Photo Credit: Twitter
ఆసియా గేమ్స్ 2026లో స్వర్ణ పతకం సాధించిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న వాషింగ్టన్ సుందర్‌కు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్వర్ణ పతకం గెలుచుకున్న సుందర్‌కు రూ. 75 లక్షల రివార్డు ప్రకటించినట్లు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తెలిపారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎస్‌డీఏటీ) ద్వారా సుందర్‌కు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు.
ఇక పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో వాషింగ్టన సుందర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసిన సుందర్ కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. లక్ష్యానికి 19 దూరంలో పాకిస్తాన్ నిలిచిపోవడం వెనుక సుందర్ కీలకపాత్ర వహించాడు. తద్వారా భారత్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. పాక్ రజతానికే పరిమితమైంది. 2023లో రుతురాజ్ సారథ్యంలోనూ టీమిండియా గోల్డ్ మెడల్ అందుకున్న సంగతి తెలిసిందే.
సీఎం విజయ్ స్పందిస్తూ.. "జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి చారిత్రక ఘనత సాధించిన టీమిండియాకు, జట్టులో సభ్యుడైన తమిళనాడుకు చెందిన క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌కు నా హృదయపూర్వక అభినందనలు. సుందర్ సాధించిన ఈ ఘనతను ప్రశంసిస్తూ, తమిళనాడు ప్రభుత్వం తరఫున ₹75 లక్షల ప్రతిష్టాత్మక నగదు బహుమతిని అందజేయడం జరుగుతుంది. ఆయన విజయం యువతరానికి కొత్త స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. దేశం తరఫున సుందర్ క్రికెట్ మ్యాచ్‌లలో రాణించి, మరెన్నో మైలురాళ్లను సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను." అని చెప్పుకొచ్చారు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (61), తిలక్ వర్మ (51 నాటౌట్) అర్థసెంచరీలు చేయగా, శివమ్ దూబే (27), ఇషాన్ కిషన్ (20) రాణించారు. పాక్ బౌలర్లలో అహ్మద్ దనియాల్, అరాఫత్ మిన్హస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకు పరిమితమైంది. హసన్ నవాజ్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, సయీమ్ అయూబ్ (29) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, సుందర్, శివమ్ దూబే తలా రెండు వికెట్లు తీశారు.
ஜப்பானில் நடைபெற்றுவரும் 20-வது ஆசிய விளையாட்டுப் போட்டிகளில், ஆடவர் கிரிக்கெட் பிரிவில் தங்கப் பதக்கம் வென்று சாதனை படைத்துள்ள இந்திய ஆடவர் அணிக்கும், அவ்வணியில் இடம்பெற்றுள்ள தமிழ்நாட்டைச் சேர்ந்த கிரிக்கெட் வீரர் வாஷிங்டன் சுந்தர் அவர்களுக்கும் எனது மனமார்ந்த வாழ்த்துகளையும்,… pic.twitter.com/dZqIKrHujI
— CMOTamilNadu (@CMOTamilnadu) October 3, 2026
ఇదీ చదవండి: విరాట్ కోహ్లి చెత్త రికార్డు


