చాంపియన్స్‌ భారత్‌ | Indian womens and mens teams emerge victorious at Commonwealth Kabaddi Championship | Sakshi
Sakshi News home page

చాంపియన్స్‌ భారత్‌

Nov 1 2026 3:37 AM | Updated on Nov 1 2026 3:37 AM

Indian womens and mens teams emerge victorious at Commonwealth Kabaddi Championship

మహిళల, పురుషుల కామన్వెల్త్‌ కబడ్డీ టైటిల్స్‌ సొంతం

అహ్మదాబాద్‌: కామన్వెల్త్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల, పురుషుల జట్లు విజేతగా నిలిచాయి. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌ మహిళల ఫైనల్లో శనివారం భారత్‌ 35–15 పాయింట్ల తేడాతో ఉగాండాపై గెలిచింది. స్టార్‌ ప్లేయర్‌ సాక్షి 10 రెయిడ్స్‌లో 9 పాయిట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అను 6 పాయింట్లు, నిధి శర్మ 5 పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్‌లో రితూ, సుమన్‌ చెరో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. 

పురుషుల విభాగంలో భారత్‌ 54–20 పాయింట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసి చాంపియన్‌గా అవతరించింది. ఆదిత్య షిండే సూపర్‌–10 నమోదు చేసుకోగా... భరత్‌ హూడా 8 పాయింట్లు సాధించాడు. పంకజ్‌ మోహిత్‌ (6 పాయింట్లు), నవీన్‌ కుమార్‌ (5 పాయింట్లు), యోగేశ్‌ దహియా (5 పాయింట్లు) రాణించారు. ఇటీవల ఆసియా క్రీడల్లో పసిడి పతకం ఖాతాలో వేసుకున్న భారత జట్లకు ఈ టోర్నమెంట్‌లో పెద్దగ ప్రతిఘటన ఎదురుకాలేదు. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ మన జట్లు ఘనవిజయాలు సాధించడం విశేషం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement