కాస్త సరదాగా...
సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్... క్యారికేచర్ ట్రెండ్. పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీలో క్యారికేచర్‌లలోకి మార్చడమే ఈ ట్రెండ్ సారాంశం. వ్యక్తిత్వం నుంచి అభిరుచుల వరకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా క్యారికేచర్‌లను రూపొందిస్తున్నారు. ఈ కార్టూన్–స్టైల్ ఇమేజ్‌లు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్‌లో భాగం కావడానికి డ్రాయింగ్ స్కిల్స్, డిజైన్ సాఫ్ట్‌వేర్, ఎడిటింగ్ ఎక్స్‌పీరియెన్స్‌లాంటివేమీ అవసరం లేదు. జస్ట్... ఆసక్తి ఉంటే చాలు!
మీరు కూడా ఈ ట్రెండ్‌లో భాగం కావాలనుకుంటే... ఇలా చేయండి:
→ చాట్‌జీపీటీ ఒపెన్ చేసి లేటెస్ట్ వెర్షన్ (జీపీటి–4వో) ఎంపిక చేసుకోవాలి.
→ స్పష్టమైన, ఫ్రంట్–పేసింగ్ సెల్ఫీ లేదా ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
→ ‘క్రియేట్ ఏ క్యారికేచర్ ఆఫ్ మై మీ’... ఇలా ఇన్‌పుట్ ఇవ్వాలి.
→ మీ వృత్తి, అభిరుచులకు సంబంధించిన వివరాలను యాడ్ చేయాలి.
→ ఇమేజ్ జనరేట్ అయిన తరువాత డౌన్‌లోడ్ చేసుకోవాలి.


