దక్షిణ కొరియాతో మ్యాచ్‌ డ్రా | Match Drawn between South korea and Telanganas friendly match | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియాతో మ్యాచ్‌ డ్రా

Jun 15 2018 10:20 AM | Updated on Jun 15 2018 10:20 AM

Match Drawn between South korea and Telanganas friendly match - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు దక్షిణ కొరియా కబడ్డీ జట్లు ప్రాక్టీస్‌ కోసం నగరానికి తరలివచ్చాయి. అమెచ్యూర్‌ కబడ్డీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని కాసాని జె.ఎస్‌ గెహ్లాట్‌ కబడ్డీ అకాడమీలో తెలంగాణ పురుషుల, మహిళల, దక్షిణకొరియా పురుషుల, మహిళల జట్ల మధ్య ఈ నెల 18 వరకు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

తెలంగాణ పురుషుల, దక్షిణ కొరియా పురుషుల జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌ 38–38 పాయింట్లతో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా శాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తెలంగాణ క్రీడాకారులకు ఇది చక్కటి అవకాశం. అంతర్జాతీయ ఆటగాళ్లతో ఆడే అవకాశం లభించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా తెలంగాణ కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి, ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌రావు, జగ్మోహన్, జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement