32 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన మాజీ కెప్టెన్‌ | Former Tamil Nadu Captain Baba Aparajith Retires From Professional Cricket at 32 | Sakshi
Sakshi News home page

32 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన మాజీ కెప్టెన్‌

Nov 26 2026 2:25 PM | Updated on Nov 26 2026 2:25 PM

Former Tamil Nadu Captain Baba Aparajith Retires From Professional Cricket at 32

source: X

తమిళనాడు మాజీ కెప్టెన్‌, భారత అండర్‌-19 ప్రపంచకప్‌ విజేత జట్టు సభ్యుడు బాబా అపరాజిత్‌ ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 32 ఏళ్ల వయసులోనే 15 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. ఈ విషయాన్ని నవంబర్‌ 26న సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. దేశవాళీ సీజన్‌ కొనసాగుతుండగానే అపరాజిత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ అపరాజిత్‌ సోషల్‌ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. తన క్రికెట్‌ ప్రయాణంలో సహకరించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ (TNCA), కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ (KCA)లకు కృతజ్ఞతలు తెలిపాడు.

ఆటగాడిగా మైదానానికి దూరమైనప్పటికీ, క్రికెట్‌కు ఇతర మార్గాల్లో సేవలందించాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. తన కెరీర్‌లో ఎక్కువ భాగం తమిళనాడు తరఫున ఆడిన అపరాజిత్‌.. ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

102 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 39 సగటున 5199 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2024-25 దేశవాళీ సీజన్‌లో మెరుగైన అవకాశాల కోసం తమిళనాడు నుంచి కేరళకు మారిన అపరాజిత్‌.. ఆశించిన అవకాశాలు రాకపోవడంతో చివరికి క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

అండర్‌-19 ప్రపంచకప్‌ విజయంలో కీలక పాత్ర
అపరాజిత్‌ క్రికెట్‌ ప్రయాణంలో 2012 అండర్‌-19 ప్రపంచకప్‌ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌ టైటిల్‌ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 171 పరుగులు చేయడంతో పాటు, తన ఆఫ్‌ స్పిన్‌తో ఐదు వికెట్లు పడగొట్టాడు.

అపరాజిత్‌ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK), రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ (RPSG) జట్లలో చోటు దక్కించుకున్నప్పటికీ..  ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.

ఇదీ చదవండి: రిషభ్‌ పంత్‌ విధ్వంసం.. 21 బంతుల్లోనే..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement