కోల్‌ ఇండియా రేర్‌ ఎర్త్‌ మైనింగ్‌  | Coal India arm SECL identifies 7 mine dumps for rare earth exploration | Sakshi
Sakshi News home page

కోల్‌ ఇండియా రేర్‌ ఎర్త్‌ మైనింగ్‌ 

Feb 26 2026 5:26 AM | Updated on Feb 26 2026 7:06 AM

Coal India arm SECL identifies 7 mine dumps for rare earth exploration

2 రాష్ట్రాలలో 7 డంప్‌ల గుర్తింపు 

న్యూఢిల్లీ: అనుబంధ కంపెనీ సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎస్‌ఈసీఎల్‌) తాజాగా రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌గల 7 మైన్‌ డంప్‌లను గుర్తించినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్‌ ఇండియా వెల్లడించింది. బొగ్గు గనుల వృథా నుంచి విలువను వెలికితీయాలన్న ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా ఎస్‌ఈసీఎల్‌ చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. ఈ బాటలో ప్రధాన కోల్‌ ఫీల్డ్స్‌వద్ద భారీగా పేరుకుపోయిన డంప్స్‌ ద్వారా రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌(ఆర్‌ఈఈలు)ను గుర్తించినట్లు పేర్కొంది.

 దీంతో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని ఎస్‌ఈసీఎల్‌ చైర్మన్, ఎండీ హరీష్‌ దుహన్‌ వివరించారు. వీటి వెలికితీత కోసం ఇప్పటికే టెండరింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. వెరసి ఏడాదిలోగా ఇందుకు వీలున్న డంప్స్‌ను సైంటిఫిక్‌ పద్ధతిలో గుర్తించనున్నట్లు తెలియజేశారు. 

బొగ్గు శాఖ మార్గదర్శకత్వాల ప్రకారం రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ వెలికితీతకు 7 మైన్‌ డంప్స్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఏడాదిలోగా ఆర్థికంగా ఉపయుక్తమైన ప్రాంతాలను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్స్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ రంగ పరికరాలు, ఎలక్ట్రికల్‌ వాహనాలు తదితర హైటెక్‌ పరిశ్రమలలో ఇవి కీలకంకాగా.. అంతర్జాతీయస్థాయిలో వీటి సరఫరాలకు చైనా ఆధిపత్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
ఈ వార్తలతొ కోల్‌ ఇండియా షేరు 2% ఎగసి రూ. 438 వద్ద ముగిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement