విద్యార్థులతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే సీతక్క | MLA Seethakka Participate Kabaddi Play With Gurukul Students | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సీతక్క.. కబడ్డీ, కబడ్డీ..!

Aug 23 2019 3:09 PM | Updated on Aug 23 2019 6:28 PM

MLA Seethakka Participate Kabaddi Play With Gurukul Students - Sakshi

విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యే కబడ్డీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

సాక్షి, వరంగల్ : సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేసే ములుగు ఎమ్మెల్యే సీతక్క తాజాగా కబడ్డీ ఆడారు. ములుగు మండలం జాకారంలోని బాలికల మినీ గురుకుల పాఠశాలలో శుక్రవారం ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ డే’  వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టుదలతో విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఆకాక్షించారు. చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని అన్నారు. ఇక ఎమ్మెల్యే కబడ్డీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.



Advertisement
 
Advertisement
Advertisement