ముగిసిన ఆసియా గేమ్స్‌.. భార‌త్‌కు నాలుగో స్థానం | Asian Games-2026: India-85 Medals-Stands-4th Position-Fails-Touch-100 | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆసియా గేమ్స్‌.. భార‌త్‌కు నాలుగో స్థానం

Oct 3 2026 10:33 PM | Updated on Oct 3 2026 10:49 PM

Asian Games-2026: India-85 Medals-Stands-4th Position-Fails-Touch-100

ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ అధ్యాయం ముగిసింది. శ‌నివారంతో అన్ని ఈవెంట్ల‌ను పూర్తి చేసుకున్న భార‌త్ 85 ప‌త‌కాల‌తో ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో నిలిచి గేమ్స్‌ను ముగించింది. ఈ 85 ప‌త‌కాల్లో 21 స్వ‌ర్ణాలు, 27 ర‌జ‌తాలు, 37 కాంస్యాలున్నాయి. అయితే 2023 ఆసియా గేమ్స్‌లో వంద ప‌త‌కాల మార్క్‌ను దాటిన భార‌త్ ఈసారి ఆ మార్క్‌కు 15 ప‌త‌కాల దూరంలో నిలిచిపోయింది. 

అయితే క‌బ‌డ్డీ, హాకీ, క్రికెట్‌లో మాత్రం రెండు విభాగాలు (మ‌హిళ‌లు, పురుషులు) స్వ‌ర్ణాలతో మెర‌వ‌గా, ఆర్చ‌రీ, అథ్లెటిక్స్ విభాగంలోనూ మ‌నోళ్లు అద‌ర‌గొట్టారు. ఇక చివ‌రిరోజైన శ‌నివారం భార‌త్ ఖాతాలో రెండు స్వ‌ర్ణాలు, ఒక ర‌జ‌తం, మ‌రో కాంస్యం వ‌చ్చి చేరాయి. 2023లో నాలుగో స్థానంలో నిలిచిన‌ప్ప‌టికీ 106 ప‌త‌కాలు సాధించింది. 

ఈసారి కూడా నాలుగో స్థానంలోనే నిలిచిన‌ప్ప‌టికీ ప‌త‌కాలు మాత్రం బాగా త‌గ్గిపోయాయ‌ని చెప్పొచ్చు. ఇక ఈసారి క్రీడల్లో అత్యధిక పతకాలతో చైనా, జపాన్, దక్షిణ కొరియాలు వరసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 85 పతకాలతో భారత్ నాలుగో ప్లేస్‌లోఉండగా.. 56 మెడల్స్‌ గెలిచిన ఉజ్బెకిస్థాన్ ఐదో స్థానంతో టోర్నీని ముగించింది. ఇక 2030లో జ‌ర‌గ‌నున్న ఆసియా గేమ్స్‌కు ఖ‌తార్‌లోని దోహా వేదిక కానుంది.

అత్య‌ధిక ప‌త‌కాలు సాధించిన టాప్‌-5 దేశాలు..
👉చైనా – 169 స్వర్ణాలు, 89 రజతాలు, 83 కాంస్యాలు – 341 పతకాలు
👉జపాన్ – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 269 పతకాలు
👉దక్షిణ కొరియా – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 150 పతకాలు
👉భారత్‌ – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 85 పతకాలు
👉ఉబ్జెకిస్థాన్ – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 56 పతకాలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement