భార‌త ఆట‌గాళ్ల‌తో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే | Ind Vs Pak T20 WC Clash, Pakistan Captain Salman Ali Agha Asked About Shaking Hands With Indian Players Amid Pre Match Tensions | Sakshi
Sakshi News home page

T20 WC 2026: భార‌త ఆట‌గాళ్ల‌తో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే

Feb 14 2026 4:56 PM | Updated on Feb 14 2026 5:01 PM

Pak Captain Salman Agha Asked About Shaking Hands With Indian Players.

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ పోరుకు స‌మయం అస‌న్న‌మైంది. టీ20  ప్ర‌పంచ‌క‌ప్-2026లో భాగంగా ఆదివారం దాయాది జ‌ట్లు తాడోపేడో తెల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాయి. ఇప్ప‌టికే కొలంబోకు చేరుకున్న ఇరు జ‌ట్లు.. శ‌నివారం సాయంత్రం త‌మ ప్రాక్టీస్ సెష‌న్ష్‌లలో పాల్గోనున్నాయి.

కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్‌ కెప్టెన్  సల్మాన్ అలీ ఆఘా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఆసియాక‌ప్‌లో చోటు చేసుకున్న హ్యాండ్ షేక్ వివాదంపై అఘా మాట్లాడాడు. దేశాల మ‌ధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా, మైదానంలో మాత్రం క్రీడా స్పూర్తిని ప్ర‌ద‌ర్శించాల‌ని ఆఘా చెప్పుకొచ్చాడు.

"క్రికెట్ ఎల్ల‌ప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఆడాలి. క్రీడ‌ల్లో రాజ‌కీయాల‌కు తావులేదు. క్రికెట్ ఒక‌ జెంటిల్‌మ్యాన్ గేమ్. ప్ర‌తీ ఒక్క‌రూ హుందాగా వ్య‌వ‌హ‌రించాలి" సల్మాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా రేప‌టి మ్యాచ్‌లో భారత్-పాక్ ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా అన్న ప్రశ్నకు.. "రేపు మీకే తెలుస్తుంది" అని సల్మాన్ సమాధానమిచ్చాడు. టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త్వ‌ర‌గా కోలుకోవాలని, రేపటి మ్యాచ్‌లో ఆడాలని తాను కోరుకుంటున్నట్లు అఘా తెలిపాడు.

కాగా పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిర‌స‌న‌గా ఆసియాక‌ప్‌లో పాక్ ఆట‌గాళ్ల‌తో భార‌త్ క‌ర‌చాల‌నం నిర‌కారించింది.  ఆ త‌ర్వాత భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు, అండ‌ర్‌-19 జ‌ట్టు కూడా అదే బాట‌లో న‌డిచింది. అప్పటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్‌లో పాక్ ప్లేయ‌ర్ల‌తో భార‌త్ హ్యాండ్ షేక్ చేయ‌లేదు. ఇప్పుడు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవ‌కాశ‌ముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement