విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న వరలక్ష్మి, సింహాద్రి దంపతులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తమ కార్యకర్తలు, బంధువులపై దాడి చేసి, తిరిగి తమపైనే కేసులు పెట్ట డం దారుణమని 14వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి కాసరపు వరలక్ష్మి వాపోయారు. కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను తర లించే సమయంలో తమ వారిపై టీడీపీ నాయకు లు తుమ్మల సునీత, ఆమె భర్త రమేష్ దాడి చేశా రని తెలిపారు. 14వ డివిజన్‌లో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో వరలక్ష్మి , ఆమె భర్త సింహాద్రి మాట్లాడారు.
సింహాద్రి మాట్లాడు తూ, తాను 1998 నుంచి టీడీపీకి సేవ చేశానని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు బీ–ఫారం ఇస్తానని చెప్పి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మోసం చేశారన్నారు. నామినేషన్ ఆఖరు రోజున కూడా సీటు తనదేనని ఎమ్మెల్యే చెప్పారని, చివరకు తనకు అన్యాయం చేశారని చెప్పారు. తుమ్మల సునీత, రమే‹Ùలకు 14, 15 డివిజన్లలో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారన్నారు. తనను మోసం చేశారనే ఆవేదనతో తన భార్యను ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపానని చెప్పారు.
నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచీ తమను చంపుతామని తుమ్మల రమేష్, సునీత బెదిరించారన్నారు. డివిజన్‌లోని ప్రజలు తన వెంట ఉండటంతో నామినేషన్ వేశానన్నారు. ఎన్నికల రోజు సాయంత్రం తన మేనల్లుడు సోమరాజును కొట్టారన్నారు. 14, 15 డివిజన్లలో టీడీపీ ఓటమి పాలవుతుందని తెలిసి 7 గంటల ప్రాంతంలో బాలింతరాలని కూడా చూడకుండా తమ బంధువుల అమ్మాయిని తుమ్మల సునీత కొట్టిందన్నారు. అయినప్పటికీ కేసులు నమోదు చేయని పోలీసులు తమ బంధువులను స్టేషన్‌కు తీసుకెళ్లారన్నారు. 30 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొన్న తమపై కేసులు పెట్టి బాధించడం సరైన విధానం కాదని సింహాద్రి అన్నారు.


