2026 Year
-
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డి (nandini sidhareddy)ని వరించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన "అనిమేష" కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ. లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రదానం చేస్తారు. సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకంఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం. వారికి నా హృదయపూర్వక అభినందనలు. pic.twitter.com/o1wqCEcSPu— KTR (@KTRBRS) March 16, 2026మెదక్ జిల్లా బందారం గ్రామంలో సిధారెడ్డి 1955లో జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, ‘ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై ఎం.ఫిల్ (1981) పట్టా ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా పనిచేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలుతెలంగాణ మట్టి పరిమళాన్ని, సామాజిక చైతన్యాన్ని తన కలం ద్వారా జాతీయ స్థాయికి చేర్చిన ప్రఖ్యాత కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించడం పట్ల పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రచించిన 'అనిమేష' వచన కవితా సంపుటికి గాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును కేంద్రం ప్రకటించింది. సిధారెడ్డికి ఈ గౌరవం దక్కడం పట్ల మంత్రి జూపల్లి హర్షం వ్యక్తం చేశారు.నందిని సిధారెడ్డి కేవలం ఒక కవి మాత్రమే కాదు, తెలంగాణ సాంస్కృతిక పునర్వైభవానికి బాటలు వేసిన దార్శనికుడు. ఆయన రాసిన 'అనిమేష' కవితా సంపుటి ఆధునిక వచన కవిత్వంలో ఒక అద్భుత సృష్టి. ఈ పురస్కారం ఆయన సుదీర్ఘ సాహిత్య కృషికి దక్కిన సరైన గౌరవం. తెలంగాణ మట్టిలో పుట్టిన ఒక గొప్ప మేధావికి ఈ స్థాయి గుర్తింపు రావడం రాష్ట్రానికే గర్వకారణం అని పేర్కొన్నారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు.మలిదశ ఉద్యమంలో అక్షరాన్ని ఆయుధంగా మలచి ప్రజల్లో చైతన్యం నింపడంలోనూ ఆయన పాత్ర చిరస్మరణీయమని మంత్రి జూపల్లి కొనియాడారు. -
2026 భయానక భవిష్యవాణి.. కొత్త నాస్ట్రడామస్ హెచ్చరికలు!
2026 సంవత్సరం.. ప్రపంచం ఇప్పటికే యుద్ధాలు, సాంకేతిక సమస్యలు, రాజకీయ అస్థిరతల మధ్య కంపిస్తోంది. కానీ ఒక వ్యక్తి ఇంకా భయంకరమైన భవిష్యవాణులు చెబుతున్నాడు. అతని పేరు క్రెయిగ్ హామిల్టన్-పార్కర్. ప్రపంచవ్యాప్తంగా "కొత్త నాస్ట్రడామస్" అని, "డూమ్ ప్రవక్త" అని పిలుస్తారు. రాణి ఎలిజబెత్ మరణం, కోవిడ్ మహమ్మారి వంటి ఘటనలను ముందుగా చెప్పినట్లు అతను దావా వేస్తాడు. ఇప్పుడు అతను పురాతన భారతీయ "నాడీ జ్యోతిష్యం" ఆధారంగా 2026కి 5 భయానక హెచ్చరికలు ఇస్తున్నాడు. ఇవి నిజమైతే... మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించండి!మొదటి భవిష్యవాణి.. ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావచ్చు!పార్కర్ చెబుతున్నారు.. 2026లో ప్రపంచ యుద్ధాలు లేదా పెద్ద సంక్షోభాలు అమెరికా ఎన్నికల వ్యవస్థను తలకిందులు చేస్తాయి. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ అత్యవసర అధికారాలు ఉపయోగించి తన అధ్యక్ష పదవిని మూడోసారి పొడిగించే ప్రయత్నం చేయవచ్చు. చైనా-తైవాన్ ఉద్రిక్తతలు లేదా రష్యా-చైనా మైత్రి వల్ల పెద్ద యుద్ధం మొదలై, అమెరికా లోనికి లాగబడి ప్రపంచ శక్తి సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. ఇది కేవలం రాజకీయం కాదు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తుంది!రెండవ భవిష్యవాణి.. జపాన్‌పై భయానక వాయు మేఘం! ఆగస్టు 2026లో జపాన్ ఉత్తర భాగాలను ఒక రహస్యమైన, విధ్వంసకరమైన "వాయు మేఘం" (gas cloud) కప్పేస్తుందని పార్కర్ హెచ్చరిస్తున్నారు. ఇది సహజంగా జరిగేది కాదేమో... బదులుగా రహస్య దాడి కావచ్చు. బాంబుల ద్వారా అగ్నిపర్వతాలను పేల్చి ఇలాంటి వాయువులు విడుదల చేయవచ్చని అంటున్నారు. దీని పరిణామాలు జపాన్ మొత్తానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఊహించండి... ఆకాశం ముదురుగా మారి, ప్రజలు భయంతో బయటకు రా లేకుండా!మూడవ భవిష్యవాణి.. ఇరాన్‌పై బలమైన దాడి! మార్చి 2026లో ఇరాన్ అణు సౌకర్యాలపై ఖచ్చితమైన, శక్తివంతమైన దాడి జరుగుతుందని చెబుతున్నారు. దీని లక్ష్యం ఇరాన్ అణు శక్తిని పూర్తిగా నాశనం చేయడం. "ఎరుపు, పసుపు జెండాలు" మరియు "సింహం చిహ్నం" వంటి సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని అంటున్నారు. కానీ ఆశాకిరణం ఉంది – ఈ అల్లర్లు ఇరాన్లో ప్రజాస్వామ్యం పెరగడానికి, ముఖ్యంగా మహిళల హక్కులకు దారితీయవచ్చు.నాలుగవ భవిష్యవాణి.. సైబర్ దాడి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం! 2026లో భారీ సైబర్ దాడి జరిగి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు, క్రిప్టోకరెన్సీలు, AI వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోతాయి. బ్యాంకులు, కంపెనీలు, వ్యక్తుల డేటా దెబ్బతింటుంది. పార్కర్ సలహా – ముఖ్య డేటాను బ్యాకప్ చేయండి, క్లౌడ్‌పై మాత్రమే ఆధారపడకండి. బంగారం ధరలు తీవ్రంగా ఊగిసలాడతాయి. డిజిటల్ ప్రపంచం కూలిపోతే... మన జీవితాలు ఎలా మారతాయో ఊహించండి!ఐదో భవిష్యవాణి.. ప్రపంచ సంస్థలు బలహీనపడటం! NATO వంటి అంతర్జాతీయ సంస్థలు బలహీనపడతాయి. భౌగోళిక రాజకీయ పోటీలు, వనరుల కోసం పోరాటాలు పెరుగుతాయి. అమెరికా గ్రీన్లాండ్ సహజ వనరులపై ఎక్కువ ఆర్థిక నియంత్రణ కోరుకోవచ్చు. ప్రపంచ శక్తి సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. ఇవి కేవలం భవిష్యవాణులే... నిజమవుతాయా లేదా? ఎవరికీ తెలియదు. కానీ ఈ హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
నెట్‌ఫ్లిక్స్ సినిమాల పండగ.. నేరుగా స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే..!
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే తీరు పూర్తిగా మారిపోయింది. నెల రోజుల్లోపే కొత్త సినిమాలు సందడి చేస్తుండడంతో ఆడియన్స్ ఇంట్లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో ఓటీటీలు సైతం పోటీ పడుతున్నాయి.తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాదిలో ఇండియా స్ట్రీమింగ్ సినిమాల జాబితాను ప్రకటించింది. 2026లో నేరుగా ఓటీటికీ వచ్చే చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల జాబితాను వెల్లడించింది. వీటిలో తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి.తెలుగు సినిమాలు..తక్షకుడు (మూవీ)సూపర్ సుబ్బు (తెలుగు వెబ్ సిరీస్)హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు..హమ్ హిందుస్థానీ(మూవీ)హలో బచ్చో..(మూవీ)ఇక్కా..(మూవీ)టోస్టర్..(మూవీ)మా బెహన్..(మూవీ)గాంధారి..(మూవీ)కర్తవ్య..(మూవీ)బాలీవుడ్ వెబ్ సిరీస్లుఫ్యామిలీ బిజినెస్..(వెబ్ సిరీస్)తలాశ్: ఎ మదర్స్ సెర్చ్..(వెబ్ సిరీస్)మిస్ మ్యాచ్డ్ : సీజన్4..(వెబ్ సిరీస్)ముజాఫర్ కేఫ్..(వెబ్ సిరీస్)లస్ట్ స్టోరీస్ సీజన్ 3..(వెబ్ సిరీస్)చుంబక్..(వెబ్ సిరీస్)ఖుస్కోర్ పండిట్..(వెబ్ సిరీస్) మామ్లా లీగల్ హై -సీజన్2..(వెబ్ సిరీస్)గ్లోరీ.. (వెబ్ సిరీస్)ఆపరేషన్ సఫేద్ సాగర్..(వెబ్ సిరీస్)కోలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు..మేడ్ ఇన్ కొరియా (మూవీ)లవ్ (తమిళ వెబ్ సిరీస్)లెగసీ (తమిళ వెబ్ సిరీస్)టాక్ షోగ్రేట్ ఇండియన్ కపిల్ షో- సీజన్-5 -
వికసించిన పద్మాలు
-
టాలీవుడ్‌ను కాపాడుతున్న 'Gen Z' కిడ్స్
భారతదేశంలోని మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడిన సంస్థ MAI.. ఈ సంస్థ ఎప్పటికప్పుడు థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను క్రోడీకరిస్తుంది. గత 5ఏళ్లలో వచ్చిన మార్పులను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంది. వారు ఇప్పటికే అందించిన నివేదిక ప్రకారం కోవిడ్ తర్వాత 2020–2022 మధ్య థియేటర్‌కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. కానీ, 2023–2025లో పెద్ద సినిమాల కారణంగా మళ్లీ పెరుగుదల కనిపించిందని పేర్కొంది.ముఖ్యంగా 2025లో Gen Z (13–29 ఏళ్ల వయసు) ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లే వారి సంఖ్య 25% పెరిగింది. వారు సగటున సంవత్సరానికి 6 సార్లు థియేటర్‌కి వెళ్లారని లెక్కలు చెబుతున్నాయి. అయితే, 30 ఏళ్లకు పైబడిన వారి సంఖ్యతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఏకంగా 41 శాతం వరకు థియేటర్‌వైపు వెల్లడంలేదని తేల్చిచెప్పింది. 2019 వరకు ప్రతి ఏడాది థియేటర్లలో సినిమాలు చూసిన ప్రేక్షకుల సంఖ్య సుమారు 150 కోట్ల వరకు ఉంది. అయితే, 2024కు వచ్చేసరికి కేవలం రూ. 86 కోట్లకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సినిమా టికెట్ ధరలతో పాటు క్యాంటీన్ రేట్ల కారణంగా థియేటర్‌వైపు వెళ్లాలని ఉన్నప్పటికీ సామాన్యులు దడుసుకుంటున్నారు. దీంతో కొన్ని థియేటర్స్ మూతపడుతున్నాయి. ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ అవసరం తగ్గింది.థియేటర్స్‌కు ప్రేక్షకులు వెళ్లడం తగ్గించడంతో కలెక్షన్స్‌పై ఆ ప్రభావం పడుతుంది. గత ఐదేళ్లగా భారతీయ సినిమాలన్నీ సాధించిన వసూళ్లులో పెద్దగా మార్పు లేదు. దేశవ్యాప్తంగా 2019లో రూ. 19వేల కోట్లు వస్తే.. 2024లో రూ. 18వేల కోట్లు, 2025లో రూ. 14వేల కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. 41శాతం ప్రేక్షకులు తగ్గినప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం టికెట్ రేట్ల పెంపు అని చెప్పవచ్చు. 2025లో సినిమా టికెట్ ధరల పెంపు గణనీయంగా పెరిగింది. అదే సమయంలో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా Gen Z (13–29 ఏళ్ల వయసు) వారే థియేటర్‌కు వెళ్తున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. గతేడాదిలో హిందీ పరిశ్రమ కాస్త మెరుగ్గానే ఉంది. హిందీ పరిశ్రమ నుంచి గతేడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ, టాలీవుడ్ పాతాళానికి పడిపోయింది. తెలుగులో 274 సినిమాలు తీస్తే రూ. 2500 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ 290 సినిమాలకు గాను రూ. 1,533 కోట్ల గ్రాస్‌తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి. కలెక్షన్స్‌తో పాటు ఓటీటీ వంటి వాటితో నిర్మాతలు కాస్త బయటపడుతున్నారు. లేదంటే కోట్ల రూపాయలు నష్టం భరించాల్సి వచ్చేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా టాలీవుడ్లో ఈ ఏడాది నుంచి మరింత కఠనంగా పరిస్థితిలు ఉండే ఛాన్స్ ఉంది. -
2026 ‘బిగ్ ఫైట్’: అటు బెంగాల్ పులి.. ఇటు తమిళ ‘దళపతి’!
దేశంలో ప్రతీయేటా ఎన్నికల కోలాహలం సాధారణమే అయినా, ప్రస్తుత 2026లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే సత్తాను కలిగి ఉన్నాయి. తూర్పున అస్సాం, పశ్చిమ బెంగాల్.. దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ ఏడాది మోగనున్న ఎన్నికల నగారా.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ప్రాంతీయ శక్తులైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే (డీఎంకే)లకు పెద్ద సవాల్‌ను విసరనున్నాయి. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా, పార్టీల సంస్థాగత నిర్మాణం, నాయకత్వ పటిమ మొదలైనవి ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.బీజేపీ ముంగిట భారీ సవాళ్లుఅస్సాం, పుదుచ్చేరిలలో ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సవాల్ కానున్నాయి. మరోవైపు 14 ఏళ్లుగా బెంగాల్‌ను ఏలుతున్న మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టడం కమలనాథుల ప్రధాన లక్ష్యంగా మారింది. ఇక కేరళలో సీపీఎం (ఎల్డీఎఫ్), తమిళనాడులో డీఎంకే తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది.అందరి దృష్టి ఆ రాష్ట్రాలపైనే..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టీ ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలపైనే నిలిచింది. బెంగాల్లో దశాబ్ద కాలానికిపైగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌పై సహజంగానే కొంత వ్యతిరేకత ఉండే అవకాశముందని రాజకీయ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ తదితర అంశాలు మమత సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్నా, బీజేపీ ఈ అంశాలను ఓట్లుగా మలుచుకోగలదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.పొత్తులే నిర్ణయాత్మక శక్తులుగుజరాత్లో బీజేపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నట్లే.. బెంగాల్లో మమత కూడా తన పట్టు నిలుపుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక అస్సాంలో గత ఎన్నికల్లో బీజేపీ కూటమి సునాయాసంగా గెలిచినా, విపక్ష ‘మహాజోత్’ కూటమికి, ఎన్డీయేకి మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 4 శాతం మాత్రమే ఉండటం గుర్తించదగినది. రాబోయే ఎన్నికల్లో చిన్నపాటి ఓట్ల చీలిక కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో, పొత్తులే ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని తెలుస్తోంది. పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే కూటమి తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆసక్తికర వ్యూహాలు రచిస్తోంది.కేరళలో పుంజుకుంటున్న బీజేపీదక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో ఈసారి రాజకీయ ముఖచిత్రం కొంత భిన్నంగా కనిపిస్తోంది. సంప్రదాయంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్యే అధికారం చేతులు మారే కేరళలో.. బీజేపీ అనూహ్యంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ సీటు గెలవడం, ఇటీవల తిరువనంతపురం కార్పొరేషన్లో మెజారిటీకి చేరువగా రావడం కమలదళంలో ఉత్సాహాన్ని నింపింది.తమిళనాట విజయ్ ప్రకంపనలుతమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేని రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించిన విజయ్.. ఒంటరిగానే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. విజయ్ భారీ బహిరంగ సభలకు జనం వస్తున్నా, ఆ జనసందోహం ఓట్లుగా మారుతుందా లేదా అన్నది సందేహంగా మిగిలింది. ద్రవిడ పార్టీల ఆధిపత్యం నడిచే తమిళనాడులో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఈసారైనా సత్తా చూపుతాయా లేక ప్రాంతీయ పార్టీల నీడలోనే కొనసాగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది‘ఇండియా’ కూటమి ఏమవునో..2026 ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమి మనుగడకు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వానికి గీటురాయిగా నిలవనున్నాయి. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఈసారి కూడా ఓడిపోతే పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. కేరళలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్.. ఈ ఐదు రాష్ట్రాల్లో సత్తా చాటకపోతే రాహుల్ గాంధీ సామర్థ్యంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తే ప్రమాదముంది. మరోవైపు బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్‌కు కూడా ఈ ఎన్నికలు తొలి పరీక్షగా నిలవనున్నాయి. మొత్తంగా చూస్తే, పశ్చిమ బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ గెలుపుపైనే ‘ఇండియా కూటమి’ భవిష్యత్తు ఆధారపడి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: మీ నిద్రలోనే మీ ఆయుష్షు! -
రూ. 15వేలు కంటే తక్కువ ధరలో.. బెస్ట్ స్మార్ట్ఫోన్లు
2026 మొదలైపోయింది.. సంక్రాంతి కూడా వచ్చేసింది. ఈ సమయంలో కొందరు ఓ మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురు చూస్తుంటారు. ఇక్కడ ఈ కథనంలో రూ. 15వేలు కంటే తక్కువ ధరలు అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ స్మార్ట్ఫోన్ల గురించి తెలుసుకుందాం.పోకో ఎం7 ప్రో 5జీరూ.13,499 ధర వద్ద లభించే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్.. డ్యూయల్ 50MP కెమెరా 20MP సెల్ఫీ కెమెరా పొందుతుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్సెట్ పొందుతుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 2100 nits పీక్ బ్రైట్నెస్ & డాల్బీ విజన్‌తో 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110 mAh బ్యాటరీ ఇందులో చూడవచ్చు.ఒప్పో కే13ఎక్స్ఒప్పో కే13ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా & 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది. దీని ధర 12,499 రూపాయలు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 45W ఛార్జింగ్‌తో 6000 mAh బ్యాటరీతో వస్తుంది.రెడ్మీ 15సీ12,999 రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 15వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఒకటి. మీడియాటెక్ హెలియో జీ81 అల్ట్రాతో లభించే ఈ ఫోన్.. 8MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇది 6.9 ఇంచెస్ IPS LCD & 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 33 W ఛార్జర్‌తో 6000 mAh బ్యాటరీతో లభిస్తుంది.వివో T4 లైట్ 5జీవివో T4 లైట్ 5జీ మొబైల్.. 5MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 14,999. ఇది 15 W ఛార్జర్‌తో 6000 mAh బ్యాటరీని పొందుతుంది.మోటరోలా జీ57 పవర్ 5జీమోటరోలా G57 పవర్ 5జీ మొబైల్.. 6.72-అంగుళాల IPS LCD డిస్ప్లేతో.. 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 120 Hz రిఫ్రెష్ రేట్‌ను ప్రదర్శిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 చిప్సెట్తో నడిచే ఈ ఫోన్ 7000 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఇది 50MP + 8MP రియర్ కెమెరాను కలిగి ఉంది. దీని రేటు రూ. 14,999.ఇదీ చదవండి: బంపరాఫర్.. రూపాయికే సిమ్ కార్డు! -
2026లో విరాట్ కోహ్లి ఛేదించబోయే భారీ రికార్డులు ఇవే..!
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి 2026వ సంవత్సరంలోనూ రికార్డు వేటను కొనసాగించనున్నాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. గతేడాది చివరి వరకు రికార్డుల వేటను కొనసాగించాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్.. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతాడు. ఈ సిరీస్ నుంచే విరాట్ రికార్డుల వేట మొదలవుతుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ ఈ ఏడాది ఛేదించే అవకాశం ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం.28000 అంతర్జాతీయ పరుగులుఅంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ 27975 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉంది.15000 వన్డే పరుగులు308 ఇన్నింగ్స్‌ల్లో 14557 పరుగులు చేసి, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్.. మరో 443 పరుగులు చేస్తే 15000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో విరాట్ ఈ రికార్డును ఛేదించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటివరకు సచిన్ మాత్రమే 15000 పరుగుల మార్కును తాకాడు.అంతర్జాతీయ క్రికెట్లో రెండో అత్యధిక పరుగులువిరాట్ మరో 42 పరుగులు చేస్తే సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ క్రమంలో సంగక్కరను (28,016) వెనక్కు నెట్టేస్తాడు.అత్యధిక వన్డే పరుగులున్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ మరో 94 పరుగులు చేస్తే, ఆ దేశంపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (42 మ్యాచ్‌ల్లో 1750 పరుగులు) ఖాతాలో ఉంది. విరాట్ న్యూజిలాండ్‌తో ఇప్పటివరకు 33 వన్డేలు ఆడి 1657 పరుగులు చేశాడు.ఐపీఎల్లో 9000 పరుగులుఈ ఏడాది అంతర్జాతీయ వన్డేలతో పాటు ఐపీఎల్ కూడా ఆడనున్న విరాట్.. మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 8,661 పరుగులు (267 మ్యాచ్‌లు) ఉన్నాయి. -
2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..!
2025 సంవత్సరం మరి కొద్ది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు ఆడబోయే మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం. 2026లో టీమిండియా చాలా బిజీగా గడపనుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లు మొదలుకొని, స్వదేశంలోనే జరిగే టీ20 ప్రపంచకప్, ఆతర్వాత ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఆతర్వాత స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్.. ఆతర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్, దాని తర్వాత న్యూజిలాండ్ పర్యటన.. సంవత్సరాంతంలో స్వదేశంలోనే శ్రీలంకతో సిరీస్.. ఇలా, ఈ ఏడాదంతా టీమిండియా బిజీబిజీగా గడపనుంది.వచ్చే ఏడాది టీమిండియా షెడ్యూల్ ఇదే...జనవరి, 2026: న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 5 టీ20లుఫిబ్రవరి, మార్చి: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్మార్చి నుంచి మే మధ్యలో ఐపీఎల్ 2026జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా1 టెస్టు, 3 వన్డేలుజూలైలో టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్5 టీ20లు, 3 వన్డేలుఆగస్టులో టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక2 టెస్టులుసెప్టెంబర్లో టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (తటస్థ వేదిక)3 టీ20లుసెప్టెంబర్, అక్టోబర్‌లో వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 5 టీ20లుసెప్టెంబర్ 19-అక్టోబర్ 4: ఆసియా క్రీడలు 2026అక్టోబర్-నవంబర్‌లో టీమిండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లుడిసెంబర్లో శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 3 టీ20లు* పైన తెలిపిన షెడ్యూల్లో ఇంకా కొన్నింటికీ పూర్తి ఆమోదం లభించలేదు. -
2025కి గుడ్‌బై.. 2026కి హెల్తీ వెల్కమ్
2025కు గుడ్‌బై పలికేశారా? కొత్త ఏడాదికి స్వాగతం అనేస్తున్నారా?. ఓకే.. గుడ్. 2026లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారా?.. అయితే ఈ ఈజీ టిప్స్ మీకోసమే. 2025లో శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలివి! ఆలస్యమెందుకు?.. చదివేయండి.. తెలివిగా తినండి.. గుండె ఆరోగ్యంతోపాటు మన జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు, నిద్ర, మూడ్ సమస్యలు అధిగమించేందుకు, రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం కొంచెం తెలివిగా తినాలని, తాగాలని 2025లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ తినడం ఎలా ఉండాలంటే.. ➡️వారంలో ఒకటి నుంచి ఆరు వరకూ కోడిగుడ్లు తినడం గుండెజబ్బులతో చచ్చిపోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికీ కూడా ఇది వర్తిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగని అతిగా తినడం మంచిది కాదు.➡️అధిక రక్తపోటు నుంచి తప్పించుకునేందుకు ఉప్పు తినడం తగ్గించడం కాకుండా.. ఆహారంలో మరింత పొటాషియం ఉండేలా చూసుకోవడం మేలు. అరటిపండ్లు, ఆప్రికాట్స్, చిలగడదుంపల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.పొటాషియం అధికంగా ఉండేవి.. • అరటిపండ్లు• ఆప్రికాట్స్ (జారదాలు)• చిలగడదుంపలు (Sweet potatoes)• పాలకూర, గోంగూర, కూరగాయలు• బీన్స్, పప్పులు• కొబ్బరి నీరు• కలబంద (Avocado)గమనిక.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధిక పొటాషియం తీసుకోవడం ప్రమాదకరం కావొచ్చు. కాబట్టి, నిపుణుల సలహా తీసుకుని ఆహారంలో పొటాషియం బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి➡️రోజంతా కూర్చునే ఉంటున్నారా? అయితే మీ రక్తనాళాలను కాపాడుకోవాలంటే... కోకోలోని ఫ్లేవనాల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవి ‘సిట్టింగ్ డిసీజ్’తో వచ్చే సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం.. రోజుకు కోకో పౌడర్ లేదా డార్క్ చాక్లెట్ (70% పైగా కోకో ఉన్నది) తీసుకోవడం రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్లేవనాల్స్ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి, రక్తనాళాలను సడలిస్తాయి. దీని వల్ల రక్తప్రవాహం పెరుగుతుంది, గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది.ఎలా తీసుకోవాలంటే.. డార్క్ చాక్లెట్ (చక్కెర తక్కువగా ఉండే)కోకో పౌడర్ (unsweetened)కాకా నిబ్స్కోకో డ్రింక్స్ (చక్కెర లేకుండా)అధిక చక్కెర, పాలు కలిపిన చాక్లెట్ తీసుకుంటే ప్రయోజనం తగ్గిపోతుంది.మితంగా తీసుకోవాలి (రోజుకు 10–20 గ్రాముల డార్క్ చాక్లెట్ సరిపోతుంది).కొన్ని రకాల కొవ్వులు కేన్సర్ కణితులతో మన రోగ నిరోధక వ్యవస్థ పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అయితే మొక్కల ఆధారిత కొవ్వులు (plant-based fats) అలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. మంచి కొవ్వులు• ఆలివ్ ఆయిల్• కొబ్బరి నూనె• పామ్ ఆయిల్ (మితంగా)• అవకాడో, డ్రైఫ్రూట్స్👆 ఇవి ఇమ్యూన్ సిస్టమ్‌ను దెబ్బతీయవు. కొన్ని సందర్భాల్లో యాంటీ-ఇన్ఫ్లమేటరీ ప్రభావం చూపుతాయి.➡️మలబద్ధకాన్ని తొలగించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లు ఉపయోగపడతాయి. అయితే కీవీ పండ్లు ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.➡️ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు, శాఖాహార ప్రధానమైన మెడిటరేనియన్ ఆహారం ఐబీఎస్ (ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్) సమస్యను తగ్గిస్తుంది.➡️అరటి పండు స్మూతీల్లో వాడే పదార్థాల్లోని మంచి పోషకాలు సరిగ్గా జీర్ణం కానివ్వదు. అరటిలో సహజంగా ఉన్న పోషకాలు, ఇతర పదార్థాల కలయిక వల్ల శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు. కాబట్టి.. అరటితో పాలు / బాదం పాలు(ప్రోటీన్, కాల్షియం అందిస్తాయి), పీనట్ బట్టర్ / బాదం బట్టర్ (ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అందిస్తుంది), ఓట్స్ (ఫైబర్, శక్తినిస్తుంది), కాకా పొడి (unsweetened cocoa) యాంటీఆక్సిడెంట్లు, చియా సీడ్స్ / ఫ్లాక్స్ సీడ్స్ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు), బెర్రీలు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ) (విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు), తేనె / ఖర్జూరం (సహజమైన తీపి) అందిస్తాయి. అలాగే.. అరటితో కలపకూడనివి కొన్ని ఉన్నాయి. సిట్రస్ ఫలాలు (కమలపండు, మొసంబి, నిమ్మ) వీటివల్ల ఆమ్లత్వం(యాసిడిటీ) పెరిగి అరటిలోని పోషకాలు శోషణ తగ్గుతుంది. అధిక చక్కెర / ఐస్‌క్రీమ్ వల్ల ఫైబర్ దక్కకపోగా.. విటమిన్ ప్రయోజనం తగ్గిపోతుంది.ప్రాసెస్డ్ ప్రోటీన్ పౌడర్ల వల్ల కొన్ని సందర్భాల్లో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చాక్లెట్ సిరప్ (అధిక చక్కెర) సహజంగానే పోషకాలను తగ్గిస్తుంది. కాఫీ / టీ పొడి చేరిస్తే.. ఐరన్, కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది. ➡️చక్కెరల కంటే కృత్రిమ చక్కెరలతో కూడిన పానీయాలు మధుమేహం వచ్చే అవకాశాలను ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఆ రకమైన పానీయాలు తీసుకోకపోవడం మేలు.పునరుత్తేజానికి వ్యాయామం..సరైన నిద్ర + సరైన వ్యాయామం= ఆరోగ్యం. అయితే హై-ఇంపాక్ట్ వ్యాయామాలు (జంపింగ్, రన్నింగ్) కీళ్ల సమస్యలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి నడక, సైక్లింగ్, ఈత వంటివి మేలు. సుఖ నిద్రతో మన వ్యాయామ అలవాట్లు మెరుగవుతాయి. అయితే.. సాయంత్రాలు వ్యాయామం చేయడం అంత మంచిదేం కాదు. హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలగొచ్చు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే వ్యాయామం ప్రయోజనం తగ్గిపోతుంది. కాబట్టి.. నిద్రకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ సాయంత్రమే చేసే వీలుంటే గనుక.. తేలికపాటి వ్యాయాయాలు (నడక, యోగా, స్ట్రెచింగ్) చేసుకోవచ్చు. ఇవి నిద్రకు ఆటంకం కలిగించవు.మానసిక సంతోషానికి.. జీవనశైలిలోని చిన్న చిన్న అలవాట్లు మన మానసిక ఆరోగ్యంపై, పనితీరుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తాజా పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి.క్రియాటిన్ సాధారణంగా కండరాల శక్తి పెంపు కోసం ఉపయోగించే పోషక పదార్థం. కానీ, ఇది మెదడు శక్తి వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్ (మనోవ్యాకులత) చికిత్సలో సహాయక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అదెలాగంటే.. క్రియాటిన్ తీసుకోవడం వల్ల మెదడు కణాలు శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటాయి, ఫలితంగా మూడ్ స్థిరంగా ఉండేలా చేసి చికిత్సలో మెరుగైన ఫలితాన్ని చూపిస్తుంది. తిట్టుకోవడం.. పనితీరు పెంపుతిట్టుకోవడం అనేది.. ప్రతికూలంగా భావించే అంశమే. కానీ.. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే తీవ్ర ఒత్తిడి లేదంటే కష్టమైన పనిలో మనల్ని మనం కాస్త ఘాటు పదాలతో తిట్టుకోవడం వల్ల శరీరం ఎక్కువ శక్తి ఇస్తుంది. ఇది నొప్పి తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి.. పనితీరు మెరుగుపరుస్తుంది. క్రీడల్లో, కఠినమైన వ్యాయామాల్లో ఇది సహజ రీతిలో కనిపించే అంశమే.ఉదయాన్నే కాఫీ.. మూడ్ మెరుగుదలకాఫీలోని కెఫిన్ మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాల స్థాయిని పెంచుతుంది. ఫలితంగా, రోజంతా ఉత్సాహం, ఏకాగ్రత, మూడ్ మెరుగుపడతాయి. ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల పనితీరు పెరిగి, జీవనశైలి ఉల్లాసంగా ఉంటుంది. ఇది మేం చెబుతున్నమాట కాదు.. పరిశోధనల్లో తేలిన అంశమే.


