PC: BCCI X
బెంగాల్ వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టీమిండియాకు ఆడి చాలా కాలమే అయింది. టెస్టుల్లో చివరగా 2023లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. 2025లో వన్డే, టీ20లు ఆడాడు. దేశీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో రాణించినా 36 ఏళ్ల షమీని టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు.
టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్
ముఖ్యంగా మాజీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పరోక్షంగా షమీ లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తూ.. అతడు పునరాగమనం చేసే అవకాశాలు లేవనే సూచనలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ యూపీ ఆటగాడు ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని షమీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన అతడికి వన్డే ప్రపంచకప్-2027, టీ20 ప్రపంచకప్-2028 టోర్నీ ప్రణాళికల గురించి ప్రశ్న ఎదురైంది.
అసలు ఆ ఆలోచనే లేదు
ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు ఆ విషయాల గురించి నేను ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఆటను మరింతగా మెరుగుపరచుకోవడం మీదే ఉంది. సెలక్టర్లు నాకు బెస్ట్ అనిపించే నిర్ణయమే తీసుకుంటారు. నేను మాత్రం రీఎంట్రీ గురించి అసలు ఆలోచించడం లేదు.
బిందాస్‌గా ఆడుకుంటాను
బెంగాల్ తరఫున దేశీ క్రికెట్, ఐపీఎల్‌లో రాణించడంపైనే దృష్టి సారించాను. ప్రస్తుతం నా ఆటను ఆస్వాదిస్తున్నాను. రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి మంచి పనే చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు బిందాస్‌గా వైట్ బాల్ క్రికెట్ ఆడుకోవచ్చు.
లేదంటే నా శరీరం తీవ్రమైన శ్రమకు గురికావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ భారం తగ్గిపోయింది’’ అని షమీ క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున 64 టెస్టు మ్యాచ్‌లు ఆడిన షమీ.. 229 వికెట్లు కూల్చాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 296, టీ20లలో 27 వికెట్లు పడగొట్టాడు.
ఇవీ చదవండి: NZ Vs IND: కన్నీళ్లను దాచేసిన సిరాజ్!.. ఎందుకిలా చేస్తున్నారు?
రుతురాజ్‌పై వేటు!.. మళ్లీ కెప్టెన్‌గా పృథ్వీ షా.. మారని జట్టు రాత!


