ఏఐకి భయపడం  | TCS Pushes Staff To Use AI Tools says CEO K Krithivasan | Sakshi
Sakshi News home page

ఏఐకి భయపడం 

Feb 26 2026 5:41 AM | Updated on Feb 26 2026 7:05 AM

TCS Pushes Staff To Use AI Tools says CEO K Krithivasan

ముంబై: కృత్రిమ మేధ (ఏఐ)తో నెలకొన్న రిస్కుల గురించి తమ సంస్థ భయపడబోదని దేశీ ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఎండీ కె. కృతివాసన్‌ స్పష్టం చేశారు. కంపెనీ ఆదాయం తగ్గినా ఫర్వాలేదు కానీ ఏఐ సాధనాలను వినియోగించుకోవడాన్ని నేర్చుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొత్తం 6 లక్షల మంది ఉద్యోగుల్లో ప్రతీ ఒక్కరు కృత్రిమ మేధలో నిష్ణాతులుగా మారేలా ప్రయతి్నస్తున్నట్లు వివరించారు.

 ఇదే క్రమంలో కొంత భాగం ఆదాయాన్ని కోల్పోయినా, వివిధ ప్రాజెక్టుల్లో ఏఐని ఉపయోగించే విధానాలను అన్వేషించాలని సిబ్బందికి సూచించినట్లు కృతివాసన్‌ తెలిపారు. యువ సిబ్బందితో పోలిస్తే కృత్రిమ మేధ ఆధారిత సొల్యూషన్స్‌ని రూపొందించడంలో సీనియర్‌ ఉద్యోగులు కాస్త నెమ్మదిగా ఉంటున్న విషయాన్ని గమనించినట్లు వార్షిక  నాస్కామ్‌ టెక్నాలజీ, లీడర్‌షిప్‌ ఫోరం (ఎన్‌టీఎల్‌ఎఫ్‌) సదస్సులో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
  
కొత్త ఏఐ నైపుణ్యాలు నేర్చుకునేలా ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేదని, అందరూ వాటిపై ఆసక్తిగానే ఉన్నారని పేర్కొన్నారు. అయితే, నైపుణ్యాలంటే చాట్‌జీపీటీ లాంటి ప్లాట్‌ఫాంకి ప్రాంప్‌్టలు ఇవ్వడం మాత్రమే కాదని, సిబ్బంది శ్రమించి ఏఐ సాధనాలతో కొత్త సొల్యూషన్స్‌ను రూపొందిస్తేనే ప్రయోజనకరమని కృతివాసన్‌ చెప్పారు. ఏఐ ప్రస్తుతం బోర్డు స్థాయి సమావేశాల్లోను ప్రధాన ఎజెండాగా ఉంటోందన్నారు. కొత్త టెక్నాలజీతో ఉత్పాదకత పెరుగుతుందని, కానీ, అలాంటి సాంకేతికతలతో తమ కస్టమర్లకు ఏవిధంగా ప్రయోజనం చేకూర్చగలం అనే అంశంపై కూడా తాము 
ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement