సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్..332పోస్టులు | 332 posts in South Eastern Coalfields Limited | Sakshi
Sakshi News home page

సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్..332పోస్టులు

Aug 30 2016 11:06 PM | Updated on Sep 4 2017 11:35 AM

ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్.. మైనింగ్ సిర్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్.. మైనింగ్ సిర్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు  ఆహ్వానిస్తోంది.
 
 మొత్తం పోస్టులు: 332
 (జనరల్-167, ఓబీసీ-43,
 ఎస్సీ-46, ఎస్టీ-76)
 
 వేతనం

 రూ.19,035+అలవెన్సులు
 
 విద్యార్హత
 1.పదో తరగతి/తత్సమానం.
 2.ధన్‌బాద్‌లోని ‘డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) జారీ చేసిన సిర్దార్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ (లేదా) గుర్తింపు పొందిన సంస్థ నుంచి మూడేళ్ల మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ సర్టిఫికెట్, డీజీఎంఎస్ జారీచేసిన ఓవర్‌మ్యాన్స్ కాంపిటెన్సీ సర్టిఫికెట్.
 
 3.ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్
 4.గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్
 వయసు
  2016, సెప్టెంబర్ 30 నాటికి కనీసం 18 ఏళ్లు. గరిష్టం 30 ఏళ్లు (ఓసీ), 33 ఏళ్లు (ఓబీసీ), 35 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ).
 
 ఎంపిక విధానం
 రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
 
 దరఖాస్తు విధానం
 ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ ప్రింటౌట్‌కు విద్యార్హత, వయసు తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి సంస్థ అడ్రస్‌కు పంపాలి.
 
 చిరునామా

 ‘జనరల్ మేనేజర్ (మ్యాన్ పవర్),    సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, పోస్ట్    బాక్స్ నంబర్-60, బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్, 495006.
 
 ముఖ్య తేదీలు  
 1.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2016, సెప్టెంబర్ 20
 2.అప్లికేషన్ హార్డ్ కాపీని రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్‌లో పంపేందుకు చివరి తేది: 2016, సెప్టెంబర్ 30.  
 వెబ్‌సైట్: www.secl.gov.in
 

Advertisement
Advertisement