రూ. 15వేలు కంటే తక్కువ ధరలో.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు | Best 5G Phones Under Rs 15000 In January 2026 | Sakshi
Sakshi News home page

రూ. 15వేలు కంటే తక్కువ ధరలో.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Jan 11 2026 4:02 PM | Updated on Jan 11 2026 4:12 PM

Best 5G Phones Under Rs 15000 In January 2026

2026 మొదలైపోయింది.. సంక్రాంతి కూడా వచ్చేసింది. ఈ సమయంలో కొందరు ఓ మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ఎదురు చూస్తుంటారు. ఇక్కడ ఈ కథనంలో రూ. 15వేలు కంటే తక్కువ ధరలు అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

పోకో ఎం7 ప్రో 5జీ
రూ.13,499 ధర వద్ద లభించే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్.. డ్యూయల్ 50MP కెమెరా 20MP సెల్ఫీ కెమెరా పొందుతుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ పొందుతుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 2100 nits పీక్ బ్రైట్‌నెస్ & డాల్బీ విజన్‌తో 6.67 ఇంచెస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110 mAh బ్యాటరీ ఇందులో చూడవచ్చు.

ఒప్పో కే13ఎక్స్
ఒప్పో కే13ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా & 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంటుంది. దీని ధర 12,499 రూపాయలు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 45W ఛార్జింగ్‌తో 6000 mAh బ్యాటరీతో వస్తుంది.

రెడ్‌మీ 15సీ
12,999 రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 15వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఒకటి. మీడియాటెక్ హెలియో జీ81 అల్ట్రాతో లభించే ఈ ఫోన్.. 8MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇది 6.9 ఇంచెస్ IPS LCD & 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 33 W ఛార్జర్‌తో 6000 mAh బ్యాటరీతో లభిస్తుంది.

వివో T4 లైట్ 5జీ
వివో T4 లైట్ 5జీ మొబైల్.. 5MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 14,999. ఇది 15 W ఛార్జర్‌తో 6000 mAh బ్యాటరీని పొందుతుంది.

మోటరోలా జీ57 పవర్ 5జీ
మోటరోలా G57 పవర్ 5జీ మొబైల్.. 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో.. 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 120 Hz రిఫ్రెష్ రేట్‌ను ప్రదర్శిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 చిప్‌సెట్‌తో నడిచే ఈ ఫోన్ 7000 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఇది 50MP + 8MP రియర్ కెమెరాను కలిగి ఉంది. దీని రేటు రూ. 14,999.

ఇదీ చదవండి: బంపరాఫర్.. రూపాయికే సిమ్ కార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement