T20 WC 2026: స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం | England Beat Scotland By 5 Wickets In T20 World Cup 2026, Check Out Score Details And Highlights | Sakshi
Sakshi News home page

T20 WC 2026: స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం

Feb 14 2026 7:29 PM | Updated on Feb 14 2026 7:35 PM

T20 WC 2026: England beat Scotland by 5 wickets

టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శ‌నివారం కోల్‌క‌తా వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగులకు ఆలౌటైంది.

కెప్టెన్ రిచీ బెరింగ్టన్(49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మైకేల్ జోన్స్(33), బ్రూస్‌(24) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో అదిల్ ర‌షీద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్చ‌ర్, డాస‌న్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ త‌డ‌బ‌డిన‌ప్ప‌టికి, మిడిల్ ఆర్డర్ రాణించడంతో విజ‌యాన్ని అందుకుంది.

టామ్ బాంట‌న్‌(41 బంతుల్లో 63 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాట‌గా.. జాకబ్ బెథెల్(32), సామ్ కర్రన్(28) రాణించారు. స్కాట్లాండ్ బౌల‌ర్ల‌లో మెక్‌ముల్ల‌న్‌, బ్రాడ్‌ వీల్, కుర్రీ త‌లా వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్-సిలో ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరుకోగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement