PC: BCCI/X
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. వెస్టిండీస్ పేసర్ జైడెన్ సీల్స్ అద్భుతమైన బంతితో కోహ్లీని బోల్తా కొట్టించాడు. అతడి ధాటికి విరాట్ ఖాతా తెరవకుండానే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన సీల్స్.. మూడో బంతికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని అభిమానులు భావించారు. కానీ, సీల్స్ వేసిన తదుపరి బంతికే విరాట్ వద్ద సమాధానమే లేకుండాపోయింది.
సీల్స్ ఆ ఓవర్ నాలుగో బంతిని మిడిల్ స్టంప్ లైన్ దిశగా సంధించాడు. అయితే ఆ బంతిని కోహ్లి ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి లైన్‌ను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్‌ను మిస్సై మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టింది. దీంతో మైదానమంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli 0(1) ball by ball highlights pic.twitter.com/kfp9prvnSu
— Nilesh 🥀 (@WhyNiluYaar) October 3, 2026


