breaking news
South Eastern Coalfields Limited
-
కోల్ ఇండియా రేర్ ఎర్త్ మైనింగ్
న్యూఢిల్లీ: అనుబంధ కంపెనీ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(ఎస్ఈసీఎల్) తాజాగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్గల 7 మైన్ డంప్‌లను గుర్తించినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా వెల్లడించింది. బొగ్గు గనుల వృథా నుంచి విలువను వెలికితీయాలన్న ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా ఎస్ఈసీఎల్ చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. ఈ బాటలో ప్రధాన కోల్ ఫీల్డ్స్వద్ద భారీగా పేరుకుపోయిన డంప్స్ ద్వారా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(ఆర్ఈఈలు)ను గుర్తించినట్లు పేర్కొంది. దీంతో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని ఎస్ఈసీఎల్ చైర్మన్, ఎండీ హరీష్ దుహన్ వివరించారు. వీటి వెలికితీత కోసం ఇప్పటికే టెండరింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. వెరసి ఏడాదిలోగా ఇందుకు వీలున్న డంప్స్ను సైంటిఫిక్ పద్ధతిలో గుర్తించనున్నట్లు తెలియజేశారు. బొగ్గు శాఖ మార్గదర్శకత్వాల ప్రకారం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతకు 7 మైన్ డంప్స్ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఏడాదిలోగా ఆర్థికంగా ఉపయుక్తమైన ప్రాంతాలను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్స్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ రంగ పరికరాలు, ఎలక్ట్రికల్ వాహనాలు తదితర హైటెక్ పరిశ్రమలలో ఇవి కీలకంకాగా.. అంతర్జాతీయస్థాయిలో వీటి సరఫరాలకు చైనా ఆధిపత్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలతొ కోల్ ఇండియా షేరు 2% ఎగసి రూ. 438 వద్ద ముగిసింది. -
సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్..332పోస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్.. మైనింగ్ సిర్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 332 (జనరల్-167, ఓబీసీ-43, ఎస్సీ-46, ఎస్టీ-76) వేతనం రూ.19,035+అలవెన్సులు విద్యార్హత 1.పదో తరగతి/తత్సమానం. 2.ధన్‌బాద్‌లోని ‘డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) జారీ చేసిన సిర్దార్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ (లేదా) గుర్తింపు పొందిన సంస్థ నుంచి మూడేళ్ల మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ సర్టిఫికెట్, డీజీఎంఎస్ జారీచేసిన ఓవర్‌మ్యాన్స్ కాంపిటెన్సీ సర్టిఫికెట్. 3.ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ 4.గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్ వయసు 2016, సెప్టెంబర్ 30 నాటికి కనీసం 18 ఏళ్లు. గరిష్టం 30 ఏళ్లు (ఓసీ), 33 ఏళ్లు (ఓబీసీ), 35 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ). ఎంపిక విధానం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ ప్రింటౌట్‌కు విద్యార్హత, వయసు తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి సంస్థ అడ్రస్‌కు పంపాలి. చిరునామా ‘జనరల్ మేనేజర్ (మ్యాన్ పవర్), సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, పోస్ట్ బాక్స్ నంబర్-60, బిలాస్పూర్, ఛత్తీస్‌గఢ్, 495006. ముఖ్య తేదీలు 1.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2016, సెప్టెంబర్ 20 2.అప్లికేషన్ హార్డ్ కాపీని రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్‌లో పంపేందుకు చివరి తేది: 2016, సెప్టెంబర్ 30. వెబ్సైట్: www.secl.gov.in


