
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 68 పరుగుల వద్ద జైస్వాల్ (Yashasvi Jaiswal) (36), 90 పరుగుల వద్ద సాయి సుదర్శన్ (Sai Sudarshan) (7) ఔటయ్యారు. జైస్వాల్ తన సహజ శైలిలో ధాటిగా ఆడి జేడన్ సీల్స్ బౌలింగ్‌లో షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
జైస్వాల్ ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు బాదాడు. సాయి సుదర్శన్ విషయానికొస్తే.. మంచి ఫామ్‌లో ఉన్న ఇతను కేవలం 7 పరుగులే చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 26 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 92/2గా ఉంది. కేఎల్ రాహుల్ (40), శుభ్‌మన్ గిల్ (2) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 70 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.
మిగతా వారిలో జాన్ క్యాంప్‌బెల్ 8, తేజ్‌నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: IND VS WI 1st Test: ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా