న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ 25 పరుగులు చేయగలిగాడు. వన్‌డన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 21, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 17 పరుగులతో నిరాశపరిచారు.
కష్టాల్లో టీమిండియా
వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సైతం (39 బంతుల్లో 23) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో వంద పరుగుల స్కోరుకే ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఇలాంటి తరుణంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ కలిసి పట్టుదలగా నిలబడే ప్రయత్నం చేశారు.
అయితే, శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి వాషీ నాథన్ స్మిత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు చేసి నిష్క్రమించాడు. ధ్రువ్ జురెల్ 45 బంతుల్లో ఓ ఫోర్ బాది ఏడు పరుగులతో అజేయంగా నిలిచాడు.
A WICKET AT THE WORST TIME! 😧 Washington Sundar nicks one to Tom Latham to bring Day 2 to a tough close. 😬 Watch the HERO VIDA India Tour of New Zealand 2nd Test, Day 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/FDAtRZXkGl
— Sony Sports Network (@SonySportsNetwk) November 28, 2026
91 బంతుల్లో 12 పరుగులు
వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 91 బంతుల్లో 12 పరుగులు జోడించారు. తద్వారా టెస్టు ఇన్నింగ్స్‌లో టీమిండియా తరఫున ఏ వికెట్‌కైనా రన్‌రేటు పరంగా అత్యల్ప భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చెత్త రికార్డు మూటగట్టుకున్నారు.
కాగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌తో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేసి శనివారం ఆలౌట్ అయింది. ఇక భారత్ శనివారం ఆట పూర్తయ్యేసరికి 46 ఓవర్లలో కేవలం 116 పరుగులు చేసి ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది.
టెస్టు ఇన్నింగ్స్‌లో టీమిండియా తరఫున ఏ వికెట్‌కైనా రన్‌రేటు పరంగా అత్యల్ప భాగస్వామ్యం నెలకొల్పిన జోడీలు
👉ధ్రువ్ జురెల్- వాషింగ్టన్ సుందర్: 2026లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 0.79 (ఆరో వికెట్‌కు 91 బంతుల్లో 12 పరుగులు)
👉రాహుల్ ద్రవిడ్- సచిన్ టెండుల్కర్: 1999లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 1.13 (నాలుగో వికెట్‌కు 90 బంతుల్లో 17 పరుగులు)
👉రాహుల్ ద్రవిడ్- సచిన్ టెండుల్కర్: 2001లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 1.15 (మూడో వికెట్‌కు 114 బంతుల్లో 22 పరుగులు)
👉రాహుల్ ద్రవిడ్- ఇర్ఫాన్ పఠాన్: 2004లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 1.17 (ఏడో వికెట్‌కు 164 బంతుల్లో 32 పరుగులు)
👉రాహుల్ ద్రవిడ్- వీవీఎస్ లక్ష్మణ్: 2006లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మూడో వికెట్‌కు 157 బంతుల్లో 31 పరుగులు.
ఇదీ చదవండి: IND vs NZ: రిషభ్ పంత్ ప్రపంచ రికార్డు


