Viral: కబడ్డీ ఆడిన బీజేపీ మహిళా ఎంపీ

BJP MP Pragya Singh Thakur Played Kabaddi At Bhopal - Sakshi

భోపాల్‌: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే భోపాల్‌ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ సరదాగా కబడ్డీ ఆడారు. ఆమె కబడ్డీ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం ఆమె భోపాల్‌లోని ఓ కాళీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె యువతుల కబడ్డీ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీని మహిళా క్రీడాకారులు కబడ్డీ ఆడాల్సిందిగా కోరారు.

దీంతో ఆమె కొర్టులోకి అడుగుపెట్టి కబడ్డీ ఆడారు. ప్రస్తుతం ఆమె వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌పై బయటకు వచ్చారు. 2008 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని మాలేగావ్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న పేలుళ్లలో ఎంపీ సాధ్వి నిందితురాలు ఉన్న విషయం తెలిసిందే.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top