breaking news
Jayden Seales
-
చరిత్ర సృష్టించిన జేడన్ సీల్స్.. ‘తొలి బౌలర్’గా రికార్డు
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ‘పనిభారం’ గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంటే.. మరోవైపు.. వెస్టిండీస్ పేస్ సంచలనం జేడన్ సీల్స్ (Jayden Seals) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn)పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సీల్స్ బద్దలు కొట్టాడు.202 పరుగుల తేడాతో పాక్ చిత్తుకాగా వెస్టిండీస్ సొంతగడ్డ మీద మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడింది. తొలుత టీ20 సిరీస్‌లో పాక్ చేతిలో 2-1తో ఓటమిపాలైనన కరేబియన్లు.. వన్డే సిరీస్‌ను మాత్రం 2-1తో కైవసం చేసుకున్నారు. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో పర్యాటక పాక్‌ను ఏకంగా 202 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ మేర సిరీస్‌ను గెలుచుకుంది.నలుగురిని డకౌట్ చేశాడుఈ విజయంలో జేడన్ సీల్స్ది కీలక పాత్ర. వెస్టిండీస్ విధించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు సీల్స్ చుక్కలు చూపించాడు. ఓపెనర్లు సయీమ్ ఆయుబ్, అబ్దుల్లా షఫీక్‌లను డకౌట్ చేసిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. బాబర్ ఆజం (9), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (0)లను కూడా వెనక్కి పంపాడు.అదే విధంగా.. టెయిలెండర్లు నసీం షా (6), హసన్ అలీ (0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 7.2 ఓవర్లు మాత్రమే బౌల్ చేసిన జేడన్ సీల్స్.. కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి విండీస్‌కు ఏకపక్ష విజయం అందించాడు.పాక్‌తో వన్డేలలో తొలి బౌలర్‌గా అరుదైన ఘనతఈ క్రమంలోనే డేల్ స్టెయిన్ పేరిట ఉన్న రికార్డును జేడన్ సీల్స్ బద్దలు కొట్టాడు. 2012లో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో వన్డేల్లో స్టెయిన్ 39 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. సీల్స్ ఇప్పుడు ఆ రికార్డును తిరగరాశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సీల్స్ ఆరు వికెట్లతో చెలరేగగా.. గుడకేశ్ మోటి రెండు, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ పడగొట్టడంతో.. 29.2 ఓవర్లలో కేవలం 92 పరుగులే చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా 202 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. కాగా 34 ఏళ్ల తర్వాత విండీస్ చేతిలో పాక్ వన్డే సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి.ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో భారత ప్రధాన పేసర్ బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడిపై పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్పై విమర్శలు వస్తున్నాయి. ఇక బుమ్రా తదుపరి ఆసియా కప్-2025 బరిలో దిగాల్సి ఉంది. అనంతరం స్వదేశంలో టీమిండియా వెస్టిండీస్‌తో టెస్టుల్లో తలపడనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న జేడన్ సీల్స్ ఈ సిరీస్‌లో విండీస్‌కు కీలకం కానున్నాడు.పాకిస్తాన్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు వీరే..👉జేడన్ సీల్స్- వెస్టిండీస్- 6/18👉డేల్ స్టెయిన్- సౌతాఫ్రికా- 6/39👉తిసారా పెరీరా- శ్రీలంక- 6/44👉కార్ల్ రాకెర్మాన్- ఆస్ట్రేలియా- 5/16👉సౌరవ్ గంగూలీ- ఇండియా- 5/16.చదవండి: IPL 2026: ‘ఈసారి వేలంలో ఖరీదైన ప్లేయర్‌గా అతడే’ -
జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
జేడన్ సీల్స్. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్లో తరుచూ వినిపిస్తున్న పేరు. ఈ విండీస్ నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఈ ఏడాదిలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తూ బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల ట్రినిడాడియన్ బౌలర్ ఈ ఏడాదే లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. సీల్స్ ఈ ఏడాది 8 వన్డేల్లో 18 వికెట్లు.. 21 టెస్ట్‌ల్లో 88 వికెట్లు తీశాడు.తాజాగా పాకిస్తాన్‌పై సంచలన ప్రదర్శనతో సీల్స్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాక్‌తో నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సీల్స్ 7.2 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. ఫలితంగా పాక్ విండీస్ నిర్దేశించిన 295 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 92 పరుగులకే కుప్పకూలింది.ఈ ఇన్నింగ్స్‌లో సీల్స్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేశాడు. సీల్స్ దెబ్బకు పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో డకౌటైన ఐదుగురు ఆటగాళ్లలో సీల్స్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు. సీల్స్ బౌలింగ్‌లో పాక్ ఆటగాళ్లు బంతి బంతికి గండాన్ని ఎదుర్కొన్నారు. బంతిని వదిలేసినా సమస్యే, ఆడాలని ప్రయత్నించినా సమస్యే.సీల్స్ ప్రదర్శనలు ఈ ఏడాదంతా ఇలాగే కొనసాగాయి. పాక్‌తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సీల్స్ వేసిన స్పెల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పెల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ సంచలన ప్రదర్శనల అనంతరం సీల్స్ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మరో పేసు గుర్రం వచ్చిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. విండీస్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటంచనుండగా సీల్స్‌పై ఫోకస్ మరింత పెరిగింది. వరల్డ్ క్లాస్ భారత బ్యాటర్లను అతను ఏ మేరకు నిలవరించగలడో అని చర్చలు మొదలయ్యాయి. సీల్స్ ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలంలోనూ హాట్ పిక్ అయ్యే అవకాశం ఉంది. అతడిని కేకేఆర్ తన్నుకుపోవచ్చు. ఎందుకంటే అతను కరీబియన్ లీగ్‌లో ఇదివరకే వారి సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నాడు.రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన సీల్స్ విండీస్ తరఫున ఇప్పటివరకు 21 టెస్ట్‌లు ఆడి మూడు 5 వికెట్ల ప్రదర్శనలతో 88 వికెట్లు తీశాడు. 25 వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 31 వికెట్లు తీశాడు. -
మరీ ఇంత చెత్తగా అవుటవుతారా?.. బిక్కముఖం వేసిన రిజ్వాన్
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో పాకిస్తాన్ (WI vs PAK) ఘోర పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 202 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తద్వారా కరేబియన్లు 2-1తో సిరీస్ గెలిచి.. 34 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్‌పై జయకేతనం ఎగురవేశారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఘోర వైఫల్యంపై అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆఖరి వన్డేలో దారుణంగా అవుటైన కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది.షాయీ హోప్ విధ్వంసకర అజేయ శతకంఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 294 పరుగులు సాధించింది. కెప్టెన్ షాయీ హోప్ (94 బంతుల్లో 120 నాటౌట్) విధ్వంసకర అజేయ శతకంతో పాటు.. రోస్టన్ ఛేజ్ (29 బంతుల్లో 36), జస్టిన్ గ్రీవ్స్ (24 బంతుల్లో 43 నాటౌట్) మెరుపుల కారణంగా విండీస్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.కుప్పకూలిన టాపార్డర్పాక్ బౌలర్లలో నసీం షా, అబ్రార్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీయగా.. సయీమ్ ఆయుబ్, మహ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. జేడన్ సీల్స్ ధాటికి ఓపెనర్లు సయీమ్ ఆయుబ్, అబ్దుల్లా షఫీక్ డకౌట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం 9 పరుగులకే నిష్క్రమించాడు.బిక్కముఖం వేసిన రిజ్వాన్ఆ తర్వాత కూడా జేడన్ సీల్స్ తన వికెట్ల వేట కొనసాగించాడు. అబ్దుల్లా షఫీక్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిజ్వాన్ ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. జేడన్ సీల్స్ సంధించిన ఇన్-స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన రిజ్వాన్.. బంతిని వదిలేశాడు. దీంతో అది అనూహ్య రీతిలో స్టంప్స్ పైభాగానికి తాకగా.. ఊహించని పరిణామంతో రిజ్వాన్ బిక్కముఖం వేశాడు.మరీ ఇంత చెత్తగా అవుటవుతారా?తన బంతిని అంచనా వేయడంలో విఫలమై డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో.. ‘‘ఈ ఏడాది మొత్తంలో ఇంత చెత్తగా బాల్‌ను వదిలేసిన ఆటగాడివి నువ్వే’’ అంటూ రిజ్వాన్‌పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు.. ‘ఇక రిటైర్ అయిపో’ అంటూ బాబర్ ఆజంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.ఇదిలా ఉంటే.. పాక్ టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్లో సల్మాన్ ఆఘా (30), మహ్మద్ నవాజ్ (23 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29.2 ఓవర్లలో 92 పరుగులకే పాకిస్తాన్ కుప్పకూలింది.విండీస్ బౌలర్లలో ఆరు వికెట్లతో చెలరేగిన జేడన్ సీల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. గుడకేశ్ మోటి రెండు, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్‌కు వెళ్లిన పాకిస్తాన్ జట్టు.. టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకుని.. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్Maulana Rizwan first ball Duck😭😭😭Imagine getting owned by West Indies and still dreaming about beating India pic.twitter.com/TzV2sp5Cnn— A (@chadniket) August 12, 2025