breaking news
Rare Earth Magnet
-
దేశీయంగా రేర్ ఎర్త్ తయారీకి దన్ను
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ల ఉత్పత్తి కోసం ఉద్దేశించిన రూ. 7,280 కోట్ల స్కీముతో దేశీయంగా వాటి తయారీకి, సరఫరాకి ఊతం లభిస్తుందని పరిశ్రమ ధీమా వ్యక్తం చేసింది. తవ్వకం, వెలికితీత, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్, వివిధ రంగాలకు అవసరమయ్యే మ్యాగ్నెట్ల తయారీ వ్యవస్థకు ఈ పథకంతో గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భారతీయ ఖనిజ పరిశ్రమ సంస్థల సమాఖ్య ఎఫ్ఐఎంఐ పర్కొంది. దేశ వ్యూహాత్మక తయారీ సామర్థ్యాలను పటిష్టం చేసేందుకు ఈ ప్రోత్సాహక స్కీము తోడ్పడుతుందని అసోచాం సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎల్రక్టానిక్స్, మెడికల్ డివైజ్‌లు, పునరుత్పాదక విద్యుత్, రక్షణ తదితర రంగాల వృద్ధిపై భారత్ ప్రధానంగా దృష్టి పెడుతున్న పరిస్థితుల్లో వార్షికంగా 6,000 టన్నుల (ఎంటీపీఏ) రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు ప్రయతి్నంచడమనేది సకాలంలో తీసుకుంటున్న చర్యగా ఆయన అభివరి్ణంచారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని, భవిష్యత్ టెక్నాలజీల అభివృద్ధిలో భారత్ మరింత ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుందని సింఘాల్ వివరించారు. దీనితో మైనింగ్, ప్రాసెసింగ్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ తదితర విభాగాలవ్యాప్తంగా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఈవై ఇండియా పార్ట్నర్ రాజు కుమార్ తెలిపారు. -
కీలక ఖనిజాల పథకానికి ఆమోదం
న్యూఢిల్లీ: కీలక రంగాల్లో అత్యావశ్యకంగా మారిన అరుదైన భూఅయస్కాంత ఖనిజాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. వీటి దిగుమతుల కోసం చైనాపై ఆధారపడడటం మానేసి అరుదైన ఖనిజాల రంగంలో స్వావలంబన దిశగా ముందడుగు వేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగా భూఅయస్కాంతాల గనుల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛమైన ఖనిజాల తయారీకి సంబంధించి రూ.7,280 కోట్లతో నూతన పథకాన్ని ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ పథకానికి రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్(ఆర్ఈపీఎంఎస్) అని పేరు పెట్టింది. విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, వైమానిక రంగం, రక్షణ పరికరాల్లోని కీలక భాగాలను ఈ భూఅయస్కాంత ఖనిజాలతోనే తయారుచేస్తారు. దీంతో వీటికి విపరీతమైన కొరత ఏర్పడింది. డిమాండ్ తగ్గ సరఫరా సాధించడంతోపాటు స్వావలంబనే లక్ష్యంగా ఈ పథకాన్ని మొదలుపెట్టనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కేబినెట్ భేటీ నిర్ణయాలను ఆయన తర్వాత మీడియాకు వెల్లడించారు.ఔత్సాహిక కంపెనీల కోసం అంతర్జాతీయ బిడ్డింగ్ అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఔత్సాహిక కంపెనీలను ఆహ్వానిస్తారు. వీటి నుంచి చివరకు ఐదు సంస్థలను ఎంపికచేస్తారు. ఒక్కో కంపెనీకి 1,200 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తారు. ఏడేళ్ల కాలానికి కాంట్రాక్ట్ అప్పగిస్తారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు తొలి రెండేళ్లలోపు పూర్తిస్థాయిలో తయారీయూనిట్ను స్థాపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐదేళ్లలోపు భూఅయస్కాంతాల తయారీ, విక్రయం, ఎగుమతి మొదలెట్టాలి. రూ.7,280 కోట్ల పథకంలో రూ.6,450 కోట్లను విక్రయాల ప్రోత్సాహకాల కింద కేటాయించారు. 6,000 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్య సాధన కోసం మరో రూ. 750 కోట్లను మూలధన సబ్సిడీగా కేటాయించారు. భారత్‌లో ఏటా విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన రంగం, పారిశ్రామిక ఉపకరణాలు, ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల్లో భూఅయస్కాంతాల వినియోగం పెరుగుతోంది. దీంతో వీటి డిమాండ్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కావొచ్చని ప్రభుత్వం అంచనావేస్తోంది. అంతర్జాతీయంగా భూఅయాస్కాంత ఖనిజాల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛ లోహాల తయారీ రంగంలో చైనా గుత్తాధిపత్యం కొనసాగుతోంది. భారత్‌కు ఏటా 5,000 మెట్రిక్ టన్నుల భూఅయస్కాంతాల అవసరం ఉంది. అయితే ఏడు కీలక భూఅయస్కాంతాలు, వాటి ఉపఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రత్యేక లైసెన్సులు తప్పనిసరి అంటూ ఏప్రిల్ 4న చైనా కఠిన నిబంధనలు అమల్లోకి తేవడంతో భారత్‌సహా ప్రపంచదేశాలకు వీటి కొరత విపరీతంగా ఏర్పడింది. దీంతో భారత్ ఇలా భూఅయస్కాంతాల్లో ఆత్మనిర్భరత దిశగా అడుగులేస్తోంది.ఏమిటీ భూఅయస్కాంతాలు? తక్కువ ఉద్గారాలు, తక్కువ ఇంధన వినియోగం, మెరుగైన సామర్థ్యం, వేగం, దృఢత్వం, వేడిని తట్టుకోవటం వంటి గుణాలతో కూడిన పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాల్లో భూఅయస్కాంతాలనే వాడతారు. అందుకే వీటికి అంతటి డిమాండ్. విద్యుత్, కాంతి సంబంధ, అయస్కాంత, ఉత్ప్రేరక అప్లికేషన్లలో వీటిన ఉపయోగిస్తారు. ఇవి శుద్ధ లోహాల రూపంలో లభించవు. ముఖ్యంగా యురేనియం, థోరియం వంటి రేడియోధారి్మక పదార్థాలతో కలిసి మిశ్రమాలుగా లభిస్తాయి. వీటిని వేరు చేసి, శుద్ధి చేయటం చాలా కష్టమైన పని. భారత్‌లోనూ దాదాపు 72 లక్షల టన్నుల భూఅయస్కాంత నిల్వలున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాల్లోని మోనోజైట్ ఇసుకలో ఈ నిల్వలు అధికంగా ఉన్నాయి. పశి్చమబెంగాల్, జార్ఖండ్, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలోనూ ఇవి ఉన్నాయి. కొత్తరకం ఎల్రక్టానిక్ వస్తువులు, మోటార్లు, ఎనర్జీ టెక్నాలజీ వస్తువులు, స్పీకర్లు, హెడ్ఫోన్లు, ప్రింటర్లు, సీడీ/డీవీడీ డ్రైవ్‌లు, సెన్సార్లు, రాకెట్లు, పవర్‌స్టీరింగ్, విండో లిఫ్ట్, సీట్ మోటార్లలోనూ వీటిని వాడతారు. -
భారత్‌లో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు
భారతదేశంలో అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం రూ.7,280 కోట్ల భారీ పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ‘సింటెర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించే పథకం’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ పథకం ద్వారా దేశీయంగా అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా 6,000 ఎంటీపీఏ (సంవత్సరానికి మెట్రిక్ టన్) సామర్థ్యంతో అరుదైన లోహ అయస్కాంతాలను తయారు చేయాలని నిర్ణయించినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.కీలక రంగాల్లో వీటి ఉపయోగంఈ అరుదైన లోహ అయస్కాంతాలు అనేక కీలక, అత్యాధునిక పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. వీటిలో కింది విభాగాలున్నాయి.ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు)ఏరోస్పేస్ఎలక్ట్రానిక్స్వైద్య పరికరాలురక్షణ రంగంలబ్ధిదారులకు కేటాయింపు, ప్రోత్సాహకాలు.దేశీయంగా ఈ విభాగంలో తయారీని వేగవంతం చేసేందుకు ఈ పథకం ప్రపంచ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మొత్తం సామర్థ్యాన్ని ఐదుగురు లబ్ధిదారులకు కేటాయించాలని భావిస్తోంది. ప్రతి లబ్ధిదారునికి 1,200 ఎంటీపీఏ సామర్థ్యం వరకు కేటాయించనున్నారు.పథకం కాలపరిమితిఈ ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) తయారీ సదుపాయాన్ని ప్రోత్సహించే పథకం వ్యవధి 7 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాలు ఉంటాయి. ఆర్ఈపీఎం అమ్మకంపై ప్రోత్సాహకాన్ని పంపిణీ చేయడానికి 5 సంవత్సరాలు గడువు నిర్ణయించారు.ఇదీ చదవండి: ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ -
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా డీల్
స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలు రక్షణ, అంతరిక్ష రంగంలో కీలక ఉపకరణాల దాకా అన్నింటి తయారీకి అత్యావశ్యకమైన ఖనిజాల సరఫరాపై చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. విదేశాలకు తమ అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయాలంటే కఠిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చైనా మొండికేయడం తెల్సిందే.దీంతో చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, ఆస్ట్రేలియా రూ.75,000 కోట్ల విలువైన చరిత్రాత్మకమైన ‘అరుదైన ఖనిజాల ఒప్పందం’కుదుర్చుకున్నాయి. అధ్యక్షభవనంలో డొనాల్డ్ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.‘‘గత కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఎట్టకేలకు నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో ఏడాదిలోగా మా రెండు దేశా లు భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిల్వలను సాధించనున్నాయి. ఈ నిల్వలతో మేమేం చేస్తామో మీకు కూడా తెలీదు’’అని వ్యాఖ్యానించారు.తొలి ఆరు నెలల్లో ఇరు దేశాలు చెరో 3 బిలియన్ డాలర్ల మేర ఖనిజాల తవ్వకాల ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెడతాయి. ఉపగ్రహాలు, ఎంఆర్ఐ యంత్రాలు, గైడెన్స్ వ్యవస్థలు, లేజర్లు, జెట్ ఇంజిన్లదాకా అన్నింటి తయారీలోనూ అరుదైన భూ మూలకాలనే ఉపయోగిస్తారు. -
ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాలి
న్యూఢిల్లీ: భౌగోళికరాజకీయ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లాంటి ముడి వస్తువులు, ఇతరత్రా టెక్నాలజీలపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాల్సి ఉంటుందని ఆటో విడిభాగాల సంస్థల సంఘం ఏసీఎంఏ ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని, మొబిలిటీ విడిభాగాలకు భారత్‌ను విశ్వసనీయమైన హబ్‌గా నిలబెట్టాలనేదే తమ ఉమ్మడి లక్ష్యమని ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె వివరించారు. ‘కీలకమైన ముడి వస్తువులు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, సెమీకండక్టర్లు మొదలైన వాటి కొరత పెద్ద సవాలుగా మారింది. దీనిపై జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అపారమైన అవకాశాల కూడలిలో మనం ఇప్పుడు ఉన్నాం. కానీ అదే స్థాయిలో సవాళ్లు కూడా ఉన్నాయి. వాణిజ్య యుద్ధాలు, భౌగోళికరాజకీయ ఒడిదుడుకులు, టారిఫ్లపరమైన ఉద్రిక్తతలు, ఎగుమతులపరంగా పరిమితుల్లాంటివన్నీ కూడా సరఫరా వ్యవస్థ స్వరూపాన్ని మార్చివేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక ముడి వస్తువులను దక్కించుకునేందుకు ప్రభుత్వంతో మరింతగా కలిసి పనిచేయాలి. అలాగే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను పటిష్టం చేసుకోవాలి. అంతర్జాతీయంగా పోటీపడే విధంగా మన పరిశ్రమ బలోపేతం కావాలి‘ అని మార్వా చెప్పారు. సరఫరా వ్యవస్థ పటిష్టం కావాలి: సియామ్ మరోవైపు, సరఫరా వ్యవస్థలనేవి కేవలం వ్యయాలను తగ్గించుకునే అంశానికే పరిమితం కాకుండా వైవిధ్యంగా, ఎలాంటి అవాంతరాలెదురైనా నిలదొక్కుకునే విధంగా పటిష్టంగా మారాలని వాహనాల తయారీ సంస్థల సంఘం సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర సూచించారు. ఇందుకోసం వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమో, అలాగే అలాంటి భాగస్వామ్యాలకు దోహదపడేలా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం కూడా ముఖ్యమేనని చంద్ర చెప్పారు. -
ప్రత్యామ్నాయాలపై భారతీయ తయారీదారుల కన్ను
ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ అయస్కాంతాల కొరత వాహన తయారీదారులకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా ఇది ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలోని వారికి తీవ్ర సంకటంగా మారింది. దీనికి తక్షణ పరిష్కారం కనిపించకపోవడంతో ఇండియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం) ఎలక్ట్రిక్ మోటార్లలో అంతర్భాగమైన రేర్ ఎర్త్ అయస్కాంతాలను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంకేతికతలను అన్వేషిస్తున్నాయి.ఈవీ ఉత్పత్తిపై ప్రభావంఎలక్ట్రిక్ వాహనాలకు శక్తినిచ్చే అధిక పనితీరు మోటార్లకు రేర్-ఎర్త్ అయస్కాంతాలు అవసరం. ఇవి వాహనం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పదార్థాలకు సంబంధించి భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా భారీగా దిగుమతి చేసుకునే రేర్-ఎర్త్ రకాలపై ప్రపంచ సరఫరాలో 80% పైగా నియంత్రించేది చైనానే. ఈ దేశం అక్కడి అవసరాలకు భారీగా వినియోగిస్తుంది. ఈ సరఫరా గొలుసు అంతరాయం ఆటోమోటివ్ పరిశ్రమ అంతటా ఆందోళనలు కలిగిస్తోంది. దాంతో భారతీయ ఓఈఎంలు ఒత్తిడికి గురవుతున్నాయి.చైనాకు దరఖాస్తులురేర్ ఎర్త్ అయస్కాంతాల స్థిరమైన సరఫరా కోసం భారత ఆటోమొబైల్ కంపెనీలు చైనాకు 30కి పైగా దరఖాస్తులను సమర్పించాయి. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘హెవీ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కోసం ఎటువంటి దరఖాస్తులు ఇంకా ఆమోదించలేదు. సరఫరా ఎప్పుడు పునప్రారంభమవుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నాం’ అని తెలిపారు.ప్రత్యామ్నాయాల వైపు అడుగులురేర్-ఎర్త్ అయస్కాంతాల సంక్షోభం తీవ్రతరం కావడంతో వీటిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఓఈఎంలు ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంకేతికతలను అన్వేషిస్తున్నాయి. ఏదేమైనా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వీటి అవసరాలు అధికమవుతున్నాయి. సిరామిక్ అయస్కాంతాలు, గ్రాఫీన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం, నానో స్ఫటిక పదార్థాలు, సింథటిక్ మెటిరియోరైట్ అయస్కాంతాలు, ఐరన్ నైట్రైడ్ సూపర్ అయస్కాంతాలు వంటి ప్రత్యామ్నాయాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే వీటి సామూహిక ఉత్పత్తికి వాణిజ్యపరంగా ఆచరణీయ మార్గాలు పరిమితంగా ఉన్నాయని ప్రిమస్ పార్టనర్స్ సలహాదారు అనురాగ్ సింగ్ తెలిపారు. ఇదీ చదవండి: యాపిల్‌కు ట్రంప్ వణుకు?మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కొరతను అధిగమించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎంఅండ్ఎం ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ..‘వచ్చే త్రైమాసికానికి రేర్-ఎర్త్ అయస్కాంతాల స్థానంలో తేలికపాటి రేర్-ఎర్త్ ప్రత్యామ్నాయాలు వాడుతాం. ఈమేరకు చర్యలు ప్రారంభించాం’ అని చెప్పారు.


