాడని, సర్టిఫికేట్లు అమ్ముకున్నాడని పలువురు మహిళా క్రీడాకారిణులు మీడియా ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి శ్రీకాంత్‌తో కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ఏపీ కబడ్డీ అసోసియేషన్ అవతవకలపై చర్యలు తీసుకోవాలన్నారు. తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని శ్రీకాంత్ నిలదీశారు. వీరలంకయ్యకు ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ సపోర్టు ఉందని అన్నారు. తాను క్షమాపణ కోరుతూ లెటర్ రాశానని ప్రభాకర్ చెబుతున్న విషయం కూడా అబద్ధమని పేర్కొన్న శ్రీకాంత్.. అది ఫోర్జరీ చేసిన లెటర్ అని తెలిపారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఈ సందర్బంగా పేర్కొన్నారు. మరొకవైపు వీరలంకయ్యపై చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా క్రీడాకారిణులు కోరుతున్నారు. మహిళా క్రీడాకారిణులను వీర లంకయ్య వేధించకపోతే ఆయన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఆయన్ని వెంటనే అసోసియేషన్ నుంచి తొలగించడంతో పాటు, దొంగ సర్టిఫికేట్ పై ఏసీబీ విచారణ జరిపించాలన్నారు. ఒక్కొక్క సర్టిఫికేట్‌ను ఏడున్నర లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేసే అధికారం స్టేట్ బాడీకు లేదన్నారు. -
భారత్ శుభారంభం
దుబాయ్: టోర్నీ ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా ఆధిపత్యం మాత్రం తమదేనని భారత కబడ్డీ జట్టు మరోసారి చాటింది. దుబాయ్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా దాయాది పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ భారత్ 36–20తో గెలిచి టోర్నీలో శుభారంభం చేసింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత్... తొలి అర్ధభాగం ముగిసే సరికి 22–9తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి సునాయాస విజయం సొంతం చేసుకుంది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 15 రైడ్ పాయింట్లతో చెలరేగి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో శనివారం కెన్యాతో తలపడనుంది. -
రాష్ట్ర కబడ్డీ సంఘం కార్యదర్శి తొలగింపు
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్‌ను రాష్ట్ర కబడ్డీ సంఘం ఏకగ్రీవ తీర్మానంతో తొలగించినట్లు ఆదివారం పేర్కొన్నారు. ఈ సమావేశాన్ని రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు మహ్మద్ అజీజ్ ఖాన్ ఆధ్వర్యంలో చిత్ర లేఅవుట్లోని మహాత్మాగాంధీ లా కాలేజ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా... గత ఏడాది తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీల్లో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఆడిన క్రీడాకారులకు పారితోషికం ఇవ్వకపోవటం, దాదాపు ఒక కోటి రూపాయలమేర జగదీశ్వర్ యాదవ్ ఏం చేశాడని సంఘం సభ్యులు సందేహాలను లేవనెత్తారు. జాతీయ స్థాయిలో కబడ్డీలో ఓనమాలు తెలియని వారిని రప్పించి కబడ్డీ ఆడించటం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆడిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ఇతరులకు జాతీయ స్థాయి సర్టిఫికెట్లు ఇవ్వడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. గత ఏడాది సీనియర్ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో హైదరాబాద్ పురుషుల జట్టును ఒకేరోజు రెండుమార్లు ఓడించిన నల్గొండ జట్టు రాష్ట్రంలో ప్రథమ స్థానం కైవసం చేసుకోగా ఆ జట్టు నుంచి ఒకరిని, ఓడిన హైదరాబాద్ జట్టు నుంచి నలుగురిని జాతీయస్థాయికి ఎంపిక చేయడం పట్ల జగదీశ్వర్ యాదవ్ చర్యను సమావేశంలో ప్రత్యేకంగా ప్రశ్నించారు. ఒంటెత్తు పోకడల వల్ల అతడి లోపాలను రాష్ట్ర, జాతీయ కబడ్డీ క్రీడాకారులు గళం ఎత్తి ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగదీశ్వర్ యాదవ్ అండదండలతో రాష్ట్ర సంఘం సంయుక్త కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా సంఘం అధ్యక్షుడు పి.సత్యనారాయణ సంఘ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాడన్నారు. నల్గొండ జిల్లా కార్యదర్శి జి.కర్తయ్యకు పూర్తి మెజారిటీ వున్నా అవిశ్వాస తీర్మానం డ్రామాకు తెరలేపి కర్తయ్యను తొలగించటం పట్ల పి.సత్యనారాయణ చర్యను సభ్యులు తప్పుబడుతూ ఇరువురినీ తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో 31 జిల్లాల సభ్యులు పాల్గొన్నారు. -
తెలంగాణ కబడ్డీ జట్లకు ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు సన్నాహకంగా తెలంగాణతో జరుగుతోన్న ఫ్రెండ్లీ కబడ్డీ టోర్నమెంట్లో దక్షిణ కొరియా జట్లు జోరు కనబరుస్తున్నాయి. బాచుపల్లిలోని కబడ్డీ అకాడమీలో శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కొరియా జట్ల దూకుడుకు తెలంగాణ జట్లు ఓటమి పాలయ్యాయి. పురుషుల విభాగంలో తెలంగాణ 21–47తో కొరియా చేతిలో చిత్తుగా ఓడింది. పర్యాటక జట్టులో డోగ్ గున్లీ, ఎర్న్ తే డోక్ ఆకట్టుకున్నారు. తెలంగాణ జట్టులో లింగమ్ యాదవ్, హనుమంత్ రాణించారు. మహిళల విభాగంలో కొరియా 35–25తో తెలంగాణపై నెగ్గింది. రాష్ట్ర జట్టులో పింకీ రావు, ప్రవళిక, పవిత్ర పోరాడారు. -
దక్షిణ కొరియాతో మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు దక్షిణ కొరియా కబడ్డీ జట్లు ప్రాక్టీస్ కోసం నగరానికి తరలివచ్చాయి. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని కాసాని జె.ఎస్ గెహ్లాట్ కబడ్డీ అకాడమీలో తెలంగాణ పురుషుల, మహిళల, దక్షిణకొరియా పురుషుల, మహిళల జట్ల మధ్య ఈ నెల 18 వరకు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తెలంగాణ పురుషుల, దక్షిణ కొరియా పురుషుల జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్ 38–38 పాయింట్లతో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తెలంగాణ క్రీడాకారులకు ఇది చక్కటి అవకాశం. అంతర్జాతీయ ఆటగాళ్లతో ఆడే అవకాశం లభించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా తెలంగాణ కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి, ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్రావు, జగ్మోహన్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రస్థానంలో అథ్లెటిక్స్ జట్టు
సాక్షి, హైదరాబాద్: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ చాంపియన్ షిప్లో అథ్లెటిక్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అథ్లెటిక్స్ జట్టు తొలి స్థానాన్ని దక్కించుకోగా... హాకీ, వాలీబాల్ జట్లు వరుసగా రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో అథ్లెటిక్స్ జట్టు 42–30తో హాకీపై విజయం సాధించింది. రైడర్ గోపాల్ అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. హాకీ జట్టు తరఫున నవీన్ రాణించాడు. రెండో మ్యాచ్‌లో అథ్లెటిక్స్ జట్టు 36–23తో వాలీబాల్ జట్టుపై నెగ్గింది. ఇతర మ్యాచ్‌ల్లో హాకీ జట్టు 49–45తో వాలీబాల్ జట్టుపై విజయం సాధించింది. వాలీబాల్ టీమ్‌లో రైడర్ నరేశ్ ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో ‘సాయ్’ ఎస్టీసీ 20–19తో ఎన్ఐఎస్ కబడ్డీని ఓడించింది. సాయ్ తరఫున సాయి గౌడ్, అంజి... ఎన్ఐఎస్ జట్టులో సతీశ్, సురేశ్, అలెక్స్ ప్రతిభ కనబరిచారు. -
భారత్, పాక్ కబడ్డీ... కబడ్డీ...
దుబాయ్: చిరకాల ప్రత్యర్థులు కూతకు సిద్ధమయ్యారు. దుబాయ్ వేదికగా ఈనెల 22 నుంచి 30 వరకు జరిగే ఆరు దేశాల కబడ్డీ మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో పోటీపడనున్నాయి. ఇందులో దాయాది జట్లతో పాటు కెన్యా గ్రూప్ ‘ఎ’లో ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో ఇరాన్, కొరియా, అర్జెంటీనా జట్లు రౌండ్ రాబిన్ లీగ్‌లో తలపడతాయి. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య, స్టార్ నెట్‌వర్క్‌లు ఉమ్మడిగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. 22న జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ పోటీపడతాయి. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. 29న సెమీస్, 30న ఫైనల్స్ జరుగుతాయి. -
భారత కబడ్డీ జట్టు కోచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, సంగారెడ్డి: దుబాయ్‌లో జరుగనున్న ‘మాస్టర్స్ కప్ కబడ్డీ టోర్నీ’లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా సంగారెడ్డికి చెందిన ఎల్. శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. శ్రీనివాస్ రెడ్డిని భారత కోచ్‌గా నియమించినట్లు భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య శుక్రవారం ప్రకటించింది. ఈనెల 22 నుంచి 30 వరకు దుబాయ్‌లోని అల్‌వసల్ ఇండోర్ స్టేడియంలో మాస్టర్స్ కప్ కబడ్డీ టోర్నీ జరుగుతుంది. ఇందులో భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, డెన్మార్క్, ఇరాన్, అర్జెంటీనా జట్లు తలపడుతున్నాయి. భారత జట్టుకు అజయ్ ఠాకూర్ (తమిళ్ తలైవాస్ స్టార్ రైడర్) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సందర్భంగా భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్యకు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో జరుగనున్న ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లోనూ శ్రీనివాస్ రెడ్డి జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. గతంలో తెలుగు టైటాన్స్, హరియాణా స్టీలర్స్ జట్టుకు ఆయన సహాయక కోచ్‌గా ఉన్నారు. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జట్లకు కోచ్‌గా పనిచేశారు. -
క్రీడాకారులకు ఐఓసీఎల్ సత్కారం
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) సంస్థ గురువారం తమ సంస్థకు చెందిన క్రీడాకారులను ఘనంగా సత్కరించింది. పలు టోర్నీల్లో ఐఓసీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తోన్న 60 మంది భారత క్రీడాకారులను సన్మానించింది. ఈ కార్యక్రమంలో మేటి క్రీడాకారులైన మనికా బాత్రా, ఆచంట శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్), రోహన్ బోపన్న (టెన్నిస్), పారుపల్లి కశ్యప్, ఎన్. సిక్కిరెడ్డి (బ్యాడ్మింటన్), ఆదిత్య తారే (క్రికెట్), ద్రోణవల్లి హారిక (చెస్) తదితరులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో క్రీడాకారుల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఐఓసీఎల్... ఈ సందర్భంగా కొత్త నిర్ణయాలను ప్రకటించింది. దేశంలో క్రీడా సంస్కృతిని మరింత పెంపొందించేలా నూతన క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నామని ఐఓసీఎల్ హెచ్ఆర్ డైరెక్టర్ కె. రంజన్ మొహపాత్ర చెప్పారు. ప్రస్తుతం ఐఓసీఎల్ 10 క్రీడలకు స్పాన్సర్షిప్ అందజేస్తుంది. వీటితో పాటు కొత్తగా వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, రెజ్లింగ్, కబడ్డీ క్రీడల్ని ఈ జాబితాలో చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రంజన్ తెలిపారు. వర్ధమాన ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు కల్పిస్తూ, వారి ప్రతిభకు గుర్తింపుగా చిరు సత్కారాలతో గౌరవించడం వల్ల ఆటగాళ్లలో ప్రేరణ కలిగించవచ్చు అని ఆయన అన్నారు. ఈ ప్రేరణతో వారు దేశానికి, సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వారు కీర్తి ప్రతిష్టలు తెస్తారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఐఓసీఎల్ తరఫున కోచింగ్, స్పోర్ట్స్ కిట్లను అందజేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. -
గబ్బర్ కబడ్డీ పోజ్.. ఎందుకంటే
ముంబై : టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మైదానంలో వినూత్నంగా సంబరాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు. క్యాచ్ పట్టిన అనంతరం తొడ కొడుతూ ధావన్ ఇచ్చే కబడ్డీ పోజ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ పోజ్ వెనుక ఉన్న కథను ఇటీవల గబ్బర్ చెప్పుకొచ్చాడు. గౌరవ్ కపూర్ ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’ షోలో పాల్గొన్న ధావన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కబడ్డీ పోజ్‌పై స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ నుంచి ఇది ప్రారంభమైంది. షేన్ వాట్సన్ క్యాచ్ పట్టుకున్న అనంతరం తొలి సారి ఈ పోజ్ ఇచ్చాను. కబడ్డీ ఆటను నేను ఆస్వాదిస్తాను. కబడ్డీ నాకు ఎంతో వినోదాన్ని ఇస్తుంది. నా హృదయం నుంచి వచ్చిన పోజ్ కావడంతో ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చింది. బౌండరీ లైన్ వద్ద నిలబడితే.. కబడ్డీ స్టైల్ పోజ్ ఇవ్వాలని అభిమానులు అడుగుతుంటారు.’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే షోలో తనకు గబ్బర్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా ధావన్ తెలియజేశాడు. చదవండి: ‘గబ్బర్’ కథ చెప్పిన ధావన్ -
కబడ్డీతో సందడి చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్స్!
-
ఒక్కసారిగా ఆటనే మార్చేశారు.. వైరల్
మరికొన్ని రోజుల్లో సాకర్ సమరం ఫీఫా వరల్డ్ కప్-2018 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆతిథ్య దేశం రష్యాకు చేరుకున్న జట్లు.. సాధనలో మునిగిపోయాయి. ఇంగ్లాండ్ జట్టు మేనేజర్ గరేత్ సౌత్‌గేట్ తన బృందంతో సాధన చేయిస్తున్నారు. అయితే ఇంతలో ఊహించని సన్నివేశం దర్శనమిచ్చింది. ఆటగాళ్లు ఉన్నపళంగా మొత్తం ఆటనే మార్చేశారు. బంతిని పక్కన పెట్టి కాసేపు కబడ్డీతో సందడి చేశారు. జట్టు ఆటగాళ్లు హ్యారీ కేన్, డానీ వెల్బెక్, గేరీ కచిల్, జెస్సే లింగార్డ్ తదితరులు కలిసి మైదానంలో కబడ్డీ ఆడారు. ‘మానసిక ఒత్తిడి అధిగమించడానికి కబడ్డీ ఓ మంచి సాధనం. అందుకే మా ఆటగాళ్లను కబడ్డీ ఆడమని ప్రోత్సహిస్తున్నాం’ అని సౌత్‌గేట్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రికెటర్లు ప్రాక్టీస్ సమయంలో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించిన దృశ్యాలు అనేకం. ధోనీ, కోహ్లి లాంటి చాలా మంది ఆటగాళ్లు కూడా సాకర్‌కు వీరాభిమానులే. కానీ సాకర్ ప్లేయర్లు మాత్రం ఇలా కబడ్డీపై పడిపోవటం మాత్రం అరుదైన విషయమే. ఇదిలా ఉండగా జూన్ 14న ఫీఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. గ్రూప్-జీ జాబితాలో ట్యూనీషియా, బెల్జియం, పనామాతోపాటు ఇంగ్లాండ్ జట్టు కూడా ఉంది. జూన్ 18న వోల్వోగార్డ్లో ట్యూనీషియాతో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ ఆడుతుంది. -
క్రీడాకారులు ఎవ్వరు అధైరపడవద్దు..
సాక్షి, విజయవాడ : క్రీడాకారులు ఎవ్వరు అధైరపడవద్దు.. ఎవ్వరికి అన్యాయం జరగకుండా చూస్తామని కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన చైర్మన్ కడియాల బుచ్చిబాబు చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గతంలో కబడ్డీ అసోసియేషన్‌లో తలెత్తిన వివాదాల కారణంగా స్వచ్చందంగా జిల్లా అసోసియేషన్‌ను రద్దు చేశామన్నారు. ‘ మే 29న కర్నూలులో ఏపీ కబడ్డీ అసోసియేషన్ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాకు నూతనంగా హడక్ కమిటీని నియమించారు. నూతన అసోసియేషన్‌కు చైర్మన్‌తో పాటు మరో ఆరుగురిని సభ్యులను ఎంపిక చేశారు. ఇంకా వివాదాలకు తావు లేకుండా అసోసియేషన్‌ను ముందుకు తీసుకువెళ్తాం. కబడ్డీలో కృష్ణా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని’ బుచ్చిబాబు పేర్కొన్నారు. ‘ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్న అసోసియేషన్ రూమ్‌ను హడక్ కమిటీ స్వాధీనం చేసుకుంటుంది. అసోసియేషన్‌లో ఉన్న విభేదాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.. ఇంకా వారు చూసుకుంటారు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్న హడక్ కమిటీ దృష్టికి తీసుకురావచ్చని’ కడియాల బుచ్చిబాబు తెలిపారు. -
‘ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేయండి’
విజయవాడ: ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేయాలని వెటరన్ కబడ్డీ క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. కబడ్డీ అసోసియేషన్‌లో వెలుగు చూసిన ఆరోపణలు తమను తీవ్రంగా బాధించాయని పేర్కొన్న వారు.. ప్రధానంగా తమకు అన్యాయం జరిగిందని, వేధిస్తున్నారని ఆడపిల్లలు బయటకొచ్చి చెప్పడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇంత జరుగుతున్నా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇందుకు ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేయడమే ఉత్తమమైన మార్గమని వారు సూచించారు. ఈ మేరకు నగరంలోని రైల్వే ఇనిస్టిట్యూట్ ఆడిటోరియంలో సమావేశమైన వెటరన్ కబడ్డీ క్రీడాకారులు.. క్రీడాకారిణుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీనిలో భాగంగా ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి వీరలంకయ్యను తిరిగి కార్యదర్శిగా నియమించడాన్ని వారు తప్పుబట్టారు. దీనిపై కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉన్న శ్రీకాంత్‌ను జిల్లా అసోసియేషన్‌ను తొలగించిన పెద్దలు.. వీర లంకయ్యపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కనీసం క్రీడాకారుల ఆరోపణలపై కమిటీని కూడా వేయకుండా వీర లంకయ్యను వెనుకేసుకొస్తున్నారన్నారు. ఏపీ కార్యదర్శి హోదాలో వీర లంకయ్య అనేక అక్రమాలకు పాల్పడటం వాస్తవమన్నారు. జిల్లా అసోసియేషన్ ను రద్దు చేసిన పెద్దలు.. ఏపీ అసోసియేషన్ ను ఎందుకు రద్దు చేయలేదన్నారు. అధికారం, డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చని చెప్పేందుకు ఈ ఘటనే ఉదాహరణ అని వారు పేర్కొన్నారు. ఎంతో మంది ఆడపిల్లలు రోడ్డెక్కి ఆవేదన చెప్పినా .. పట్టించుకోకుండా నిందితుడిగా ఉన్న వ్యక్తికి అండగా నిలవడం బాధాకరమన్నారు. ఇలా అయితే ఆడపిల్లలు క్రీడల్లోకి పంపేందుకు తల్లిదండ్రులు భయపడిపోతారన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ను పూర్తిగా రద్దు చేసి .. క్రీడాకారులకు న్యాయం చేయాలని వెటరన్ క్రీడాకారుల హోదాలో సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. క్రీడా సంఘంలో సీనియర్ క్రీడాకారులు ఉండేలా చూస్తే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందన్నారు. -
కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ రద్దు
సాక్షి, విజయవాడ : విమర్శల నేపథ్యంలో కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ను స్వచ్చందంగా రద్దు చేసి పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. క్రీడాకారులను లైంగికంగా వేధిస్తున్నారని మీడియాకి చెప్పి అల్లరి చేయడం తగదన్నారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గంత చర్చించుకోవాలన్నారు. వీర్ల లంకయ్యకి, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్‌కి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, ఈనేపథ్యంలో వారు అసోసియేషన్‌ను పావుగా వాడుకున్నారని ఆరోపించారు. ఈ వివాదాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. అసోసియేషన్ మద్దతు వల్లే క్రీడాకారులు రాణిస్తున్నారని తెలిపారు. -
కబడ్డీ కోర్టులోనూ క్యాస్టింకౌచ్!
-
జీవితాలతో 'ఆటా'డుకున్నాడు..!
కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీరలంకయ్య తమ జీవితాలతో ఆటాడుకున్నాడని పలువురు క్రీడాకారిణులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లను అమ్ముకోవడం ద్వారా ఇప్పటికే ఎంతో మందికి అన్యాయం చేశారని ఆరోపించారు. విజయవాడ స్పోర్ట్స్: ‘తాను రైల్వేలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశా.. కబడ్డీ ఫెడరేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ నిజమైనదేనంటూ ఇచ్చే ఫాం–2ని ఇవ్వమని కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీర్లలంకయ్యని ఫోన్లో అభ్యర్థించాను.. అందుకు రూ.లక్షలు డిమాండ్ చేశారు.. పైగా ‘నీకిస్తే నీ నుంచి నాకేంటి లాభం’ అంటూ ముక్తయించారని విశాఖపట్నంకు చెందిన క్రీడాకారిణి సునీత ఆరోపించారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని కబడ్డీ గ్రౌండ్లో గురువారం కబడ్డీ అసోసియేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి వై.శ్రీకాంత్‌తో కలసి క్రీడాకారిణులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సునీత మాట్లాడుతూ సర్టిఫికెట్ కోసం అక్కడికి, ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుందని అర్థమై, అర్థం కాని రీతిలో లైంగికంగా వేధించారని పేర్కొంది. అదేమని అడిగితే డైవర్ట్ చేసి మాట్లాడేవారని వివరించారు. తాను 15 నేషనల్స్ ఆడిన చివరకు ఫాం–2 అడిగితే నిరు పేదనైన నన్ను వీరలంకయ్య చాలా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడాకారిణిలు మాట్లాడుతూ ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.వీర్లలంకయ్య సర్టిఫికెట్లను అమ్ముకోవడం ద్వారా ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారుల జీవితాలు నాశనమం చేశారని చెప్పారు. క్రీడాకారిణి హత్య వెనుక.. సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నారని నిలదీసిన కారణంగా 1995లో ప్రియదర్శిని అనే క్రీడాకారిణిని కారులో వీరలంకయ్య హత్య చేశారని ఆరోపించారు. వీరలంకయ్యను అసోసియేషన్ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలపై సీఎం చంద్రబాబుతో సహా ఉన్నతాధికారులందరికీ ఫిర్యాదు చేశామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 20 ఏళ్లుగాకొనసాగడం నేరం వీరలంకయ్య 20 ఏళ్లుగా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉండడం నేరమని కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆడినవారికి కాకుండా బయట వ్యక్తులకు కబడ్డీ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని తన వద్ద ఆధారాలు ఉన్నాయని విలేకరులకు తెలిపారు. ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో కబడ్డీ క్రీడాకారిణులు ధనలక్ష్మి, సునీత, గౌతమి(విశాఖపట్నం), నవ్య, కేఎల్వీ రమణ(కృష్ణా) పాల్గొన్నారు. -
పెళ్లికి ఒప్పుకోని ప్లేయర్.. రూంలో వేసి లాక్!
హర్యానా: జాతీయ స్థాయి మహిళ కబడ్డీ ప్లేయర్ హర్యానా మహిళ కమిషన్‌ను కలిసింది. ఆమె రోహ్తక్ జిల్లా నుంచి ఎంపిక అయ్యింది. తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నారని మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ‘పెళ్లికి నేను నిరాకరించాను. అందుకే వారు నన్ను ఒక గదిలో పెట్టి బీగం వేశారు. నా చదువును, ఆటలను ఇంకా కొనసాగించాలని ఉంది’ అని ఆమె మహిళ కమిషన్ ముందు తన బాధలను తెలిపింది. -
బీబీఎంబీ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ పవర్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (సీసీఎస్‌యూ) కబడ్డీ టోర్నమెంట్లో భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ (బీబీఎంబీ) జట్టు సత్తా చాటింది. పవర్‌స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో జరిగిన ఈ టోర్నీలో బీబీఎంబీ జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో బీబీఎంబీ 58– 18తో ఎస్‌జేవీఎన్ జట్టుపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో పవర్‌గ్రిడ్ జట్టు 48–12తో నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)పై గెలిచింది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎస్‌ఆర్‌టీఎస్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్, పవర్‌గ్రిడ్ జీఎం ఎ. రవీందర్, తెలంగా ణ కబడ్డీ సంఘం కార్య దర్శి జగదీశ్వర్ యాదవ్ విజేతలకు పతకాలను అందజేశారు. ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సురీందర్ సింగ్ (బీబీఎంబీ) ‘బెస్ట్ ప్లేయర్’, ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులను అందుకున్నాడు. బల్వంత్ రాణా (ఎస్‌జేవీఎన్) ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద టోర్నమెంట్’, ప్రతాప్ సింగ్ (బీబీఎంబీ) ‘బెస్ట్ క్యాచర్ ఆఫ్ ద టోర్నమెంట్’ పురస్కారాలను గెలుచుకున్నారు. -
పవర్‌గ్రిడ్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ పవర్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (సీపీఎస్‌యూ) కబడ్డీ టోర్నమెంట్లో పవర్‌గ్రిడ్ జట్టు శుభారంభం చేసింది. పవర్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (పీఎస్‌సీబీ) ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో తొమ్మిది ‘సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ పవర్ యూనిట్’ జట్లు తలపడుతున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో పవర్‌గ్రిడ్ జట్టు 54–13తో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) జట్టుపై ఘన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ (బీబీఎంబీ) 50–14తో మినిస్ట్రీ ఆఫ్ పవర్ (ఎంఓపీ)పై, ఎస్‌జేవీఎన్ జట్టు 46–11తో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)పై, నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) 52–21తో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)పై, ఎన్‌హెచ్‌పీసీ 102–20తో ఎంఓపీపై గెలుపొంది ముందంజ వేశాయి. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవర్‌గ్రిడ్ (ఎస్‌ఆర్‌టీఎస్–1) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పవర్‌గ్రిడ్ సంస్థ అధికారులు, ‘శాట్స్’ ప్రతినిధులు పాల్గొన్నారు. -
విజేత ఓయూ మహిళా కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి మహిళల కబడ్డీ టోర్నమెంట్లో కోఠి మహిళా యూనివర్సిటీ కాలేజి జట్టు సత్తా చాటింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో యూనివర్సిటీ కాలేజి జట్టు 43–30తో కస్తూర్బా గాంధీ జట్టుపై ఘనవిజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో యూనివర్సిటీ కాలేజి 42–11తో ఆంధ్ర మహిళా సభపై, కస్తూర్బా జట్టు 57–15తో భవన్స్ సైనిక్‌పురి జట్టుపై విజయం సాధించాయి. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భవన్స్ జట్టుపై ఆంధ్రమహిళా సభ గెలుపొందింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి టోర్నమెంట్ (ఐసీటీ) డైరెక్టర్ బి. సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రశాంత ఆత్మ, కబడ్డీ సాయ్ కోచ్ కె. శ్రీనివాస్ రావు, ఓయూసీడబ్ల్యూ కార్యనిర్వాహక కార్యదర్శి వి. దీపిక రావు, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడారత్నాలు..
పేదింటి విద్యార్థులు పలు క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. సంక్షేమ హాస్టళ్లలో వసతి పొందుతూ.. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఉన్న కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు సాధించారు. నిరంతరం సాధన చేస్తూ.. దేశజట్టుకు పాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సాక్షి, నల్లగొండ : పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన దగ్యాల సాయికిరణ్ నల్లగొండలోని బీసీ వసతిగృహంలో ఉంటూ స్థానిక బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి క్రీడల్లో ఉన్న ఆసక్తితో కబడ్డీలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనభర్చి పలు పతకాలు కైవసం చేసుకున్నాడు. ఎప్పటికైనా దేశం తరపున కబడ్డీ పోటీల్లో పాల్గొనడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. సాయికిరణ్ పాల్గొన్నపోటీలు.. 2016 డిసెంబర్లో నల్లగొండలో జరిగిన ఎస్జీఎఫ్ 62వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2015–16లో గుజరాత్లో జరిగిన 61వ ఎస్జీఎఫ్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుపున ఆడాడు. 2015లో ఖమ్మంలోని సత్తుపల్లిలో ఒకటో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా జట్టును ద్వితీయ స్థానంలో నిలిపాడు. 2015లో ఆదిలాబాద్ డిస్టిక్ట్ సబ్ జూనియర్ అండర్–16 కబడ్డీ పోటీల్లో పాల్గొని జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలిపాడు. 2016లో వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టును మొదటిస్థానంలో నిలిపాడు. 2017 జనవరిలో మంచిర్యాల జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ అండర్–16 విభాగంలో పాల్గొని జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలిపాడు. సబ్ జూనియర్ అండర్–16 కబడ్డీ పోటీలకు ఆలిండియా స్పోర్డ్స్ అథారిటీ జట్టుకు ఎంపికయ్యాడు. కబడ్డీలో రాణిస్తున్న మధు నల్లగొండ టూటౌన్ : పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన తరి మధు నల్లగొండలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతూ స్థానిక ఎస్సీ వసతి గృహంలో ఉంటున్నాడు. కబడ్డీ మీద మక్కువతో పలు పోటీల్లో రాణించి.. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. కబడ్డీతో పాటు వెయిట్ లిఫ్టింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దేశం తరపున ఆడాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్నాడు. మధు పాల్గొన్న పోటీలు.. 2016 డిసెంబర్లో నల్లగొండలో నిర్వహించిన 62వ ఎస్జీఎఫ్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు తరుపున పాల్గొన్నాడు. 2013–14 విజయనగరం జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్–14 విభాగంలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014–15లో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–14లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు.. 2014–15లో ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పైకా పోటీల్లో జిల్లా జట్టు నుంచి పాల్గొని మొదటి బహుమతి కైవసం చేసుకున్నాడు. 2015–16లో ఎస్జీఎఫ్ అండర్–17 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయ బహుమతి గెలుచుకోవడంలో కీలకపాత్ర వహించాడు. 2016 డిసెంబర్లో వరంగల్‌లో జరిగిన ఎస్జీఎఫ్ అండర్–17 కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. 2015–16లో ఖమ్మంలో జరిగిన 55 కేజీల వెయిటింగ్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో మెడల్ సాధించాడు. ఫుట్‌బాల్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన సాయిచంద్రసిద్దార్థ నల్లగొండకు చెందిన బొమ్మపాల సాయిచంద్రసిద్దార్థ ఫుట్‌బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ చాటుతున్నాడు. 2016లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఫుట్‌బాల్ అకాడమీకి ఎంపికైన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. పలు జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించాడు. సిద్దార్థ పాల్గొన్న పోటీలు.. 2015లో ఛత్తీస్‌గడ్‌లో జరిగిన జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరపున పాల్గొన్నాడు. 2016 జమ్ముకాశ్మీర్‌లో నిర్వహించిన అండర్–19 జాతీయస్థాయి ఫుట్‌బాట్ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి పాల్గొన్నాడు. ఇటీవల కేరళలో జరిగిన సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ పోటీల్లో పలు రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో తన ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్, సిల్వర్మెడల్ గెలుపొందాడు. జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ పేదింటి పిల్లలు జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎదగడం ఎంతో గర్వకారణం. రోజూ వీరి కోసం ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాను. వేసవికాలంలో కూడా 30 మంది విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తూ క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నాం. తమ పాఠశాల నుంచే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు నలుగురు విద్యార్థులు ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు పట్టుదలతో సాధన చేస్తున్నారు. – బొమ్మపాల గిరిబాబు, కబడ్డీ కోచ్, పీఈటీ, బొట్టుగూడ -
ప్రిక్వార్టర్స్‌లో ఆంధ్ర జట్ల ఓటమి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో తెలంగాణ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించగా... ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పురుషుల, మహిళల జట్లు ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్ 31–52తో ఉత్తరాఖండ్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో కర్ణాటక 37–27తో తమిళనాడుపై గెలుపొందింది. మహిళల విభాగంలో కేరళ 31–21తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇతర మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఇండియన్ రైల్వేస్ 37–19తో ఢిల్లీపై, ఉత్తర్‌ప్రదేశ్ 45–12తో ఒడిశాపై, పంజాబ్ 33–19తో బిహార్‌పై, ఛత్తీస్‌గఢ్ 27–23తో కర్ణాటకపై, హరియాణా 31–22తో చండీగఢ్‌పై, హిమాచల్ ప్రదేశ్ 24–21తో తమిళనాడుపై, మహారాష్ట్ర 41–21తో పశ్చిమ బెంగాల్‌పై విజయం సాధించాయి. -
తెలంగాణ జట్ల నిష్క్రమణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల, మహిళల జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించాయి. మహిళల జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచే గెలుపొందగా... రెండింట ఓడింది. పురుషుల జట్టు ఒక్కో గెలుపు, ఓటమిలతో పాటు మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అయితే పాయింట్ల సగటులో వెనుకబడటంతో నాకౌట్‌కు అర్హత సంపాదించలేకపోయింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆంధ్రప్రదేశ్... ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన రసవత్తర పోరులో ఒక్క పాయింట్ తేడాతో గెలుపొందింది. చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 44–43తో విజయాన్ని దక్కించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఉత్తరాఖండ్ 51–23తో పంజాబ్‌పై, రాజస్తాన్ 45–43తో జార్ఖండ్‌పై, హిమాచల్ ప్రదేశ్ 44–18తో బీఎస్ఎన్ఎల్పై, బిహార్ 39–27తో తమిళనాడుపై, ఒడిశా 49–39తో అస్సాంపై, గుజరాత్ 44–37తో పాండిచ్చేరిపై, పంజాబ్ 60–15తో త్రిపురపై, బిహార్ 45–43తో చండీగఢ్‌పై, బీఎస్ఎన్ఎల్ 41–34తో మణిపూర్‌పై, రైల్వేస్ 45–15తో ఆంధ్రప్రదేశ్‌పై, మహారాష్ట్ర 68–20తో గుజరాత్‌పై విజయం సాధించాయి. మహిళల మ్యాచ్‌ల ఫలితాలు: హరియాణా 65–10తో పాండిచ్చేరిపై, ఉత్తరప్రదేశ్ 27–26తో పశ్చిమ బెంగాల్‌పై, కేరళ 17–13తో పంజాబ్‌పై, కర్ణాటక 20–19తో చండీగఢ్‌పై, హిమాచల్‌ప్రదేశ్ 39–21తో ఢిల్లీపై, గుజరాత్ 35–11తో ఉత్తరాఖండ్‌పై, మధ్యప్రదేశ్ 54–27తో జార్ఖండ్‌పై గెలుపొంది ముందంజ వేశాయి. -
తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ తొలిరోజు తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ పోటీల్లో పురుషుల జట్టు గెలుపొందగా, మహిళల జట్టు పరాజయం పాలైంది. పురుషుల విభాగంలో తెలంగాణ 46–19తో చండీగఢ్‌పై ఘనవిజయం సాధించింది. బిహార్‌తో జరిగిన మరో మ్యాచ్‌ను 32–32తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసేసరికి 21–12తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న తెలంగాణ చివరివరకు తమ జోరును కొనసాగించలేకపోయింది. రెండో అర్ధభాగంలో పుంజుకున్న బిహార్ అద్భుతంగా పోరాడి పరాజయం నుంచి తప్పించుకుంది. మహిళల విభాగంలో తెలంగాణ 16–21తో పశ్చిమ బెంగాల్ చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో కర్ణాటక 75–9తో విదర్భపై, కేరళ 49–35తో ఒడిశాపై, గుజరాత్ 48–26తో జమ్మూ కశ్మీర్‌పై, ఏపీ 50–18తో పశ్చిమ బెంగాల్‌పై, ఢిల్లీ 55–32తో జార్ఖండ్‌పై, ఉత్తర్‌ప్రదేశ్ 48–17తో బీఎస్ఎన్ఎల్పై, రాజస్తాన్ 42–38 తో ఢిల్లీపై, మధ్యప్రదేశ్ 56–17తో త్రిపురపై, ఉత్తర్‌ప్రదేశ్ 38–17తో మణిపూర్‌పై, హరియాణా 42–22తో కేరళపై విజయం సాధించాయి. మహిళల మ్యాచ్‌ల వివరాలు తమిళనాడు 45–28తో మణిపూర్‌పై, ఛత్తీస్‌గఢ్ 61–12తో పాండిచ్చేరిపై, బిహార్ 53–17తో జమ్మూ కశ్మీర్‌పై, కేరళ 31–19తో మధ్యప్రదేశ్‌పై, కర్ణాటక 42–18తో విదర్భపై, మహారాష్ట్ర 77–19తో గుజరాత్‌పై, ఉత్తర్‌ప్రదేశ్ 57–17తో అస్సాంపై, పంజాబ్ 64–34తో జార్ఖండ్‌పై, హిమాచల్ ప్రదేశ్ 38–32తో రాజస్తాన్‌పై, బిహార్ 31–15తో ఏపీపై నెగ్గాయి.. -
రేపటి నుంచి జాతీయ కబడ్డీ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ రేపటి నుంచి ఆరు రోజుల పాటు నగర అభిమానులను అలరించనుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఈ పోటీలు జరుగనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. శుక్రవారం ఒలింపిక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కబడ్డీ టోర్నీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన తమ్ముడు కాసాని కృష్ణ ముదిరాజ్ స్మారకార్థం ఏర్పాటు చేసిన కబడ్డీ అకాడమీని నేడు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర జట్ల వివరాలు పురుషులు: ఎం. మహేందర్ రెడ్డి (కెప్టెన్), జి. మల్లేశ్, జి. జీవా, ఎస్. భాస్కర్, సామ నిరీక్షణ్ రెడ్డి, ఎస్కే అమీర్, కె. శివయ్య, ప్రదీప్, ఎస్. కిషోర్, మునీశ్ కుమార్, కె. రవీంద్ర రమేశ్, భరత్ జాదవ్, ఎ. గౌరీ శంకర్, లక్ష్మీనారాయణ, కె. జగ్మోహన్ (చీఫ్ కోచ్), ఎస్. వెంకటేశ్ (కోచ్), ఎ. గౌరీ శంకర్ (మేనేజర్) మహిళలు: కె. మహేశ్వరి (కెప్టెన్), ఆర్. అఖిల, షేక్ నౌషీన్, కె. ప్రియాంక, మొహమ్మద్ సనా, బి. ప్రవళిక, వి. మౌనిక, ఆర్. కవిత, కె. మౌనిక, పి. సౌందర్య, టి. కావేరి, జి. ఆదిలక్ష్మి, ఎం. రేణుక, రత్నకుమారి, ఎన్. సుధాకర్ రావు (కోచ్), పి. సతీశ్ కుమార్ (మేనేజర్). -
31నుంచి జాతీయ కబడ్డీ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 31నుంచి జనవరి 5వ తేదీ వరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టోర్నీకి సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి టోర్నమెంట్ ట్రోఫీలను ఆవిష్కరించారు. పురుషుల, మహిళల విభాగంలో జరిగే ఈ పోటీలకు 1500మంది క్రీడాకారులు హాజరవుతారని నిర్వాహకులు చెప్పారు. 29 రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ, ప్రొ కబడ్డీ లీగ్ క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్లో తలపడతారని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. తన తమ్ముడు కాసాని కృష్ణ ముదిరాజ్ స్మారకార్థం బాచుపల్లిలో ఏర్పాటు చేసిన కబడ్డీ అకాడమీని శనివారం ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. సర్వీసెస్, రైల్వేస్, బీఎస్ఎన్ఎల్ జట్లు కూడా ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఆరు రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింథటిక్ కబడ్డీ మ్యాట్లపై లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తారు. బుధవారం నుంచి నాకౌట్ పోటీలు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఆదివారం జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించనున్నారు. -
టైటిల్ పోరుకు హైదరాబాద్ జట్లు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ అంతర్ జిల్లా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాయి. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన మహిళల సెమీఫైనల్ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 34–28తో నల్లగొండపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 15–13తో ఆధిక్యంలో ఉన్న హైదరాబాద్ చివరివరకు దాన్ని కాపాడుకుంది. రెండో సెమీస్‌లో వరంగల్ 38–19తో రంగారెడ్డి జట్టును చిత్తుగా ఓడించింది. పురుషుల సెమీస్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 24–22తో ఖమ్మంపై గెలుపొందగా, నల్లగొండ 36–32తో రంగారెడ్డిని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. -
హైదరాబాద్ జట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ కబడ్డీ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్లు శుభారంభం చేశాయి. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు కనబరిచాయి. మహిళల విభాగంలో హైదరాబాద్ 53–33తో ఆదిలాబాద్‌పై ఘనవిజయం సాధించింది. పురుషుల విభాగంలోని తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 69–48తో నిజామాబాద్‌పై, రెండో మ్యాచ్‌లో 37–20తో మెదక్‌పై గెలుపొందింది. ఇతర పురుషుల మ్యాచ్‌ల్లో మెదక్ 51–44తో మహబూబ్‌నగర్‌పై, వరంగల్ 60–20తో ఆదిలాబాద్‌పై, ఖమ్మం 37–19తో కరీంనగర్‌పై, నల్లగొండ 56–28తో మెదక్‌పై, రంగారెడ్డి 46–31తో వరంగల్‌పై, మహబూబ్‌నగర్ 54–27తో నిజామాబాద్‌పై, కరీంనగర్ 61–17తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి. -
7 నుంచి అంతర్ జిల్లా కబడ్డీ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ ఈనెల 7 నుంచి జరుగనుంది. నవశక్తి క్రీడా మండల్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా ఈ టోర్నీని నిర్వహిస్తారు. ఈ మేరకు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలను వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 10 పురుషుల, 10 మహిళల జట్లు పాల్గొననున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో 3 రోజుల పాటు మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌ల కోసం తొలిసారిగా సింథటిక్ మ్యాట్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. గురువారం జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, మాజీ రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్ పురుషుల జట్టు, రంగారెడ్డి మహిళల జట్లు డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో రాష్ట్ర మహిళల, పురుషుల జట్లను ఎంపికచేస్తామని నిర్వాహకులు చెప్పారు. రాష్ట్ర జట్లు ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు గచ్చిబౌలిలో జరిగే జాతీయ కబడ్డీ టోర్నీలో పాల్గొంటాయి. -
కబడ్డీలో బాలుర మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
-
బాలుడి ప్రాణం తీసిన కబడ్డీ
రంగారెడ్డి, శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : సరదాగా కబడ్డీ ఆడుతుండగా ఇద్దరు బాలుర మధ్య చెలరేగిన వివాదం ఓ బాలుడి మృతికి దారితీసింది. శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన మీసాల నర్సింహ, జయమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు శిరీష పాలెంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి, రెండో కూతురు స్వాతిముత్యం గౌలిదొడ్డి సమీపంలోని నవోదయ పాఠశాలలో 9వ తరగతి, కొడుకు మల్లేష్(12) పాల్మాకులలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. వీరి ఇంటి పక్కన ఉండే ఓ బాలుడు శంషాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఉండడంతో తోటి బాలురతో పాటు మల్లేష్, మరో విద్యార్థి స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కబడ్డీ ఆడుతున్న క్రమంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో అతడు మల్లేష్‌ను కొట్టాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన మల్లేష్‌ను సదరు బాలుడు అక్కడికి వెళ్లి మరోసారి చేతితో కొట్టాడు. స్పృహ తప్పి కింద పడిపోవడంతో మల్లేష్‌ను కుటుంబ సభ్యులు శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మల్లేష్ చనిపోయినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అహ్మద్‌పాషా తెలిపారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవని, మెడ కింద చేతి గోరు గీసుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గ్రామంలో విషాదం.. కాలక్షేపం కోసం ఆడిన ఆట ప్రాణం మీదకు తేవడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చదువులో చురుకుగా ఉండే మల్లేష్ మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
కబడ్డీ విజేతలు నాంపల్లి, సికింద్రాబాద్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌డీఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి, ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో సికింద్రాబాద్, నాంపల్లి మండల్ జట్లు ఆకట్టుకున్నాయి. దోమల్‌గూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలలో జరిగిన కబడ్డీ, వాలీబాల్ ఈవెంట్లలో విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (హెచ్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన అండర్–14 బాలుర కబడ్డీ ఫైనల్లో సికింద్రాబాద్ 22–8తో హిమాయత్ నగర్‌పై, వాలీబాల్ ఈవెంట్లో సికింద్రాబాద్ 25–2, 25–15తో హిమాయత్ నగర్‌పైనే గెలుపొంది రెండు టైటిళ్లను సాధించింది. అండర్–17 బాలికల కబడ్డీ ఫైనల్లో నాంపల్లి మండల్ జట్టు 26–14తో సికింద్రాబాద్ జట్టుపై గెలుపొందగా, వాలీబాల్ ఈవెంట్లో నాంపల్లి 25–13, 25–16తో సికింద్రాబాద్‌ను ఓడించి విజేతలుగా నిలిచాయి. అండర్–14 బాలికల కబడ్డీ ఫైనల్లో ముషీరాబాద్ 2–0తో గోల్కొండపై గెలుపొందింది. సెయింట్ ఫ్రాన్సిస్‌కు రెండు టైటిళ్లు సాఫ్ట్‌బాల్ ఈవెంట్లో సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ బాలికల జట్లు సత్తా చాటాయి. అండర్–14, 17 విభాగాల్లో చాంపియన్లుగా నిలిచాయి. అండర్–17 బాలికల ఫైనల్లో సెయింట్ ఫ్రాన్సిస్ 3–2తో ఆర్ఎంహెచ్ఎస్పై విజయం సాధించింది. అండర్–14 బాలికల టైటిల్ పోరులో సెయింట్ ఫ్రాన్సిస్ జట్టు 5–4తో ఆర్ఎంహెచ్ఎస్ను ఓడించింది. మరోవైపు అండర్–17 బాలుర ఫైనల్లో ఆర్ఎం హెచ్ఎస్ 3–2తో ఇంటర్నేషనల్ స్కూల్‌పై నెగ్గింది. అండర్–14 బాలుర ఫైనల్లో ఇంటర్నేషనల్ స్కూల్ 5–3తో ఆర్ఎంహెచ్ఎస్ను ఓడించి టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. -
ఆటలో ఆగిన ప్రాణం..
అప్పటిదాకా సరదా, సంతోషం..అంతలోనే విషాదం, దుఃఖం..కబడ్డీ కూతకు వెళ్లొచ్చి కుప్పకూలాడు..మరో లోకానికి మల్లికార్జున్ వెళ్లిపోయాడు. రఘునాథపాలెం(ఖమ్మం): ► రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడు గ్రామం. అక్కడి యువకులంతా కలిసి స్థానిక ఆర్ అండ్ బీ రోడ్డు పక్కన వినాయక మండపం ఏర్పాటు చేశారు. పూజల అనంతరం, అక్కడ ప్రతి రోజూ ఆటపాటలు నిర్వహిస్తున్నారు. సరదా సరదాగా, సందడి సందడిగా సాగుతోంది. ►మండపం వద్ద బుధవారం రాత్రి పూజలు పూర్తయ్యాయి. విద్యుత్ వెలుగుల్లో యువకులంతా కబడ్డీ ఆడుతున్నారు. దాదాపుగా ఊరి జనమంతా ఆసక్తిగా, ఆనందంగా చూస్తున్నారు. అప్పటికే నాలుగు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ► తర్వాతి జట్టు రంగంలోకి దిగింది. అందులో మల్లికార్జున్(24) ఉన్నాడు. ఆట రసవత్తరంగా సాగుతోంది. మల్లికార్జున్ కూతకు వెళ్లాడు.. వచ్చాడు. ఎదుటి జట్టులోని ఓ యువకుడు కూతకు వస్తున్నాడు. అంతలోనే మల్లిఖార్జున్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ► అక్కడి ఆటగాళ్లందరిలో, చూస్తున్న జనంలో అయోమయం, ఆందోళన. సమీపంలోగల ఏఎన్ఎం వచ్చి చూశారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అందరూ కలిసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షిస్తుండగానే ప్రాణాలొదిలాడు. ► మల్లికార్జున్ బీటెక్ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా కొన్ని కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. అతడికి తల్లిదండ్రులు, అన్న, సోదరి ఉన్నారు. సోదరికి వివాహమైంది. చెన్నైలో అన్న ఉద్యోగం చేస్తున్నాడు. ►‘‘నాలుగైదు నెలల్లో ఉద్యోగంలో చేరతాడని, జీవితంలో స్థిరపడతాడని, మాకు అండగా ఉంటాడని ఆశపడ్డాం. దేవుడికి పూజ చేశాడు. దేవుడి మండపం వద్ద ఆడాడు. చివరికి, ఆ దేవుడి వద్దకే వెళ్లాడు’’ అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. మిత్రులు, గ్రామస్తులు కూడా కంటతడి పెట్టారు. ►తండ్రి నాగులు ఫిర్యాదుతో ఎస్ఐ గోపి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
కబడ్డీ ఆడుతూ..
రఘునాథపాలెం: ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతూ యువకుడు మృతిచెందిన సంఘటన జిల్లాలోని రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో బుధవారం అర్ధరాత్రి దాటాక వెలుగుచూసింది. గ్రామంలో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలో పాల్గొన్న మల్లికార్జున్(24) అనే యువకుడు కోర్టులోనే కుప్పకూలి మృతి చెందాడు. ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తిచేసిన మల్లికార్జున్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజధానిలో.. దంగల్
మన మల్లయోధులకు హరియాణా నిపుణుల శిక్షణ - ఆ రాష్ట్ర యువతకు కబడ్డీలో తెలంగాణ శిక్షణ - ఘుమర్, లంబాడా నృత్యాల్లో పరస్పర తర్ఫీదు - ఇరు రాష్ట్రాల సంయుక్త ‘పురావస్తు’ తవ్వకాలు - ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’ పథకంలో భాగం సాక్షి, హైదరాబాద్: దంగల్ (కుస్తీ). హరియాణా మల్లయోధుడు మహవీర్‌సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా రూపొంది రికార్డులు నెలకొల్పిన హిందీ సినిమా. ఇప్పుడీ క్రీడ హరియాణా, తెలంగాణ మధ్య వారధి కాబోతోంది. మల్లయోధుల శిక్షణకు హరియాణా మారుపేరు కాగా, కుస్తీకి హైదరాబాద్‌లోనూ అనాదిగా ప్రత్యేక స్థానముంది. ఈ నేపథ్యంలో మన వర్ధమాన రెజ్లర్లకు హరియాణా నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం నగరంలో ప్రత్యేక అఖాడా (రెజ్లింగ్ శిక్షణ కేంద్రం)లు ఏర్పాటు కాబోతున్నాయి. రాష్ట్రాల మధ్య బంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం రూపొందించిన ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ పథకంలో భాగంగా ఈ కార్యక్రమంరూపుదిద్దుకుంది. హైదరాబాద్‌లోని మెరుగైన అఖాడాలను, ప్రతిభావంతులైన యువతను ఎంపిక చేసేందుకు ముగ్గురు కోచ్‌లతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. వారికి హరియాణా నిపుణులు త్వరలో శిక్షణ మొదలు పెడతారు. అలాగే కబడ్డీ, ఖోఖోల్లో హరియాణా క్రీడాకారులకు తెలంగాణ నిపుణులు తర్ఫీదునిస్తారు. ఈ క్రీడల్లో రెండు రాష్ట్రాల మధ్య పోటీలు కూడా నిర్వహిస్తారని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ దినకర్‌బాబు తెలిపారు. ఇది రాష్ట్రాల మధ్య బంధాన్ని పెంచటంతో పాటు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిపెట్టగలదని ఆశాభావం వెలిబుచ్చారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ పథకం అమలులో తెలంగాణ–హరియాణా జోడీ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. పథకం అమలులో పురోగతిని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆయా విభాగాల అధికారులు గురువారం సచివాలయంలో మీడియాకు వివరించారు. వారి ఘుమర్..మన లంబాడా నృత్యాలు.. సాంస్కృతిక అనుబంధాన్ని పెంచుకోవడంలో భాగంగా హరియాణా కళాకారులు ఇటీవల నగరానికి వచ్చి 15 మంది యువతులకు అక్కడి ప్రసిద్ధ ఘుమర్ నృత్యాన్ని నేర్పారు. తెలంగాణ సంప్రదాయ లంబాడా నృత్యాన్ని స్థానిక కళాకారుల నుంచి నేర్చుకున్నారు. ఇటీవల హరియాణాలో తీజ్ పండుగ సందర్భంగా అక్కడి రాజ్‌భవన్‌లో తెలంగాణ కళాకారులు ఘుమర్, హరియాణా కళాకారులు లంబాడా నృత్యాలతో స్థానికులను అలరించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రదినోత్సవం నాడు రవీంద్రభారతిలో హరియాణా కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వెంకటేశం తెలిపారు. త్వరలో హరియాణాలో తెలంగాణ సంబురాలు, హైదరాబాద్‌లో హరియాణా దివస్ నిర్వహిస్తామని వెల్లడించారు. హరప్పా నాగరికత విలసిల్లిన ప్రాంతాల్లో ఒకటైన హరియాణాలోని కునాల్లో పురావస్తు తవ్వకాల్లో తెలంగాణ సిబ్బంది పాలుపంచుకోనున్నారు. తెలంగాణలో శాతవాహనుల జాడలున్న కర్ణమామిడి, బౌద్ధజాడలున్న పెద్దబంకూరుల్లో తవ్వకాల్లో హరియాణా నిపుణులు పాల్గొంటారని పురావస్తు సంచాలకురాలు విశాలాచ్చి తెలిపారు. 100 తెలుగు పదాలు, తెలుగు వాక్యాలు, 100 తెలుగు జాతీయాలు, ప్రముఖ తెలుగు కవుల మూడు రచనలను హిందీలోకి అనువదించి హరియాణాకు అందజేస్తారు. అలాగే వారి పుస్తకాలనూ తెలుగులోకి అనువదిస్తారని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. -
పాఠశాల విద్యా ప్రణాళికలో క్రీడలు
► కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు న్యూఢిల్లీ: దేశ సంప్రదాయ క్రీడలు కబడ్డీ, ఖోఖోలను ఒలింపిక్స్‌లో చేర్చే విధంగా ప్రధాని నరేంద్రమోది కృషి చేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. డీడీ స్పోర్ట్స్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైన క్రీడలను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. రు. క్రీడల ప్రాముఖ్యత గురించి ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించారన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా క్రీడలు విద్యార్థులను చైతన్యపరుస్తాయని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఆరోగ్యంగా, మానసికంగా ధృడంగా చేస్తాయని, న్యాయకత్వలక్షణాలు అలువరుస్తాయని తెలిపారు. క్రీడాకారుల జీవితాలపై సినిమాలు రావడం మంచి పరిణామమని, ఇవి క్రీడలను ఎంచుకునేలా యువతకు స్పూర్తిని కల్గిస్తాయని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇక వారణాసీ స్మార్ట్ సిటీ అవుతుందని ప్రజల సహకారంతో మార్పు సాధ్యమన్నారు. వారణాసీ స్మార్ట్ సిటీ అయ్యేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుందిని తెలిపారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీలో రన్నరప్ ‘తూర్పు’
-విజేత ప్రకాశం జిల్లాజట్టు సఖినేటిపల్లి : స్థానిక కుసుమ చిన సుందరరావు క్రీడా ప్రాంగణంలో 17వ వార్షిక కాంతారావు మెమోరియల్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో భాగంగా బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశం జిల్లా జట్టు విజేతగా, తూర్పుగోదావరి జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఈ నెల ఒకటిన మొదలయిన టోర్నీలో ప్రకాశం, తూర్పుగోదావరి జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. విజేత ప్రకాశం జట్టుకు ప్రథమ బహుమతి కింద రూ.35 వేల నగదు, షీల్డ్‌ను, రన్నరప్ తూర్పు గోదావరి జట్టుకు ద్వితీయ బహుమతి కింద రూ.25 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. తృతీయ బహుమతి కింద గుంటూరు జట్టుకు రూ.20 వేల నగదు, షీల్డ్‌ను, చతుర్థ బహుమతి కింద విశాఖపట్నం జట్టుకు రూ.10 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రిటైర్డ్ ఎస్పీ వి.ప్రేమ్‌కుమార్, స్పాన్సర్స్ గొల్లమందల శరత్‌బాబు, ఇందుకూరి సుబ్బరాజు, నల్లి నాగేశ్వరరావు, ఇంజేటి సుధాకర్, రాష్ట్ర ఫెన్సింగ్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎం.అక్కిరాజు విజేతలకు బహుమతులను అందజేశారు. సఖినేటిపల్లి మాజీ సర్పంచ్ జంపన రామకృష్ణంరాజు, టీచర్ నల్లి విశ్వనాథం షీల్డ్‌లను అందజేశారు. నాయకులు గెడ్డం తులసీభాస్కర్, గెడ్డం పేర్రాజు, అల్లూరు మధురాజు, చింతా రాజబాబు, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ తోటె ప్రతాప్‌కుమార్, అధ్యక్షుడు గొల్లమందల చిట్టిబాబు, కార్యదర్శి నల్లి బన్ను పాల్గొన్నారు. -
‘కూత’కు మరో నాలుగు జట్లు
డజను జట్లతో అతిపెద్ద లీగ్‌గా ప్రొ కబడ్డీ జూలైలో ఐదో సీజన్ షురూ ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో కొత్తగా మరో నాలుగు జట్లు కూత పెట్టేందుకు సిద్ధమయ్యాయి. దీంతో మొత్తం 12 జట్లతో భారత్‌లో అతి పెద్ద లీగ్‌గా ప్రొ కబడ్డీ ఆవిర్భవించనుంది. కొత్తగా తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హరి యాణా జట్లు పీకేఎల్‌లో భాగం కానున్నాయి. సీజన్ సీజన్‌కు పెరుగుతున్న ఆదరణను ఇతర రాష్ట్రాలకూ వ్యాపింపచేయాలనే ఉద్దేశంతో నిర్వాహకులు కొత్తగా నాలుగు రాష్ట్ర జట్లకు అవకాశమివ్వాలని నిర్ణయించారు. గత నాలుగు సీజన్లలో ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లు అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెరిగిన జట్లతో పాటు మ్యాచ్‌లు కూడా పెరుగుతాయి. మొత్తం 130కి పైగా మ్యాచ్‌లు, 13వారాలపాటు ప్రేక్షకుల్ని అలరించనున్నాయని పీకేఎల్ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుత సీజన్లో మొత్తం 11 రాష్ట్రాలు భాగమవుతున్నాయని అందులో పేర్కొన్నారు. ‘ఇప్పటికే స్టేక్ హోల్డర్లంతా లీగ్ విస్తరణకు ఆమోదం తెలిపారు. దీంతో మరింత ప్రాచుర్యంతో పాటు లీగ్ స్థాయి కూడా పెరుగుతుందని వారంతా భావిస్తున్నారు’ అని పీకేఎల్ బ్రాడ్కాస్ట్ భాగస్వామి ‘స్టార్ ఇండియా’ చైర్మన్, సీఈఓ ఉదయ్ శంకర్ చెప్పారు. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గెహ్లాట్ మాట్లాడుతూ ‘కృషి ఉంటే ఓ సంప్రదాయ క్రీడను ఆధునిక క్రీడగా ఎలా మార్చవచ్చో, ఎంతగా ప్రాచుర్యంలోకి తీసుకురావొచ్చో అనేందుకు నిజమైన ఉదాహరణ ఈ ప్రొ కబడ్డీ లీగ్’ అని అన్నారు. -
అంగన్వాడీ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం
కొత్తపేట : అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి ఎనిమిదో తేదీ) పురస్కరించుకుని స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆదేశాల మేరకు గత నెల 18న ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయిలో, 21న జిల్లా స్థాయిలో కాకినాడలో కబడ్డీ పోటీలు నిర్వహించగా కొత్తపేట ప్రాజెక్టు జట్టు జిల్లా స్థాయిలో ప్రథమస్థానం సాధించింది. జిల్లా పోటీల్లో బాగా ఆడిన ఆర్ రత్నకుమారి, బీఎస్ఎన్ కుమారి(కొత్తపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు), శాంతి, ప్రసన్న, సుజాత, వీరమణి, తులసి, త్రివేణి(తుని ప్రాజెక్టు), గంగాదేవి (పెద్దాపుర ప్రాజెక్టు)లను రాష్ట్ర పోటీలకు జిల్లా జట్టుగా కూర్చారు. ఈ జట్టు మంగళవారం రాష్ట్రస్థాయిలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోటీల్లో క్వార్టర్స్‌లో పశ్చిమ గోదావరి జట్టుపై, సెమీ ఫైనల్స్‌లో చిత్తూరు జట్లపై గెలిచి, ఫైనల్స్‌లో కృష్ణా జిల్లా జట్టుపై ఘన విజయం సాధించినట్టు కొత్తపేట ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎ రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ జట్టును స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆర్జేడీ విద్యావతి, తుని, కొత్తపేట సీడీపీఓలు వి మాధవి, బి అనంతలక్ష్మి తదితరులు అభినందించారు. ఆ టీమ్ సభ్యులకు వచ్చే నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందచేస్తారని రాజ్యలక్ష్మి తెలిపారు. -
రాష్ట్రస్థాయిలో పేరొందిన సీఆర్సీ క్రీడా పోటీలు
ప్రజాప్రతినిధుల కితాబు కబడ్డీ పోటీలు ప్రారంభం రావులపాలెం(కొత్తపేట): సంక్రాంతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రావులపాలెంలో ఏటా సీఆర్సీ నిర్వహిస్తున్న క్రీడా పోటీలు రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి పొందాయని కొత్తపేట, రాజోలు ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఆర్సీ సంక్రాంతి సంబరాలు–2017 పేరుతో రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, సూర్యారావు, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి ఓపె¯ŒS ఆడిటోరియంలో జరిగిన ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతికే కాక ఎన్నో క్రీడా పోటీలు నిర్వహిస్తూ క్రీడాభివృద్ధికి సీఆర్సీ అందిస్తున్న చేయూత ప్రశంసనీయం అన్నారు. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్రీడలతో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ సంక్రాంతి క్రీడల్లో కోనసీమకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కబడ్డీ కోర్టులను ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, సూర్యారావు, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంలు ప్రారంభించారు. పురుషుల విభాగంలో చిత్తూరు, ప్రకాశం జట్ల మధ్య, మహిళల విభాగంలో తూర్పుగోదావరి, గుంటూరు జట్ల మధ్య మ్యాచులతో పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలు తిలకించేందుకు రావులపాలెం పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, ఏఎంసీ చైర్మ¯ŒS బండారు వెంకటసత్తిబాబు, వైస్ ఎంపీపీ దండు వెంకట సుబ్రహ్మణ్యవర్మ, ఎంపీటీసీలు కొండేపూడి రామకృష్ణ, కుడుపూడి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నా గిరెడ్డి, సీఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి ఆశోక్‌రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, చెక్కల సూరి బా బు, నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి, నల్లమిల్లి వీ రరాఘవరెడ్డి, కర్రి సుబ్బారెడ్డి, కొవ్వూ రి నరేష్కుమార్, సెక్రటరీ వి.వీరలంకయ్య పాల్గొన్నారు. -
నార్త్‌జోన్ కబడ్డీ పోటీల విజేత పూడిమడక జట్టు
కాకినాడ క్రై ం : కోస్టల్ సెక్యూరిటీస్ పోలీస్ నార్త్ జోన్ కబడ్డీ పోటీల్లో విశాఖ జిల్లా పూడిమడక జట్టు విజేతగా నిలిచింది. రాష్ట్ర స్థాయి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ మీట్–2లో భాగంగా జిల్లా క్రీడా మైదానంలో కబడ్డీ పోటీలను కోస్టల్ సెక్యూరిటీస్ పోలీస్ నార్త్ జోన్ డీఎస్పీ ఎం.రాజారావు బుధవారం ప్రారంభించారు. తొలుత ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసంతో పాటూ శారీరక దృఢత్వాన్ని కలుగజేస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఇప్పటి వరకూ షెటిల్, సైక్లింగ్, వాలీబాల్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీల్లో విశాఖ జిల్లా పూడిమడక జట్టు విన్నర్ కాగా, శ్రీకాకుళం జిల్లా బారువా జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు డీఎస్పీ రాజారావు మెమెంటోలు బహూకరించారు. ఈ రెండు జట్లు ఈ నెలలో విశాఖలో జరిగే సెమీఫైనల్లో సౌత్ జోన్ విన్నర్, రన్నర్ జట్లతో తలపడతాయన్నారు. ఈ పోటీల్లో నార్త్‌జోన్ డివిజన్‌కు చెందిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 11 మెరైన్ పోలీస్స్టేషన్లకు చెందిన 10 జట్లు పాల్గొన్నాయి. పోటీలకు రిఫరీలుగా కాకినాడ సిటీకి చెందిన ఆరుగురు పీఈటీలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, ఓడలరేవు మెరైన్ సీఐలు బి.రాజారావు, శ్రీనివాస్‌లతో పాటు నాలుగు జిల్లాల నుంచి సుమారు 150 మంది మెరైన్ పోలీస్‌లు పాల్గొన్నారు. -
ఉత్సాహ‘బరి’తం!
పెద్దాపురం : ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అంతర్ కళాశాలల కబడ్డీ మీట్ – 2016 పోటీలు సోమవారం పెద్దాపురం మహారాణి కళాశాలలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ మీట్‌ను కాకినాడ ఎంపీ తోట నరసింహం ప్రారంభించారు. సుమారు 26 కళాశాలలకు చెందిన 26 టీములు పాల్గొన్నాయి. మహారాణి కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన క్రీడా ప్రారంభ సభలో ఎంపీ నరసింహం మాట్లాడుతూ క్రీడారంగంలో రాణిస్తే మంచి భవిష్యత్ సాధ్యపడుతుందన్నారు. మున్సిపల్ చైర్మ¯ŒS రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం కబడ్డీ పోటీలను ఎంపీ తోట నరసింహం ఆటలు ఆడి పోటీలు ప్రారంభించారు. తొలుత ఆయా కళాశాలల విద్యార్థులు కవాతు నిర్వహించగా ఎంపీ గౌరవ వందనం స్వీకరించారు. నన్నయ్య యూనవర్సిటీ పీడీ ఎ.సత్యనారాయణ, ఏఎంసీ చైర్మ¯ŒS ముత్యాల రాజబ్బాయి, ఎంపీపీ గుడాల రమేష్, కళాశాల కరస్పాండెంట్ తాళ్లూరి వీరభద్రరావు, చందలాడ అనంతపద్మనాభం, పీఈటీ వీరయ్యచౌదరి, చదలవాడ బాబి, దోమల గంగాధర్, తుమ్మల రాజా, కౌన్సిలర్లు విజ్జపు రాజశేఖర్, ఆయా కళాశాలల పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
బాలికల కబడ్డీ జట్టుకు శిక్షణ శిబిరం
మంత్రిపాలెం(నగరం) : క్రీడాకారులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు పద్మారావు చెప్పారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖేలో ఇండియా జిల్లా బాలికల కబడ్డీ జట్టుకు శిక్షణ శిబిరాన్ని శుక్రవారం పద్మారావు ప్రారంభించి మాట్లాడారు. ఖేలో ఇండియా క్రీడలలో భాగంగా కబడ్డీలో అండర్–14.17 విభాగాలలో ఎంపికైన బాలికల కబడ్డీ జట్టుకు తమ పాఠశాలలో శిక్షణ శిబిరం ఏర్పాటుచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మూడు రోజుల పాటు శిక్షణ శిబిరం కొనసాగుతుందన్నారు. పీఈటీలు జీ సుధీర్‌కుమార్, జీ కుటుంబరావు, కె సత్యనారయణ, సుబ్బారావులు కబడ్డీ జట్టుకు శిక్షణనిచ్చారు. -
14 నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం : నరసాపురంలోని రుస్తుంబాద గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి మహిళల, పురుషుల కబడ్డీ ఇన్విటేషన్ కప్ పోటీలు వచ్చే జనవరి 14 నుంచి 18 వరకూ ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్టు పోటీల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. శనివారం గోగులమ్మ ఆలయం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీలకు రుస్తుంబాదలోని స్టేడియంను సిద్ధం చేయనున్నట్టు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 20 పురుషుల జట్లు 20, 15 మహిళల జట్లు పోటీలకు హాజరవుతాయన్నారు. పురుషుల విభాగంలో మొదటి బహుమతి రూ. లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు, మూడో బహుమతిగా రూ.50 వేలు, నాలుగో బహుమతిగా రూ.25 వేలు అందిస్తామన్నారు. గెలుపొందిన మహిళా జట్లకు కూడా ప్రైజ్‌మనీ ఉంటుందన్నారు. మొత్తం రూ. 5 లక్షలు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆలిండియా కబడ్డీ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి వి.వీర్లెంకయ్య, జిల్లా కార్యదర్శి కె.రంగారావు మాట్లాడుతూ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలకు పరిశీలకులను మరికొద్ది రోజుల్లో ఆలిండియా కబడ్డీ అసోసియేష¯ŒS నియమిస్తుందని చెప్పారు. సమావేశంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొత్తపల్లి నాని, కొప్పనీడి శివాజీ, చినిమిల్లి మమ్ము, యాదంరెడ్డి మహేష్ పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
గురజాల రూరల్: గురజాల శ్రీముక్కంటేశ్వర దేవాలయ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో జె.ఎం.ఎం.ఎం ఫ్రెడ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వంటూరి వెంకటప్పారెడ్డి, టీడీపీ నాయకులు సఖిల బాలకోటిరెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మొత్తం 32 జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. పీఈటీలు బి.బాలాజి నాయక్, జి.కోటేశ్వరావు, కె.కోటిబాబు పర్యవేక్షణలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన వారికి ఎనుముల మురళీధర్‌రెడ్డి ప్రథమ బహుమతి రూ.12,000 లు, ద్వితీయబహుమతిని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వంటూరి వెంకటప్పారెడ్డి రూ.7,000, తృతీయ బహుమతిని శ్రీకాంత్ నర్సింగ్ హోం రూ. 5,000, నాల్గవ బహుమతిని సాంబశివ నర్సింగ్ హోం రూ. 3,000 అందిస్తున్నట్లు తెలిపారు. షీల్డులను యూటీఎఫ్ నాయకుడు టి.అరుణ్ కుమార్ అందిస్తారన్నారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మువ్వా మల్లికార్జునరావు, మంచి కాటంరాజు, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఏఎన్‌యూ మహిళా కబడ్డీ శిక్షణ
గుంటూరు రూరల్ ః తాడికొండ మండలంలోని లాం గ్రామంలోగల చలపతి ఫార్మసీ కళాశాలలో 15 రోజులుగా జరుగుతున్న ఏఎన్‌యూ అంతర్ కళాశాలల్లో ఎంపికయిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీకి వెళ్ళే మహిళా కబడ్డీ క్రీడాకారుల శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాదెండ్ల రామారావు మాట్లాడుతూ 15 రోజులపాటు శిక్షణ తీసుకున్న అభ్యర్థినులు తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల భారతీయ యూనివర్సిటీలో ఈ నెల 14 నుంచి 17వరకూ జరిగే అంతర్ యూనివర్సిటీల (సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ) పోటీల్లో పాల్గొంటారన్నారు. కళాశాల పిజికల్ డైరెక్టర్ పీ భానుప్రకాష్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
ప్రారంభ మ్యాచ్‌గా ఆంధ్ర, బెస్ట్ ఆఫ్ ఆంధ్ర మహిళా జట్లు తుని రూరల్ : వైఆర్కే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఇన్విటేష¯ŒS కబడ్డీ పోటీలను టి.తిమ్మాపురంలో జిల్లా పరిషత్ చైర్మ¯ŒS నామన రాంబాబు ప్రారంభించారు. ఆదివారం రాత్రి అసోసియేష¯ŒS అధ్యక్షుడు పోల్నాటి శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మ¯ŒS వరుపుల రాజా, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మార్కెట్ కమిటీ చైర్మ¯ŒS యనమల కృష్ణుడు, ఏపీ కబడ్డీ అసోసియేష¯ŒS కార్యదర్శి వి.వీరలంకయ్య క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్ర మహిళా జట్టు, బెస్ట్ ఆఫ్ ఆంధ్ర మహిళా జట్లు మధ్య ఎగ్జిబిష¯ŒS మ్యాచ్‌తో పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుసాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల జట్లు పాల్గొంటున్నట్టు జిల్లా అసోసియేష¯ŒS అధ్యక్షుడు టీవీవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. -
కబడ్డీ విజేత శ్రీసత్యసాయి
గుంతకల్లు టౌన్: జిల్లా జూనియర్ కాలేజీల అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో పలు క్రీడాపోటీల ఫైనల్ మ్యాచ్‌లు సోమవారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ (గుంతకల్లు) జట్టుపై శ్రీ సత్యసాయి(అనంతపురం) జట్టు విజయం సాధించింది. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారులు కలిగిన సత్యసాయి జట్టు ప్రత్యర్థి జట్టుపై (31–3 పాయింట్లతో) చిత్తు చేసింది. విజేతల వివరాలు: ► వాలీబాల్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీ సత్యసాయి (అనంతపురం), ఎల్‌ఆర్‌జీ (హిందూపురం) జట్లు తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్‌లో చివరకు ఎల్‌ఆర్‌జీ జట్టు విజయ దుందుభి మోగించింది. ► టెన్నికాయిట్ ఫైనల్ మ్యాచ్‌లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ (ఉరవకొండ) జట్టుపై ప్రభుత్వ జూనియర్ కాలేజీ (గుంతకల్లు) జట్టు విజయం సాధించింది. ► ఖోఖో ఫైనల్ మ్యాచ్‌లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ (ఉరవకొండ) జట్టుపై ప్రభుత్వ జూనియర్ కాలేజీ గర్లŠస్ (ఉరవకొండ) జట్టు గెలుపొందింది. ► త్రోబాల్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ (కదిరి)పై కేఎస్ఆర్ (అనంతపురం) జట్టు విజయం సాధించింది. ► చదరంగం ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌ఎస్‌జీఎస్ (గుంతకల్లు) క్రీడాకారిణీపై ఏపీ మోడల్ స్కూల్ (అగళి) క్రీడాకారిణి విజయం సాధించినట్లు కాలేజీ ప్రిన్సిపల్ కె.శ్రీనివాసులు, ఏడీజేసీఏఏ జిల్లా కార్యదర్శి నాగార్జున ప్రసాద్‌లు తెలియజేశారు. నేటి నుంచి అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారిణులు, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
5,6 తేదీల్లో కబడ్డీ, ఖోఖో జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–14, 17 జిల్లా కబడ్డీ, ఖోఖో జట్ల ఎంపిక ఈ నెల 5,6 తేదీల్లో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి నారాయణ తెలిపారు. అండర్–17 బాల, బాలికల కబడ్డీ ఎంపిక ఈ నెల 5న జరుగుతుందని, అండర్–14, 17 ఖోఖో బాల, బాలికల జట్ల ఎంపిక ఈ నెల 6న జరుగుతుందన్నారు. అండర్–14 విభాగానికి వచ్చే క్రీడాకారులు 1.1.2003 తరువాత జన్మించి ఉండి 6,7,8 తరగతులు చదువుతున్న వారు మాత్రమే అర్హులన్నారు. అండర్–17 విభాగానికి వచ్చే క్రీడాకారులు 1.1.2000 తరువాత జన్మించి ఉండి 9,10 తరగతులు చదువుతున్న వారు మాత్రమే అర్హులన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
–రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో కర్నూలు బాలబాలికల జట్లు విజయం నందికొట్కూరు: క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. నందికొట్కూరులోని అక్షరశ్రీ స్కూల్ ఆవరణలో జరుగుతున్న 62వ అండర్–14 రాష్ట్రస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. బుధవారం ఫైనల్ పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో విశాఖపట్నం జట్టుపై 22 పాయింట్లతో కర్నూలు జట్టు విజయం సాధించింది. మూడవ స్థానం ప్రకాశం, కృష్ణ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో గుంటూరు జట్టుపై కర్నూలు జట్టు 25 పాయింట్ల తేడాతో విన్నర్‌గా నిలిచింది. ఈస్ట్‌గోదావరి మూడవ స్థానం, ప్రకాశం జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. అనంతరం విజేత జట్లకు ఎస్పీ బహుమతులు అందజేసి మాట్లాడారు. క్రీడలతో స్నేహ సంబంధాలు బలపడతాయని చెప్పారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ సుప్రజ, సీఐ శ్రీనాథరెడ్డి, ఎంఈఓ రంగారెడ్డి, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, రాజ్‌కుమార్, సుబ్రమాణ్యం, హెచ్ఎం సుబ్బారాయుడు, పోలీసు సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు శ్రీనాథ్, జాకీర్, రవికుమార్, నాగరాజు, రాజేశ్వరి, రత్నకుమారి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా భారత్
-
మనమే కబడ్డీ కింగ్స్
• వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా భారత్ • ఫైనల్లో ఇరాన్‌పై 38-29తో విజయం • ప్రపంచ వేదికపై మన ‘కూత’ మార్మోగింది... • కబడ్డీపై మన ‘పట్టు’ మరింత బిగిసింది... ప్రొ కబడ్డీ లీగ్‌తో స్టార్స్‌గా మారిన భారత ఆటగాళ్లు... ప్రపంచకప్‌లోనూ గర్వంగా తొడకొట్టారు. టోర్నీ ప్రారంభంలోనే కాకుండా... ఫైనల్ పోరులోనూ ఆరంభంలో తడబడ్డా... అద్భుతంగా పోరాడి అదరగొట్టారు. అజయ్ ఠాకూర్ సంచలన రైడింగ్‌తో భారత జట్టు సగర్వంగా కబడ్డీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. అభినందనల వెల్లువ కబడ్డీ ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడల మంత్రి విజయ్ గోయెల్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు జట్టును అభినందించారు. క్రీడాకారులు హర్భజన్, వీవీఎస్ లక్ష్మణ్, జ్వాల కూడా జట్టును ప్రశంసించారు. అహ్మదాబాద్: కబడ్డీ కూతలో తమకు ఎదురులేదని భారత్ నిరూపించింది. వరుసగా మూడోసారి విశ్వవిజేతగా అవతరించి... హ్యాట్రిక్ కొట్టింది. శనివారం జరిగిన ప్రపంచ కప్ కబడ్డీ ఫైనల్లో భారత్ 38-29 పారుుంట్ల తేడాతో ఇరాన్‌పై గెలిచింది. 2004, 2007 ప్రపంచ కప్ టోర్నీల్లోనూ భారత్ చాంపియన్‌గా నిలువగా... ఆ రెండు టోర్నీ ఫైనల్స్‌లోనూ ఇరాన్ ఓడిపోరుు రన్నరప్‌గా నిలిచింది. స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ అద్భుతంగా ఆడి 12 పారుుంట్లు సాధించి భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల అజయ్ ఈ టోర్నీలో ఓవరాల్‌గా 64 పారుుంట్లు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలో తడబాటు భారత్‌కే చెందిన స్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్ కేసీ సుథార్ పర్యవేక్షణలో ప్రపంచకప్‌కు సిద్ధమైన ఇరాన్ మూడోసారైనా కప్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో తుదిపోరులో బరిలోకి దిగింది. సందీప్ నర్వాల్, అజయ్ ఠాకూర్ విజయవంతమైన రైడింగ్‌తో భారత్ ఆరంభంలో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇరాన్ ఆటగాళ్లు వరుసగా మూడు రైడింగ్ పారుుంట్లు నెగ్గి 3-2తో ఆధిక్యంలోకి వెళ్లారు. రెండు జట్ల ఆటగాళ్లు పట్టుదలగా పోరాడటంతో పలుమార్లు స్కోరు సమమైంది. 12వ నిమిషంలో ఇరాన్ స్టార్ ప్లేయర్ మిరాజ్ షేక్ రైడింగ్‌లో రెండు పారుుంట్లు సాధించడంతో ఇరాన్ 9-7తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఒత్తిడిలో ఆడుతున్నట్లు కనిపించిన భారత ఆటగాళ్లు అటు రైడింగ్‌లో, ఇటు ట్యాక్లింగ్‌లో తడబడ్డారు. తొలి అర్ధభాగం చివరి నిమిషాల్లో భారత్‌ను ఆలౌట్ చేసిన ఇరాన్ విరామ సమయానికి 18-13తో ఆధిక్యంలో నిలిచింది. అజయ్ అదుర్స్ రెండో అర్ధభాగంలో భారత్ పుంజుకుంది. రైడర్ అజయ్ ఠాకూర్ అద్భుత కదలికలతో ఇరాన్ ఆటగాళ్లను అవుట్ చేశాడు. రైడింగ్‌కు వెళ్లిన ఐదుసార్లూ అజయ్ పారుుంట్లతో తిరిగి వచ్చాడు. దాంతో భారత్ 30వ నిమిషంలో 21-20తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ వెంటనే ఇరాన్‌ను ఆలౌట్ చేసిన భారత్ 24-21తో తమ ఆధిక్యాన్ని మూడు పారుుంట్లకు పెంచుకుంది. భారత ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడంతో ఇరాన్‌పై ఒత్తిడి పెరిగింది. రైడింగ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు తడబడటం... అజయ్ ఠాకూర్ రైడింగ్‌లో చెలరేగడంతో భారత్ రెండోసారి ఇరాన్‌ను ఆలౌట్ చేసి 34-24తో తమ ఆధిక్యాన్ని 10 పారుుంట్లకు పెంచుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. అజయ్ ఠాకూర్‌తోపాటు రైడింగ్‌లో నితిన్ తోమర్ (6 పారుుంట్లు), సందీప్ నర్వాల్, అనూప్ కుమార్, సుర్జీత్ (3 పారుుంట్లు చొప్పున) రాణించారు. ‘ఎమర్జింగ్ టీమ్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు కెన్యా జట్టుకు దక్కగా... అత్యంత విలువైన క్రీడాకారుడు పురస్కారం జాంగ్ కున్ లీ (దక్షిణ కొరియా)కు లభించింది. -
24నుంచి కర్నూలులో రాష్ట్ర కబడ్డీ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: కర్నూలు జిల్లా నందికొట్కూరు వేదికగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–14 కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు ఆదివారం శ్రీకాకుళం నుంచి పయనం అవుతున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, డీఈఓ డి.దేవానందరెడ్డి, కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్ శుక్రవారం తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను ఇప్పటికే వెల్లడించామని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులంతా తమ లగేజీతోపాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ వద్దకు ఆదివారం ఉదయం 7 గంటలకు విధిగా చేరుకోవాలని సూచించారు. వివరాలకు 9440001616 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. జిల్లా జట్లకు కోచ్, మేనేజర్లగా పీఈటీలు వై.హరికృష్ణ (జెడ్పీహెచ్ స్కూల్, పీఎం పురం), పి.ప్రశాంతి (కెజీబీవీ, సారవకోట) వ్యవహరిస్తారని తెలిపారు. -
26న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
గుంతకల్లు టౌన్ : హజరత్ సయ్యద్ మస్తాన్‌వలి ఉరుసు సందర్భంగా ఈ నెల 26 న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కర్ణ, జయరామ్, అలీ ఓ ప్రకటనలో తెలిపారు. పాతగుంతకల్లులోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ మున్సిపల్ హైస్కూల్ క్రీడామైదానంలో పోటీలు ఉంటాయి. పాల్గొనదలచిన వారు 81424 33521, 9666255079 ఫోన్ నెంబర్లలో సంప్రదించి 25 లోపు తమ జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని, విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. -
ముగిసిన అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు
ఆచంట : ఆచంటలో మూడు రోజులపాటు జరిగిన 62వ అంతర్‌జిల్లాల స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలుర, బాలికల కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రకాశం జట్టు, బాలికల విభాగంలో విజయనగరం జట్టు విజేతలుగా నిలిచాయి. రెండోస్థానాన్ని బాలుర విభాగంలో కృష్ణా, బాలికల విభాగంలో విశాఖ జట్లు సాధించాయి. మూడో స్థానంలో బాలుర విభాగంలో పశ్చిమగోదావరి జట్టు, బాలికల విభాగంలో ప్రకాశం జట్టు నిలిచాయి. నరసాపురం సబ్‌కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ విజేతలకు బహుమతులు అందించారు. బాలికల మధ్య హోరాహోరీ బాలికల విభాగంలో ఫైనల్స్ హోరాహోరీగా జరిగింది. విజయనగరం, విశాఖ జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. మ్యాచ్ టై కావడంతో అంపైర్లు మరో ఐదు రైడ్స్‌తో ఆట కొనసాగించారు. చివరకు విజయనగరం జట్టు 29–28 పాయింట్లతో విశాఖను ఓడించింది. బాలుర మధ్య నువ్వానేనా.. బాలుర ఫైనల్స్ నువ్వానేనా అన్నట్టు సాగింది. కృష్ణా జట్టుపై ప్రకాశం జట్టు 30–27తో విజయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం బాలుర విభాగంలో పశ్చిమగోదావరి, విశాఖ జట్లు తలపడగా పశ్చిమగోదావరి, బాలికల విభాగంలో ప్రకాశం, శ్రీకాకుళం జట్లు తలపడగా ప్రకాశం జట్లు గెలుపొందాయి. క్రీడలకు స్ఫూర్తినిచ్చేది కబడ్డీ క్రీడలకు స్పూర్తినిచ్చే ఆట కబడ్డీ అని, ఇటువంటి క్రీడలను మారుమూల గ్రామమైన ఆచంటలో అంతర్‌జిల్లాల స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని నరసాపురం సబ్‌కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. కబడ్డీని ప్రొఫెషనల్‌గా తీసుకుని ఆడాలని సూచించారు. తహసిల్దార్ కె.రాజేంద్రప్రసాదరావు, ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్పంచ్ బీరా తిరుతపమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు, సిద్దాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తమ్మినీడి ప్రసాదు, ఓల్డ్ స్టూడెంట్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బలుసు శ్రీరామమూర్తి పాల్గొన్నారు. -
ముగిసిన అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు
ఆచంట : ఆచంటలో మూడు రోజులపాటు జరిగిన 62వ అంతర్‌జిల్లాల స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలుర, బాలికల కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రకాశం జట్టు, బాలికల విభాగంలో విజయనగరం జట్టు విజేతలుగా నిలిచాయి. రెండోస్థానాన్ని బాలుర విభాగంలో కృష్ణా, బాలికల విభాగంలో విశాఖ జట్లు సాధించాయి. మూడో స్థానంలో బాలుర విభాగంలో పశ్చిమగోదావరి జట్టు, బాలికల విభాగంలో ప్రకాశం జట్టు నిలిచాయి. నరసాపురం సబ్‌కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ విజేతలకు బహుమతులు అందించారు. బాలికల మధ్య హోరాహోరీ బాలికల విభాగంలో ఫైనల్స్ హోరాహోరీగా జరిగింది. విజయనగరం, విశాఖ జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. మ్యాచ్ టై కావడంతో అంపైర్లు మరో ఐదు రైడ్స్‌తో ఆట కొనసాగించారు. చివరకు విజయనగరం జట్టు 29–28 పాయింట్లతో విశాఖను ఓడించింది. బాలుర మధ్య నువ్వానేనా.. బాలుర ఫైనల్స్ నువ్వానేనా అన్నట్టు సాగింది. కృష్ణా జట్టుపై ప్రకాశం జట్టు 30–27తో విజయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం బాలుర విభాగంలో పశ్చిమగోదావరి, విశాఖ జట్లు తలపడగా పశ్చిమగోదావరి, బాలికల విభాగంలో ప్రకాశం, శ్రీకాకుళం జట్లు తలపడగా ప్రకాశం జట్లు గెలుపొందాయి. క్రీడలకు స్ఫూర్తినిచ్చేది కబడ్డీ క్రీడలకు స్పూర్తినిచ్చే ఆట కబడ్డీ అని, ఇటువంటి క్రీడలను మారుమూల గ్రామమైన ఆచంటలో అంతర్‌జిల్లాల స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని నరసాపురం సబ్‌కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. కబడ్డీని ప్రొఫెషనల్‌గా తీసుకుని ఆడాలని సూచించారు. తహసిల్దార్ కె.రాజేంద్రప్రసాదరావు, ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్పంచ్ బీరా తిరుతపమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు, సిద్దాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తమ్మినీడి ప్రసాదు, ఓల్డ్ స్టూడెంట్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బలుసు శ్రీరామమూర్తి పాల్గొన్నారు. -
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
కోవూరు: గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడమే క్రీడాకారుడి గొప్ప లక్షణమని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి టీ లవకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో హో ప్రాంగణంలో బుధవారం కబడ్డీ క్రీడాకారులకు క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42వ అంతర జిల్లాల రాష్ట్ర స్థాయి బాల,బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు ఈ నెల 20 నుంచి 23 తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయన్నారు. క్రీడాకారులు పోటీల్లో సత్తాచాటాలని కోరారు. అనంతరం కోవూరు సబ్ రిజిస్ట్రార్ ఎన్ నాగేశ్వరరావు, ఎస్ఐ వెంకట్రావు మాట్లాడారు. యువతో విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అశోక్‌కుమార్, కోవూరు ఉపసర్పంచ్ ఇంతా మల్లారెడ్డి, సీనియర్ క్రీడాకారులు పూండ్ల జాన్సన్, తదితరులు పాల్గొన్నారు. జట్లు వివరాలు. బాలుర జట్టు : షేక్ ఫిరోజ్ ,కెప్టెన్ (లేగుంటపాడు), ఏ కళ్యాణ్, వీ సాయి (లేగుంటపాడు) ఏ కరుణాకర్ (చెర్లోపాళెం), వీ జనార్దన్ (కావలి), ఉదయ్ (కోవూరు) , ఐ కళ్యాణ్ (సోమరాజుపల్లె), కే రాజకుమార్ (కావలి), క్రాంతి (దువ్వూరు), సీహెచ్ ప్రదీప్(ముదివర్తి) సాయి (ముదివర్తి), శివకృష్ణ (కావలి). బాలికల జట్టు : షేక్ తహసీన్ (కెప్టెన్) (నెల్లూరు), ఈ.ఇందు (తడ), ఆర్.చెంగమ్మ( తడ), ఓ.వసుధ (ముదివర్తి) , ఎన్.మౌనిక(తడ), కే పద్మ (కావలి), డీమహిత (కోవూరు), జీ నిర్మల (వావిళ్ల), పీ సుకన్య (సీఎస్‌పురం), బీ రాజ్యలక్ష్మి (కోవూరు), కే జాగృతి(కోవూరు). -
ఎస్జీఎఫ్ కబడ్డీ జట్ల ఎంపిక
కడప స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 బాలబాలికల విభాగాల్లో జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికలు నిర్వహించారు. కడప నగరంలోని గాంధీనగర్ నగరపాలకోన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ ఎంపికలకు డీఈఓ బి. ప్రతాప్‌రెడ్డి విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కటి ఆటతీరును కనబరిచి విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.ఎ. సునీల్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన అండర్–14 క్రీడాకారులు కర్నూలులో, అండర్–17 విభాగం క్రీడాకారులు విజయనగరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యసుజాతమ్మ, సుబ్బానాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్‌రెడ్డి, వి. కేశవ, సంపత్‌కుమార్, నాగార్జున, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. అండర్–14 బాలుర జట్టు : పి. సతీష్‌కుమార్, పి.నాగరాజు, టి.మురళీకృష్ణ, ఎం.రంజింత్కుమార్, ఎం.వేణు, వి.నరేన్యాదవ్, డి.సుదర్శన్‌రెడ్డి, మధుకల్యాణ్, మహమ్మద్సలీం, మురళీమోహన్, చంద్రశేఖర్, రామాంజినేయులు. స్టాండ్‌బై : ఎస్.కె. సలీం, ఎం. శివకృష్ణ, కె.హరినాథ్, వి.వంశీ, ఎస్.మాబూహుస్సేన్. అండర్–14 బాలికల జట్టు : ఎం. సుకుమారి, జె.నాగసుధామణి, ఎం.శిల్ప, కె.సుస్మిత, ఎస్.మహబూబ్‌చాన్, సి. స్పందన, కె.సౌజన్య, ఎస్.నాగజ్యోతి, ఎస్.పల్లవి, ఎం. వెంకటనందిని, ఐ. కీర్తి, ఎ.పుష్పలత. స్టాండ్‌బై : ఎం. ప్రగతి, కె.శ్రీదేవి, ఎస్.దీప్తి, డి.మీనాక్షి, ఎల్.అపర్ణ. అండర్–17 బాలుర జట్టు : ఆర్. వెంకటేష్‌నాయక్, డి. శ్రీనివాసులు, కె.ప్రసన్న, కె.సురేంద్ర, ఎం.కిరణ్‌కుమార్, జి.సుధీర్‌కుమార్‌రెడ్డి, టి.చరణ్‌కుమార్, ఆర్.గోవర్ధన్‌రెడ్డి, ఎం.నందకుమార్, కె.దేవారెడ్డి, డి.విష్ణువర్ధన్, డి.కల్యాణ్యాదవ్. స్టాండ్‌బై : వై. రాధాకృష్ణారెడ్డి, ఎస్.శివప్రసాద్, జె.నవీన్‌కుమార్, పి. వినోద్‌కుమార్, పి.మహబూబ్‌బాషా. అండర్–17 బాలికల జట్టు : ఎస్.పూజ, వి.లక్ష్మిదేవి, పి.లక్ష్మిప్రసన్న, జి.అప్సర, కె.వెంకటపద్మజ, పి.చంద్రిక, వి.లక్ష్మిప్రసన్న, ఎం.ధనలక్ష్మి, డి.చిట్టెమ్మ, పి.మైనా, పి.సుభాషిణి, ఎ.సైదా. స్టాండ్‌బై : సి.హరిత, ఇ.అశ్విని, ఎన్.అజయ్‌కుమారి, డి. దీపిక. -
అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు ప్రారంభం
ఆచంట : స్థానిక ఎంవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం అంతర్ జిల్లాల అండర్–19 కబడ్డీ పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరి చయం చేసుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన బాలుర, బాలికల జట్లు పోటీలకు తరలివచ్చారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్‌లో కబడ్డీని చేర్చాలి రాష్ట్రంలోనూ, దేశంలోనూ కబడ్డీకి విశేష ఆదరణ ఉందని ఒలింపిక్స్‌లో చేరిస్తే భారత జట్టు తప్పక బంగారు పతకం సాధిస్తుందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. కబడ్డీ పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను మరింత ప్రోత్సహిస్తుందని, బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చెప్పారు. చదువుతో పాటు క్రీడలూ ప్రధానమని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. కళాశాలలో ప్రహరీ నిర్మాణానికి, మైదానం చదును చేసేందుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర పరిశీలకులు కేవీ శేషగిరిరావు, బి.రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాలరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు ఆదిరెడ్డి సత్యనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐజాక్, కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావు, సర్పంచ్ బీరా తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆయా జిల్లాల కోచ్‌లు, పీడీలు పోటీలను పర్యవేక్షించారు. -
రిటైర్మెంట్పై అనూప్ ప్రకటన
అహ్మదాబాద్:భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అనూప్ కుమార్ తన అంతర్జాతీయ రిటైర్మెంట్పై నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ వరల్డ్ కప్ తరువాత అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి వీడ్కోలు తీసుకోనున్నట్లు తెలిపాడు. అయితే ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో కొనసాగుతానని తెలిపాడు. 'నేను ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌గా ఉండాలనుకుంటున్నా. ఈ మేరకు అంతర్జాతీయ కబడ్డీకి గుడ్ బై చెబుతున్నా. ఈ వరల్డ్ కప్ అనంతరం జాతీయ జట్టు నుంచి విశ్రాంతి తీసుకుంటా. యువ ఆటగాళ్లు రావాలనేది నా కోరిక. దానిలో భాగంగానే రిటైర్ అవుతున్నా'అని అనూప్ తెలిపాడు. ప్రస్తుత వరల్డ్ కప్‌ను భారత్ సాధించాలనేది తన కల అని, ఈ ఏడాది వరల్డ్ కప్ కల తీరుతుందని ఆశిస్తున్నట్లు అనూప్ పేర్కొన్నాడు. హరియాణా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలోని పాల్రా అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన అనూప్ అంచెలంచెలుగా తన కబడ్డీ ప్రస్థానాన్ని కొనసాగించాడు. ప్రస్తుత ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా అనూప్ పని చేస్తున్నాడు. 2006లో శ్రీలంకలో జరిగిన దక్షిణాసియా గేమ్స్ తో కబడ్డీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన అనూప్.. భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడు. రాకేశ్ కుమార్ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్ గా పని చేసిన అనూప్.. 2012లో అర్జున అవార్డును అందుకున్నాడు. 2016లో భారత కబడ్డీ జట్టు కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఇదిలా ఉండగా, ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబై జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. దీనిలో భాగంగా కబడ్డీ లీగ్ రెండో సీజన్ 2015లో యు ముంబైకు కప్ ను అందించాడు. అంతకుముందు 2014, 16ల్లో యు ముంబైను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ ప్రొ కబడ్డీ లీగ్ లో 330 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో 305 రైడింగ్ పాయింట్లను సాధించడం విశేషం. -
భారత్‌కు రెండో విజయం
ప్రపంచకప్ కబడ్డీ టోర్నీ అహ్మదాబాద్: తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం చవిచూసిన భారత పురుషుల కబడ్డీ జట్టు ప్రపంచ కప్‌లో ఫామ్‌లోకి వచ్చింది. బంగ్లాదేశ్‌తో మంగళ వారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 57-20 తో ఘనవిజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్లో భారత్‌కిది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్‌లో కొరియా చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఈనెల 15న జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనాతో భారత్ ఆడుతుంది. అందరికీ ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశంతో టీమిండియా ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అజయ్ ఠాకూర్ 11 పారుుంట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రదీప్ నర్వాల్ ఎనిమిది పారుుంట్లు, సురేందర్ ఆరు పారుుంట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో ఇరాన్ 33-28తో కెన్యాపై గెలిచి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో జపాన్ 33-22తో పోలాండ్‌పై, ఆస్ట్రేలియా 68-45తో అర్జెంటీనాపై గెలిచారుు. -
కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
సామర్లకోట : గ్రామీణ క్రీడైన కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ అన్నారు. అంబేడ్కర్ యూత్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ మెమోరియల్ 43వ జిల్లా స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. వైఎస్ చిత్రపటానికి నివాళి సునీల్ ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ కబడ్డీ వ్యక్తిగత నైపుణ్యంతో కూడినదన్నారు. అనంతరం ముఖ్య అతిథులు క్రీడా జెండాను ఎగుర వేసి కోర్టులను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. టోర్నీ నిర్వాహకులు ఉబా జాన్‌మోజెస్, కెనడీ మాట్లాడారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు బి.ముర ళీ కుమార్, గౌరవ అ««దl్యక్షుడు బాబు, జాతీయ కోచ్ పోతుల సాయి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసు, ఉపాధ్యక్షుడు కొండపల్లి శ్రీను, సహాయ కార్యదర్శి టి. వైకుంఠం, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రాజబాబు, కార్యదర్శి ఎం. రమేష్‌బాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు గోలి వెంకట అప్పారావు చౌదరి, బోనాసు వెంకటేశ్వరరావు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సీహెచ్ వీర్రాజు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఎం. శ్రీను, కోశాధికారి ఎస్. దుర్గారావు, పీఈటీలు ఎండీవీ ప్రసాద్, ఎం.సుబ్బారావు పాల్గొన్నారు. కబడ్డీ చాంపియన్‌గా కిర్లంపూడి కబడ్డీ చాంపియ¯Œæగా కిర్లంపూడి జట్టు నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో కిర్లంపూడి – కాకినాడ ఐడియల్ జట్లు తలపడ్డాయి. కిర్లంపూడి 29 పాయింట్లు, కాకినాడ 24 పాయింట్లు సాధించాయి. తృతీయ స్థానంలో విరవ, దివిలి సంయుక్తంగా నిలిచాయి. బహుమతి ప్రదానోత్సవానికి వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, కృష్ణవంశీ ఫౌండేషన్ చైర్మన్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వర్ధనపు కృష్ణ వంశీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విజేతకు రూ.1,116, ద్వితీయస్థానంలో నిలిచిన జట్టుకు రూ.500 బహుమతిని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను ప్రత్యేకంగా ప్రకటించారు. జిల్లా కబడ్డీ టీము సభ్యులు వీరే.. పి. మణికంఠ, పి. అచ్చుతకుమార్, మహేష్, జి. రాంబాబు, పి. బాలసుబ్రహ్మణ్యం, బి. ధనశేఖర్, కె.వరబాబు, ఎస్.హరిష్, పి.వెంకటేశ్వరరావు, సీహెచ్ చంద్రశేఖర్, ఎస్.అజయ్‌లను ఎంపిక చేశారు. వీరు ఈ నెల 20 నుంచి విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. -
హోరా హోరీగా కబడ్డీ పోటీలు
సామర్లకోట : సామర్లకోటలో జరుగుతున్న ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్ర కబడ్డీ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల స్త్రీ, పురుష జట్ల మధ్య వేర్వేరుగా ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్త్రీ, పురుష కబడ్డీ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం శనివారం రాత్రి పోటీలను తిలకించారు. అంతర్జాతీయ కోచ్ పోతుల సాయిని, పీఈటీ తాళ్లూరి వైకుంఠంలను డిప్యూటీ సీఎం, రాజప్పలు ఘనంగా సన్మానించారు. మ్యాచ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు నవభారత్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ నాగభైరవ ప్రభాకర్ బ్యాగ్‌లు, స్టాప్ వాచ్, విజిల్ అందజేశారు. మహిళా విభాగంలో విజయనగరం జట్టు పశ్చిమ గోదావరి జట్టుపై 48 పాయింట్ల తేడాతో, గుంటూరు జట్టుపై తూర్పుగోదావరి 37 పాయింట్ల ఆధిక్యతతో, విశాఖ జట్టు అనంతపురం జట్టుపై 41 పాయింట్ల తేడాతోను, కృష్ణా జట్టు శ్రీకాకుళం జట్టుపై 35 పాయింట్ల తేడాతోను ఘన విజయం సాధించాయి. పురుషుల విభాగంలో గుంటూరు జట్టుపై తూర్పు గోదావరి జట్టు 32 పాయింట్ల తేడాతోను, కృష్ణా జట్టుపై విశాఖ జట్టు 9 పాయింట్ల తేడాతో విజేతలుగా నిలిచాయి. ప్రకాశం జట్టు నెల్లూరు జట్టుపై 10 పాయింట్ల తేడాతోను, విజయనగరం– పశ్చిమ గోదావరిపై మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. రాత్రి 8.30 గంటకు సీమి ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభించారు. పురుషుల మొదటి సెమీ ఫైనల్ తూర్పు– విశాఖ జట్ల మధ్య, మహిళల సెమీ ఫైనల్ తూర్పు –విజయనగరం జట్ల మధ్య జరిగాయి. మహిళా విభాగంలో విజయనగరం జట్టు తూర్పు గోదావరిపై 19 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. తూర్పు గోదావరి పురుషుల జట్టు విశాఖ జట్టుపై 22 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్ పోతుల సాయి, భారత మాత సేవా పరిషత్తు జిల్లా అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర, నలమాటి జానికి రామయ్య, టీ డీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, పంచా రామ క్షేత్ర ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్లు, జిల్లాలోని పీఈటీలు పాల్గొన్నారు. -
ఉత్కంఠ భరితం
‘కోట’లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు క్రీడాకారులను పరిచయం చేసుకున్న డిప్యూటీసీఎం నేటితో ముగియనున్న పోటీలు సామర్లకోట : సామర్లకోటలో జరుగుతున్న ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల పురుష, మహిళల జట్ల మధ్య వేర్వేరుగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ పోటీలను తిలకించారు. శుక్రవారం కర్నూలు– గుంటూరు మహిళల కబడ్డీ పోటీ ఆసక్తిగా సాగింది. ఇరు జట్లు 38 పాయింట్ల వంతున సాధించడంతో చెరో ఒక పాయింటు కేటాయించారు. పురుషుల విభాగంలో కడప 27 పాయింట్లు సాధించగా, తూర్పు గోదావరి 66 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. కర్నూలు– పశ్చిమ గోదావరి జట్ల మధ్య జరిగిన పోటీలో పశ్చిమ 29 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. గుంటూరు జట్టు శ్రీకాకుళం జట్టుపై రెండు పాయింట్ల తేడాతో గెలుపొందింది. విశాఖపట్నంపై ప్రకాశం జట్టు 44 పాయింట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసుకుంది. నెల్లూరు జట్టు అనంతపురం జుట్టుపై 44 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. చిత్తూరు జట్టుపై విశాఖపట్నం 23 పాయింట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. అనంతపురంపై కృష్ణా జట్టు 34 పాయింట్ల తేడా విజేతగా నిలిచింది. అదే విధంగా మహిళా విభాగంలో నెల్లూరు జట్టుపై తూర్పు గోదావరి జట్టు 43 పాయింట్ల తేడాతో, శ్రీకాకుళం జట్టు కడప పై 46 పాయింట్ల తేడాతో, ప్రకాశం జట్టు చిత్తూరుపై ఏడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. కృష్ణా జట్టు పశ్చిమ గోదావరిపై 24 పాయింట్ల ఆధిక్యంతో విజయం నమోదు చేసుకుంది. నెల్లూరుపై అనంతపురం 31 పాయింట్ల ఆధిక్యంతో, శ్రీకాకుళంపై విజయనగరం 31 పాయింట్ల తేడాతో, గుంటూరుపై విశాఖ పట్నం 27 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్ పోతుల సాయి, భారత మాత సేవా పరిషత్తు జిల్లా అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర, టీ డీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, పంచా రామ క్షేత్ర ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌ న్సిలర్లు, జిల్లాలోని పీఈటీలు పాల్గొన్నారు. -
అండర్–17 కబడ్డీ జట్ల ఎంపిక
చిరుమామిళ్ళ (నాదెండ్ల): కబడ్డీ అండర్–17 బాలుర, బాలికల జిల్లా జట్ల వివరాలను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఎం గణేష్ సోమవారం ప్రకటించారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ళలోని నడికట్టు రామిరెడ్డి జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన ఎంపిక పోటీలకు 40 స్కూళ్ల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు, ముఖ్యఅతిథిగా నడికట్టు రామిరెడ్డి హాజరయ్యారు. బాలుర జట్టులో.. వై.నజీర్మీరసా, ఎన్.పవన్‌కుమార్ (చిలకలూరిపేట), సాయికుమార్ (గుళ్ళాపల్లి), ఇ.హరిబాబు(మాదల), జి.వెంకట శివనాగేశ్వరరావు (కుంకలగుంట), జి.సతీష్ (పిల్లుట్ల), జి.సైదులు మస్తాన్ (వి రెడ్డిపాలెం), ఎం.సుబ్బారావు (వెల్లటూరు), ఎస్.శ్రీనివాసరెడ్డి (కావూరు), భానుప్రసాద్ (చందోలు), ఎం.మేరిబాబు (తుమృకోట), బి.మణికంఠ (ఇంకొల్లు), స్టాండ్‌బైగా శ్రీనివాసరెడ్డి(చిరుమామిళ్ళ), పి.కరీం (చిలకలూరిపేట) ఎంపికయ్యారు. బాలికల జట్టులో.. డి.కవిత, ఎ.మహిత, సీహెచ్ ధనశ్రీ, ఎం.నిరోష, పి.వరలక్ష్మి, యు.భార్గవి (కావూరు), వి.సంధ్యారాణి (కుంకలగుంట), ఎ.అనిత (చిలకలూరిపేట), ఎ.రాజకుమారి (వల్లిపాలెం), ఎస్yì .ముబీనా (పెదకొండపాడు), ఐ.లావణ్య (రాజోలు), బి.దివ్య (ధూళిపూడి) ఎంపికయ్యారు. -
25న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక
బాపట్ల: గుంటూరు జిల్లా స్త్రీ, పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక ఈనెల 25న బాపట్ల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతుందని గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరి ఊసా రాంబాబు తెలిపారు. ఎంపికైన జట్లు అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పల్లంబీడు గ్రౌండ్లో జరిగే 64వ అంతర్రాష్ట్ర స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పురుషులు 80 కిలోలు, స్త్రీలు 70 కేజీలు మించి ఉండరాదన్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా జిల్లా వాసులై ఉండాలని, ఆధార్‌కార్డు ఒరిజినల్‌తో హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కత్తి శ్రీనివాసరావు ఉన్నారు. -
జిల్లాస్థాయికి ఎంపికైన క్రీడాకారులు
జగిత్యాల రూరల్ : ఇటీవల జరిగిన జోనల్‌స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన మండలంలోని పొలాస జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు లోకేశ్, శివకుమార్, వెంకటేశ్‌లను శనివారం అభినందించారు. క్రికెట్లో లోకేశ్, కబడ్డీలో శివకుమార్, వెంకటేశ్ ఎంపికయ్యారు. వీరిని సర్పంచ్ చిర్ర నరేశ్, ఎంపీటీసీ గాజంగి భారతి, రాజన్న, పీఈటీ దత్తాత్రి అభినందించారు. -
రాష్ట్ర స్థాయి విద్యాసదస్సు, కబడ్డీ పోటీల బ్రోచర్ల ఆవిష్కరణ
పెద్దాపురం : ఈనెల 15న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి విద్యాసదస్సు, వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు సామర్లకోటలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల బ్రోచర్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఆదివారం ఇక్కడ ఆవిష్కరించారు. సామర్లకోట ఎన్బీఎస్ఆర్ క్లబ్, జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 13 జిల్లాల నుండి వచ్చే క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. తెలుగు ఉపా«ధ్యాయ సంఘం ఆ««దl్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ‘ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ–ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తారని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.జయరామ్ మంత్రి రాజప్పకు వివరించారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కరరావు, కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్షుడు డి.మురళి, ఉపాధ్యాయ సంఘం జిల్లా కన్వీనర్ ఎం.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
సామర్లకోట : స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లా పురుషుల, స్త్రీల కబడ్డీ జట్ల ఎంపిక ఆదివారం జరి గింది. రాజమహేంద్రవరం, కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, కిర్లంపూడి మం డలాల నుంచి వచ్చిన క్రీడాకారులకు పో టీలు నిర్వహించి జట్లను ఎంపిక చేశా రు. ఈ జట్టు వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు సామర్లకోట పట్టణంలో నిర్వహిం చే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొం టాయి. ఎన్టీఆర్ మెమోరియల్ పేరుతో 64వ రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల నిర్వాహక కమిటీ కార్యదర్శి బోగిళ్ల మురళీకుమార్ (జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు) మాట్లాడుతూ నిర్వాహక కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యవహరిస్తారన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తాళ్లూరి వైకుంఠం ఆధ్వర్యంలో జట్లను ఎంపిక చేశామన్నారు. పురుషుల జట్టు ఎ. నవీన్‌రాజు, జి. ప్రసాద్, కె. శ్రీని వాసు, కె. ఆర్తివదన్, పి. అజయ్, ఈ నా గేంద్ర, బి. పవన్ వెంకటకుమార్, సీహెచ్ మణికంఠ, పీవీ దుర్గారావు, కె.వేణు, కేవీఎల్ నారాయణ, ఆర్.అశోక్ ప్రధాన జట్టుకు ఎంపికయ్యారు. అదనంగా జి.ర ఘు, జి. శ్రీను, కె.దుర్గాప్రసా ద్, బి.ఉమామహేశ్వరరావులను ఎంపిక చేశారు. మహిళల జట్టు డి.దైవకృప, వి.రోహిణిదేవి, కేవీఎం దు ర్గ, వై.గిరిజా అనంతలక్ష్మి, జీఎస్ఎల్ఎన్ శివజ్యోతి, పి.విజయదుర్గ, కె.సత్యవేణి, ఎం.హేమలత, డి.వేదమణి, యు.లక్ష్మి, ఎస్ఎస్ఎస్ఎల్ ప్రసన్న, ఐ.సూర్యభవా ని,ఎన్.కావ్య,కె.స్వాతి, ఎన్.శిరిషా, జె.సుబ్బలక్ష్మి, డి.కృపామణి, వి.విజయ ఎంపికయ్యారు. కార్యక్రమంలో వీఆర్ కెనడీ, కొండపల్లి శ్రీను, గంగిరెడ్డి బలరామ్, మ ట్టా సుబ్బారావు, వెంకటేశ్వరరావు,గోలి సత్తిరాజు, బి. మోహనరావు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న అండర్ –19 క్రీడలు
మిర్యాలగూడ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో 62వ రాష్ట్ర స్థాయి అండర్–19 క్రీడలు రెండో రోజైన ఆదివారం కొనసాగాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కబడ్డీ, షూటింగ్ పోటీలు నిర్వహించగా, నాగార్జున జూనియర్ కళాశాలలో బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. బాల్ బ్యాడ్మింటన్ పోటీలను స్థానిక డీఎస్పీ రాంగోపాల్‌రావు ప్రారంభించారు. మొదటి రోజు వర్షం కారణంగా నిలిచిపోయిన క్రీడలను రెండో రోజు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, సీఐ భిక్షపతి, అనుముల మధుసూదన్‌రెడ్డి, వాడపల్లి రమేష్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ప్రో కబడ్డీపోటీలు ప్రారంభం
చిలుకూరు: చిలుకూరు ప్రో కబడ్డీ యూత్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి గ్రామీణ ప్రో కబడ్డీ్డ పోటీలను స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డా నారాయణరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలన్నారు. మొత్తం 80 జట్టు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత గడ్డం శ్రీను, సర్పంచ్ సుల్తాన్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ నెల్లూరి నాగేశ్వరరావు, సోసైటీ వైస్ చైర్మన్ ఆవుల శ్రీను, డైరక్టర్ బెల్లంకొండ నాగయ్య, క్రీడల నిర్వాహకులు షేక్ పాషా, అమరగాని లింగరాజు, యూసఫ్, షేక్ నాగులమీరా, అమరగాని నవీన్‌లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ప్రో కబడ్డీపోటీలు ప్రారంభం
చిలుకూరు: చిలుకూరు ప్రో కబడ్డీ యూత్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి గ్రామీణ ప్రో కబడ్డీ్డ పోటీలను స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డా నారాయణరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలన్నారు. మొత్తం 80 జట్టు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత గడ్డం శ్రీను, సర్పంచ్ సుల్తాన్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ నెల్లూరి నాగేశ్వరరావు, సోసైటీ వైస్ చైర్మన్ ఆవుల శ్రీను, డైరక్టర్ బెల్లంకొండ నాగయ్య, క్రీడల నిర్వాహకులు షేక్ పాషా, అమరగాని లింగరాజు, యూసఫ్, షేక్ నాగులమీరా, అమరగాని నవీన్‌లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఔట్‌డోర్ ఆటలే అన్నిటికన్నా బెస్ట్!
పూర్వం పిల్లలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే స్నేహితులతో కలిసి హాయిగా ఆటలాడుకునేవారు. కబడ్డీ, కోతికొమ్మచ్చి, నేలాబండా, ఒంగుళ్లు- దూకుళ్లు, క్రికెట్టు, కర్రాబిళ్లా, ఏడుపెంకులాట, రాళ్లాట వంటివి వారు ఆడుకునే ఆటల్లో ఉండేవి. అయితే ఈ కాలం పిల్లలు బయటికెళ్లి ఆడుకోవడం తగ్గిపోయింది. అస్తమానం టీవీలకూ, కంప్యూటర్లకూ అతుక్కుపోతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం, కళ్లద్దాల బారిన పడుతున్నారు. తలిదండ్రులు కూడా పిల్లలు బయటికెళ్లి అటలాడుకుని ఏ కొట్లాటో తెచ్చిపెట్టేకంటే, ఓ సిస్టమ్ వాళ్ల ముందు పడేస్తే సరిపోతుంది, హాయిగా కళ్ల ముందే ఉంటారు కదా అని అనుకుంటున్నారు. అయితే అది చాలా తప్పు. ఎందుకంటే బయటికెళ్లి ఆటలాడుకునే పిల్లల కు శారీరక వ్యాయామంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందట. తెలివితేటలు, సోషల్ స్కిల్స్ పెంపొందుతాయట. ఎగరడం, దుమకడం, సైక్లింగ్ చేయడం, మోటుగా ఆటలు ఆడటం వంటి వాటి వల్ల వారిలో ఐక్యూ పెరుగుతుందట. సాధారణ అధ్యయనం చెబుతున్న మాటలు కావివి. యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో బాలల శారీరక, మానసిక ఆరోగ్యాలపై మేటి శాస్త్రవేత్తలు తేల్చిన పరిశోధనాంశాలు. వీరే కాదు, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రిసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు కూడా పిల్లలను ఔట్‌డోర్ గేమ్స్ ఆడుకోవడాన్ని తలిదండ్రులు తప్పక ప్రోత్సహించాలంటున్నారు. అలా ప్రోత్సహించబట్టే కదా మొన్నటికి మొన్న పి.వి. సింధు, సాక్షి మాలిక్ వంటి వారు ఒలింపిక్ గేమ్స్‌లో మన పరువు నిలబెట్టింది! అందుకే ఎప్పుడూ చదువు చదువు అని పిల్లల్ని సతాయించకుండా, వారిలో ఉన్న ఇతర సామర్థ్యాలని కూడా వెలికి తీయడం బెస్టంటున్న సర్వే రిపోర్టులను కూడా కాస్త తలకెక్కించుకోక తప్పదు మరి! -
సరిపల్లిలో చెడుగుడు పోటీలు ప్రారంభం
నరసాపురం రూరల్ : కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల స్థాయి చెడుగుడు పోటీలు శుక్రవారం సరిపల్లిలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సర్పంచ్ కేదాసు రమా కాసుమణి యోగేంద్ర ప్రారంభించారు. తొలి రోజు పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. వైఎన్ కళాశాల, పెదగరువు టీముల మధ్య పోటీ జరగగా వైఎన్ కళాశాల టీము విజయం సాధించింది. ఈ పోటీలకు రిఫరీగా మహేష్‌నాయుడు వ్యవహరిస్తున్నారు. -
కబడ్డీ క్రీడను ప్రోత్సహించాలి
కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు నల్లగొండ టూటౌన్ : గ్రామీణ క్రీడ అయిన కబడ్డీని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఐబీసీ, ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్ స్పోర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల జరుగుతున్న కబడ్డీ పోటీలు ఆదివారం రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలతో పోటీతత్వం, శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు. క్రీడాసంఘాలు గ్రామీణ క్రీడల వైపు యువతను మల్లించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం మ్యాచ్ రిఫరీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐబీసీ ఎండీ ఏచూరి భాస్కర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏచూరి శైలజ, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి, డాక్టర్ నరహరి, రోహిత్, వేణు సంకోజు, సీపీఐ జిల్లా కార్యరద్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, డాక్టర్ అనూష శ్రీనివాస్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
నల్లగొండ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐబీసీ చానల్, ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో శని, ఆదివారాల్లో జిల్లా స్థాయి కబడ్డీ ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐబీసీ ఎండీ ఏచూరి భాస్కర్ శుక్రవారం విలేకరులతో తెలిపారు. అంతకుముందు ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు బి.గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
కబడ్డీ..కబడ్డీ
పాలేరు నవోదయలో రీజినల్‌స్థాయి కబడ్డీ పోటీల సందడి ఐదు రాష్ట్రాల నుంచి తరలొచ్చిన విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటాలి : డీఈఓ రాజేష్ కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో రీజినల్ స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో నవోదయ విద్యాలయ సమితి, హైదరాబాద్ పరిధిలోని యానాం, కరీంనగర్, కొప్పాల్, దవణగిరె, బెంగుళూరు, నెల్లూరు క్లస్టర్లకు చెందిన నవోదయ విద్యార్థులు పాల్గొంటున్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహిస్తున్నారు. డీఈఓ నాంపల్లి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పతాకాన్ని ఎగురవేసి, క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. పాలేరు సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డితో కలిసి బెలూన్లను ఎగురవేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డీఈఓ మాట్లాడుతూ... విద్యార్థులకు విద్యతో సమనంగా క్రీడలు పేరును తీసుకొస్తాయని, క్రీడాస్ఫూర్తిని నింపుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి ఎంతో గుర్తింపు ఉందని, పాలేరు వేదికగా భారీస్థాయిలో పోటీలు జరగడం సంతోషదాయకమని అన్నారు. సర్పంచ్ మాధవీరెడ్డి మాట్లాడుతూ..పాలేరు నవోదయలో రీజినల్ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించటం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ స్వర్ణలత, సీనియర్ ఫ్యాకల్టీ భారతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హోరాహోరీగా పోటీలు.. తొలిరోజు పాలేరు నవోదయ ప్రాంగణం మొత్తం కళకళలాడింది. వివిధ రాష్ట్రాల నుంచి తరలొచ్చిన విద్యార్థులు ఆట నైపుణ్యంతో అచ్చెరువొందేలా చేశారు. కబడ్డీ..కబడ్డీ కూతతో..క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. విభాగాల వారీగా..ప్రతిభను చాటారు. ఈ పోటీలను విద్యాలయానికి చెందిన పీఈటీలు బాపూజీ, కామేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
కేశవ్ మెమోరియల్ స్కూల్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న హిమాయత్‌నగర్ జోనల్ కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లో కేశవ్ మెమోరియల్ స్కూల్ విజయం సాధించింది. సోమవారం జరిగిన కబడ్డీ టోర్నమెంట్ అండర్-17 బాలుర విభాగంలో కేశవ్ మెమోరియల్ స్కూల్ 27-1తో ప్రభుత్వ బాలుర హైస్కూల్ (అంబర్‌పేట)ను చిత్తుగా ఓడించింది. బాలికల విభాగంలో ప్రభుత్వ బాలికల హైస్కూల్ 25-8తో బీఆర్ఆర్ హైస్కూల్‌పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో నృపతుంగ హైస్కూల్ 19-6తో జీపీఎస్‌పై, హారో హైస్కూల్ 19-7తో నవ్య గ్రామర్ స్కూల్‌పై, సెయింట్ పీటర్స్ హైస్కూల్ 10-7తో జీజీహెచ్ఎస్ (అంబర్‌పేట)పై గెలుపొందాయి. ఇతర మ్యాచ్‌ల వివరాలు అండర్ -17 బాలురు: జీబీహెచ్ (కాచిగూడ) 19-8తో రిషి విద్యాలయపై, హెచ్‌పీఎస్ (రామంతపూర్) 11-7తో కేశవ్ మెమోరియల్ స్కూల్(ఇంగ్లీష్ మీడియం)పై, పీపుల్స్ హైస్కూల్ 15-3తో శ్రీ సత్యసాయి స్కూల్(విద్యానగర్)పై, గాంధీ హైస్కూల్ 10-3తో సెయింట్ అగస్టీన్ హూస్కూల్పై, భరత్ స్కౌట్స్, గైడ్స్ హైస్కూల్ 9-6తో సెయింట్ ఫిలిప్స్ స్కూల్‌పై విజయం సాధించాయి. అండర్-14 బాలురు: జీబీహెచ్ ఎస్ (కాచిగూడ) 10-3తో భాష్యం హైస్కూల్‌పై, భరత్ హైస్కూల్ 21-6తో సెయింట్ పీటర్స్ ైెహ స్కూల్‌పై, శ్రీ సత్యసాయి విద్యా విహార్ 10-6తో కోర్ మోడల్ హైస్కూల్‌పై, హుడా హైస్కూల్ 14-12తో సెయింట్ అగస్టీన్ హైస్కూల్‌పై, హారో హైస్కూల్ 5-3తో ప్రభుత్వ పోలీస్ బాలుర స్కూల్‌పై, నవ్య గ్రామర్ హైస్కూల్ 18-4తో సీపీఎల్ (అంబర్‌పేట)పై విజయం సాధించాయి. అండర్-14 బాలికలు: అజంపురా హైస్కూల్ 15-5తో సీపీఎల్ అంబర్పేటపై, జీబీహెచ్‌ఎస్, కాచిగూడ 18-0తో సెయింట్ అగస్టీన్‌పై, భాష్యం హైస్కూల్ 15-5తో ఆర్పీహెచ్ఎస్పై నెగ్గాయి. -
కబడ్డీకి పెరిగిన ప్రేక్షకాదరణ
న్యూఢిల్లీ: కబడ్డీ కూత కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏటికేడు టీవీ వీక్షకుల సంఖ్యను అమాంతం పెంచుకుంటోంది. తాజాగా ముగిసిన నాలుగో సీజన్ కబడ్డీ లీగ్‌ను సగటున కోటి మంది వీక్షించినట్లు అంచనా. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ -1 నుంచి సీజన్-4 ముగిసే సరికి వీక్షకుల సంఖ్య 51 శాతం పెరిగింది. పురుషులతో పాటు మహిళా కబడ్డీకి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు అక్టోబర్‌లో కబడ్డీ ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 12 దేశాలు తలపడతాయి. ‘ పురుషుల, మహిళల కబడ్డీకి భారత్‌లో గొప్ప ఆదరణ కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. ప్రేక్షకాదరణతో స్పాన్సర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఏటికేడు స్పాన్సర్షిప్ పెరుగుతుండటం సంతోషకరం’ అని స్టార్ స్పోర్ట్స్ సీఈవో నితిన్ కుక్రేజా అన్నారు. -
మాతోనా గేమ్స్!
హ్యూమర్ ‘‘మానవులకు కబడ్డీ అనే ఆట నేర్పింది మేమే. అసలు కబడ్డీ అనే ఆటకు మూలం మా జాతే తెలుసా? ’’ అంది కోడి పుంజు. ‘‘అదెలా?’’ అడిగాయి మిగతా పక్షులూ, జంతువులు. ‘‘కాదు... నేను కూత పెట్టడం చూసి... నన్ను ఇమిటేట్ చేయడానికి తామూ కూత పెట్టాలని మనుషులు అనుకున్నారు. కూత ఆగితే ఓడిపోయినట్టే అన్న అంశం ఆధారంగా వాళ్లు కబడ్డీని కనిపెట్టారు. మనుషులు స్వార్థపరులు. మా కోడి జాతికి తగినంత పేరు దక్కడం ఇష్టం లేక ఈ విషయాన్ని లోకానికి తెలియనివ్వ లేదు’’ అంది కోడిపుంజు. జంతువులూ - పక్షులూ కాస్త పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నాయి. మాటల్లో ఇటీవల కబడ్డీకి చాలా ఆదరణ వచ్చిందని ఎవరో టాపిక్ తెచ్చారు. అలా... కబడ్డీకి తమ కంట్రిబ్యూషన్ ఏమిటో కోడిపుంజు చెప్పింది. ‘‘ఆ మాటకొస్తే మనుషులకు జిమ్నాస్టిక్స్ నేర్పింది మేమే’’ అంది పిల్లి. ‘‘ఇదే మాట కోతి అంటే నమ్మేవాళ్లం. కానీ నువ్వు చెబితే నమ్మడం కాస్త కష్టమే. మనుషులకు నవ్వడం నేనే నేర్పానంటే ఎంత ఎబ్టెట్టుగా ఉంటోందో ఇదీ అంతే’’ అంది హైనా. ‘‘పిచ్చి జంతువుల్లారా... జిమ్నాస్టిక్స్‌కు మొదటి స్టెప్పు మా నుంచి మానవులు నేర్చుకున్నారు. అందుకే మా గౌరవర్థమే వాటికి ‘పిల్లిమొగ్గలూ... పిల్లిగంతులూ’ అని మా పేరు పెట్టుకున్నారు తెల్సా’’ గొప్పలు పోయింది పిల్లి. ‘‘అన్నట్టు కుస్తీ పట్టడం అన్నది మాదగ్గర్నుంచే మానవులు నేర్చుకున్నారు. ముట్టె కిందికి వంచి ఒకదానికి ఒకటి తాటించి మేం తోసుకుంటూ ఉంటాం కదా. అది చూసే మనుషులు రెజ్లింగ్ నేర్చుకున్నారు’’ అని కొండ గొర్రె మధ్యలో తన గొప్ప చెప్పుకోబోయింది. ఈ విషయంలో కొండ గొర్రెలకూ, కొమ్ము జింకలకూ కాస్త అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ ఈలోపు మధ్యలో అడవి దున్న జోక్యం చేసుకొని... ‘‘కాస్తంత తేడాలున్నా మీరు రెండూ ఒకే జాతి. కాబట్టి మీరిలా కుస్తీ పట్లు పట్టకండి. ఒకటి మాత్రం నిజం. మమ్మల్ని చూసే కుస్తీ వస్తాదులు ఒళ్లు పెంచారేమో. సూమో ఫైటర్లను చూశాక ఆ ప్రక్రియకు కారణం మేమేనని కచ్చితంగా తెలుస్తోంది’’ అని తన వాదనకు సాక్ష్యాధారాలను చూపించింది దున్న. కుస్తీ విషయంలో కొండగొర్రెలూ, కొమ్ముజింకలూ ఘర్షణపడుతున్నప్పుడు ఎంటరైంది అశ్వం. ‘‘ పేటెంట్ కోసం కొట్టుకునే తుచ్ఛమానువుల్లా ఎందుకలా దెబ్బలాడుకుంటారు? ఒక పని చేయండి. కుస్తీ కనిపెట్టిన క్రెడిట్టు గొర్రెలకు ఇచ్చేద్దాం. లాంగ్ జంప్ జింకలకు కేటాయిద్దాం. మేం ఏ పని చేసినా అంతే... మనుషులు కనిపెట్టారనుకున్న చందరంగం ఎవరిదనుకుంటున్నారు. మాదే! కాకపోతే పాపం... ఆ ఆటలో అటు ఒంటెలనూ, ఏనుగులనీ కలుపుకుపొమ్మని మనుషులకు సలహా ఇచ్చాం. వాళ్లకు అది నచ్చి ఆ ఆటలో మిగతా జంతువుల కంటే మాకే ఎక్కువ క్రెడిట్ ఇచ్చారు. అంతెందుకు వాళ్ల రాజూ, మంత్రి కంటే మాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు’’ అంటూ ఇకిలిస్తూ, సలికిలించింది గుర్రం. అదలా మాట్లాడుతుండగానే ‘‘గుర్రంగారు... లేనిపోని గొప్పలకు పోకండి. మీరు చెబుతుంటే ఇప్పుడే గుర్తొచ్చింది. మనిషికి అష్టా.. చెమ్మా నేర్పింది నేనే. అలా కిందా మీదా పడి పోతూ, నా సాయంతో ఐదు గళ్లు గీసి ఆడమని చెప్పా. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఎనిమిది గళ్లను పెంచుకున్నాడు మానవుడు. మీరు చెప్పిన చదరంగం అష్టచెమ్మ తర్వాతే’’ అంటూ గుర్రం పట్ల, చెస్సు పట్ల కాస్త కస్సుబుస్సులాడింది గవ్వ. ‘‘అసలు మనుషులకు బాణ విద్యను నేర్పింది ఎవరనుకుంటున్నారు. మేమే అంది’’ ఊసరవెల్లి. ‘‘నక్కను చూసి వాళ్లు గోతి కాడ కాచుకొని ఉండటం నేర్చుకుంటారంటే నమ్ముతాను. నిన్ను చూసి వాళ్లు నేర్చుకుంది రంగులు మార్చడం కదా! ఒళ్లు కదలకుండా ఉండే నీకూ బాణవిద్యకూ అసలు సంబంధం ఏముంది?’’ అడిగింది తోడేలు. ‘‘మీరెంత అమాయకులు... అసలు నా నాలుకను చూశాకే కదా మనిషి బాణం కనిపెట్టింది’’ అంది ఊసరవెల్లి. ‘‘ఆపండెహె... మనుషులవి సిగ్గుపడాల్సిన బతుకులు. వాళ్లకు కుట్టడం నేర్పిందే నేను. నా నుంచి కుట్టడం... అనగా టైలరింగ్ నేర్చుకుని బట్టలేసుకొని తమ లోపాలను కప్పిపుచ్చుకుంటూ ఒళ్లు దాచుకొని బతుకుతున్నారు. వాళ్లకు అవి నేర్పాం... ఇవి నేర్పాం అంటూ మీరూ సిగ్గులేకుండా చెప్పుకోవద్దు... మనమూ బట్టలేసుకునే పరిస్థితి రానిచ్చుకోవద్దు. వాళ్లకు అందం లేదు కాబట్టి బట్టలు అవసరమయ్యాయి. దయచేసి వాళ్లతో సమానం కాకండి. అలా మీరు తొడుక్కోవాలనుకుంటే కుట్టకుండానే నా కుబుసం రెడీ’’ అంటూ పాము బుసబుసలాడింది. కింగ్ కోబ్రా కసిరికొట్టడంతో జంతువులన్నీ సెలైంటైపోయియి. మనిషిలా పక్కదార్లు పట్టకుండా వాటి దారిన అవి వెళ్లిపోయాయి. - యాసీన్ -
భారత్‌లో కబడ్డీ వరల్డ్‌కప్
న్యూఢిల్లీ: కబడ్డీ అభిమానులను త్వరలోనే మరో ఈవెంట్ అలరించనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కబడ్డీ ప్రపంచకప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం 12 దేశాలు పాల్గొననున్న ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇరాన్, పోలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కొరియా, జపాన్, కెన్యా దేశాల జట్లు ఈ ప్రపంచకప్‌లో తలపడనున్నాయి. ‘2016 కబడ్డీ ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఈ టోర్నీ ద్వారా విశ్వవ్యాప్తంగా కబడ్డీకి ఆదరణను కల్పిస్తాం’ అని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గె హ్లాట్ అన్నారు.