రోహిత్‌తో సూర్య (PC: BCCI/IPL X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన టీమిండియా దిగ్గజ సారథి.. రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమించింది. ముంబై ఇండియన్స్‌కు 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోఫీ అందించిన 39 ఏళ్ల రోహిత్.. మూడు సీజన్‌ల విరామం తర్వాత మళ్లీ ముంబై పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘ముంబై కా రాజా’ తిరిగి వచ్చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఆటగాడు, రోహిత్ మాదిరే టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
నాయకుడు.. సోదరుడు.. మార్గ నిర్దేశకుడు
రోహిత్ తిరిగి కెప్టెన్‌గా నియమితుడైన విషయాన్ని పంచుకుంటూ.. ‘‘నాయకుడు.. సోదరుడు.. మార్గ నిర్దేశకుడు.. ముంబై అభిమానులారా సీట్ బెల్ట్ బిగించి పెట్టుకోండి’’ అని సూర్య ఇన్‌స్టా స్టోరీలో రాశాడు. ఇక తన పునర్నియామకంపై రోహిత్ శర్మ స్పందిస్తూ... ‘ఐపీఎల్ 20వ సీజన్‌కు సిద్ధంగా ఉన్నా. మా అభిమానులు గర్వించేలా ఆడటమే లక్ష్యం. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా.
నీతా అంబానీ, ఆకాశ్ అంబానీతో చర్చలు ఉత్సాహాన్ని ఇచ్చాయి. కలిసికట్టుగా ఆడి ఆటను ఆస్వాదించేందకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు. కాగా గత మూడు సీజన్‌లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు బదిలీ చేసి అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను ముంబై ఎంచుకుంది.
పాండ్యా సారథ్యంలో విఫలం
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు తిరిగి సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా 2013లో తొలిసారి ముంబై ఇండియన్స్ సారథిగా బాధ్యతలు అందుకున్న రోహిత్ 2023 వరకు కొనసాగాడు. అనంతరం రోహిత్ నుంచి సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇక 2020లో చివరిసారి ట్రోఫీ గెలిచిన ముంబై జట్టు ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమైంది. 2024లో పదో స్థానంలో నిలిచిన ముంబై... 2025లో క్వాలిఫయర్–2లో ఓటమి పాలైంది.
ఇక ఈ ఏడాది పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో తిరిగి తమ విజయవంతమైన సారథికే జట్టు బాధ్యతలు అప్పగించాలని ముంబై యాజమాన్యం నిర్ణయించింది. ఐపీఎల్‌లో 281 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 7,329 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లి (9,336) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. కెపె్టన్‌గా 158 మ్యాచ్‌లాడిన రోహిత్ 87 విజయాలు అందించాడు.
ఇదీ చదవండి: IND vs NZ: రిషభ్ పంత్ ప్రపంచ రికార్డు


