2025 సంవత్సరం మరి కొద్ది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు ఆడబోయే మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం. 2026లో టీమిండియా చాలా బిజీగా గడపనుంది.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లు మొదలుకొని, స్వదేశంలోనే జరిగే టీ20 ప్రపంచకప్, ఆతర్వాత ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఆతర్వాత స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్.. ఆతర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్, దాని తర్వాత న్యూజిలాండ్ పర్యటన.. సంవత్సరాంతంలో స్వదేశంలోనే శ్రీలంకతో సిరీస్.. ఇలా, ఈ ఏడాదంతా టీమిండియా బిజీబిజీగా గడపనుంది.
వచ్చే ఏడాది టీమిండియా షెడ్యూల్ ఇదే...
జనవరి, 2026: న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా
3 వన్డేలు, 5 టీ20లు
ఫిబ్రవరి, మార్చి: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
మార్చి నుంచి మే మధ్యలో ఐపీఎల్ 2026
జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా
1 టెస్టు, 3 వన్డేలు
జూలైలో టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్
5 టీ20లు, 3 వన్డేలు
ఆగస్టులో టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక
2 టెస్టులు
సెప్టెంబర్‌లో టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (తటస్థ వేదిక)
3 టీ20లు
సెప్టెంబర్, అక్టోబర్‌లో వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా
3 వన్డేలు, 5 టీ20లు
సెప్టెంబర్ 19-అక్టోబర్ 4: ఆసియా క్రీడలు 2026
అక్టోబర్-నవంబర్‌లో టీమిండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్
2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు
డిసెంబర్‌లో శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా
3 వన్డేలు, 3 టీ20లు
* పైన తెలిపిన షెడ్యూల్‌లో ఇంకా కొన్నింటికీ పూర్తి ఆమోదం లభించలేదు.


