ముగిసిన ఏఎన్‌యూ మహిళా కబడ్డీ శిక్షణ | anu internal women kabaddi end | Sakshi
Sakshi News home page

ముగిసిన ఏఎన్‌యూ మహిళా కబడ్డీ శిక్షణ

Dec 12 2016 10:34 PM | Updated on Sep 4 2017 10:33 PM

ముగిసిన ఏఎన్‌యూ మహిళా కబడ్డీ శిక్షణ

ముగిసిన ఏఎన్‌యూ మహిళా కబడ్డీ శిక్షణ

గుంటూరు రూరల్‌ ః తాడికొండ మండలంలోని లాం గ్రామంలోగల చలపతి ఫార్మసీ కళాశాలలో 15 రోజులుగా జరుగుతున్న ఏఎన్‌యూ అంతర్‌ కళాశాలల్లో ఎంపికయిన సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీకి వెళ్ళే మహిళా కబడ్డీ క్రీడాకారుల శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి.

 
 
గుంటూరు రూరల్‌ ః తాడికొండ మండలంలోని లాం గ్రామంలోగల చలపతి ఫార్మసీ కళాశాలలో 15 రోజులుగా జరుగుతున్న ఏఎన్‌యూ అంతర్‌ కళాశాలల్లో ఎంపికయిన సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీకి వెళ్ళే మహిళా కబడ్డీ క్రీడాకారుల శిక్షణ  తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాదెండ్ల రామారావు మాట్లాడుతూ 15 రోజులపాటు శిక్షణ తీసుకున్న అభ్యర్థినులు తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల భారతీయ యూనివర్సిటీలో ఈ నెల 14 నుంచి 17వరకూ జరిగే అంతర్‌ యూనివర్సిటీల (సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ) పోటీల్లో పాల్గొంటారన్నారు.  కళాశాల పిజికల్‌ డైరెక్టర్‌ పీ భానుప్రకాష్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement