IND VS WI 1st Test: ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసిన బుమ్రా | Jasprit Bumrah Equals Record For Fastest Indian Fast Bowler To 50 Test Wickets In Ahmedabad Test Against West Indies | Sakshi
Sakshi News home page

IND VS WI 1st Test: ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసిన బుమ్రా

Oct 2 2025 2:49 PM | Updated on Oct 2 2025 4:46 PM

IND VS WI 1ST TEST: BUMRAH BECAME THE JOINT FASTEST TO COMPLETE 50 WICKETS AT HOME BY INDIAN PACERS

అహ్మదాబాద్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్‌ 2) మొదలైన తొలి టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఓ ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో చెలరేగిన అతను.. స్వదేశంలో అత్యంత వేగంగా 50 టెస్ట్‌ వికెట్లు తీసిన భారత ఫాస్ట్‌ బౌలర్‌గా జవగల్‌ శ్రీనాథ్‌ (javagal Srinath) రికార్డును సమం చేశాడు. 

బుమ్రా, శ్రీనాథ్‌ తలో 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో కపిల్‌ దేవ్‌ (25), ఇషాంత్‌ శర్మ (27), మొహమ్మద్‌ షమీ (27) బుమ్రా, శ్రీనాథ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. భారత బౌలర్లు చెలరేగడంతో 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్‌ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్‌ (6.1-0-25-2), వాషింగ్టన్‌ సుందర్‌ (3-0-9-1) ధాటికి విండీస్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్‌ ఆటగాడు జస్టిన్‌ గ్రీవ్స్‌ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్‌ కాకుండా అలిక్‌ అథనాజ్‌ (12), బ్రాండన్‌ కింగ్‌ (13), కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (24), షాయ్‌ హోప్‌ (26), ఖారీ పియెర్‌ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. 

మిగతా వారిలో జాన్‌ క్యాంప్‌బెల్‌ 8, తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ డకౌట్‌, జోమెల్‌ వార్రికన్‌ 8, జోహన్‌ లేన్‌ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 

చదవండి: IND vs WI: వారెవ్వా బుమ్రా.. మిస్సైల్‌లా దూసుకొచ్చిన బంతి! ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement