చ‌రిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. తొలి ఇండియన్‌గా | Vaibhav Sooryavanshi Becomes Youngest Indian Athlete To Win Gold In Asian Games History | Sakshi
Sakshi News home page

IND vs PAK: చ‌రిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. తొలి ఇండియన్‌గా

Oct 3 2026 3:48 PM | Updated on Oct 3 2026 3:57 PM

Vaibhav Sooryavanshi Becomes Youngest Indian Athlete To Win Gold In Asian Games History

PC: BCCI/X

ఏషియ‌న్ గేమ్స్‌-2026 క్రికెట్ టోర్నీ విజేత‌గా టీమిండియా నిలిచింది. శ‌నివారం జ‌రిగిన ఫైన‌‌ల్లో పాకిస్తాన్‌పై 19 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన భార‌త్‌.. వ‌రుస‌గా రెండో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకుంది. ఈ తుది పోరులో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 211 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. 

భారత బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ (61), తిలక్‌ వర్మ (51) అద్భుతమైన అర్ధ శతకాలతో (హాఫ్ సెంచరీ) మెరిశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్‌ యువ ఆటగాడు హసన్‌ నవాజ్‌ (51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 96) వీరోచిత పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. పాక్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

వైభవ్ అరుదైన ఘనత
ఈ మ్యాచ్ అనంతరం విజేతలైన భారత ఆటగాళ్లకు ఐసీసీ చైర్మన్ జై షా స్వర్ణ పతకాలను అందజేశారు. ఈ క్రమంలో టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన యంగెస్ట్ భారత అథ్లెట్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు.

అంతకుముందు ఈ రికార్డు షూటర్ సౌరభ్ చౌదరి పేరిట ఉండేది. 2018 జకార్తా ఆసియా క్రీడలలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 16 ఏళ్ల వయస్సులో సౌరభ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులోనే పసిడి పతకం సాధించి సౌరభ్ రికార్డును బ్రేక్ చేశాడు.
చదవండి: IND vs WI: రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement