ఇదిగో...  బ్లింకిబాండ్‌ | Rajasthan man delivers Blinkit order on horse | Sakshi
Sakshi News home page

ఇదిగో...  బ్లింకిబాండ్‌

Feb 27 2026 6:18 AM | Updated on Feb 27 2026 6:18 AM

Rajasthan man delivers Blinkit order on horse

సమ్‌థింగ్‌ స్పెషల్‌

‘గుర్రాలు సినిమాలలో మాత్రమే కనిపిస్తాయి’ అనుకునే వరకు వచ్చింది పరిస్థితి. అయితే నిత్యజీవితంలో ఎక్కడో ఒకచోట అవి మనుషులకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. తాజా విషయానికి వస్తే... రాజస్థాన్‌లోని ఒక హైవేపై బ్లింకిట్‌ డెలివరీ బ్యాగ్‌ను గుర్రంపై మోసుకెళ్తున్న వృద్ధుడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కంటెంట్‌ క్రియేటర్‌ కపిల్‌ బిష్ణోయ్‌ ఈ వీడియో క్లిప్‌ను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశాడు.

‘ఇది రాజస్థాన్‌! యువకులకు గుర్రాన్ని స్వారీ చేసే అవకాశం ఇవ్వకుండా వృద్ధులు ఆన్‌లైన్‌ డెలివరీ చేస్తున్నారు’ అని సరదాగా తన క్యాప్షన్‌లో రాశాడు కపిల్‌.
‘ఆధునిక రహదారిపై గుర్రపు డెక్కల లయబద్ధమైన సంగీతం మాత్రమే వినిపిస్తుంది. ఎలాంటి గందరగోళం, హడావిడీ కనిపించదు’ అనుకునేలా చేసిన ఈ తొమ్మిది సెకన్‌ల వీడియోను చూసి నెటిజనులు ‘వావ్‌’ అనడమే కాదు... ‘కార్లు, బైక్‌ల వల్ల ట్రాఫిక్‌ జామ్‌ సమస్యతోపాటు పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. 
ఈ నేపథ్యంలో గుర్రాలు పర్యావరణానికి హాని కలిగించని అద్భుతమైన రవాణా సాధనాలు’ అంటున్నారు కొందరు. ‘బ్లింకిట్‌’ను ‘జేమ్స్‌బాండ్‌’ ను కలిపి ‘బ్లింకిబాండ్‌’ అని నామకరణం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement