సాక్షి, వేంపల్లి: వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లిలో పంచాయతీ ఎన్నికల వేళ కౌంటింగ్ కేంద్రం మార్పు వివాదానికి దారితీసింది. రేపు పోలింగ్, కౌంటింగ్ జరగాల్సి ఉండగా అధికారులు అకస్మాత్తుగా కేంద్రాన్ని మార్చడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తొలుత షాదీఖానాలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని తాజాగా సభా భవనానికి మారుస్తూ ఎంపీడీవో కుళాయమ్మ నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషంలో ఇలాంటి మార్పులు చేయడం ఏమిటంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
కేవలం కౌంటింగ్ కేంద్రం విషయంలోనే కాకుండా, గతంలో నామినేషన్ల స్వీకరణ సమయంలోనూ అధికారులు కేంద్రాన్ని మార్చారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తొలుత పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని అకస్మాత్తుగా సచివాలయానికి మార్చారని తెలిపారు. ఇప్పుడు మరోసారి కౌంటింగ్ కేంద్రాన్ని మార్చడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
కూటమి నేతల ఒత్తిడితోనేనా?
కూటమి నేతల ఒత్తిడితోనే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా, ఎన్నికల ప్రక్రియలో ఇబ్బందులు సృష్టించేందుకు కేంద్రాలను మారుస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తోంది. కూటమి నేతల ఒత్తిడికి అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. మరోవైపు పోలింగ్, కౌంటింగ్‌కు ఒక్కరోజు ముందు కేంద్రం మార్పు చేయడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఈ మార్పుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: జనసేనకు బ్రేక్‌లు.. నాగబాబుపై నెటిజన్ల పంచ్‌లు!


