రిషభ్‌ పంత్‌ విధ్వంసం.. 21 బంతుల్లోనే.. | Rishabh Pant Appearance in Christchurch local match 21 ball power show | Sakshi
Sakshi News home page

రిషభ్‌ పంత్‌ విధ్వంసం.. 21 బంతుల్లోనే..

Nov 26 2026 11:32 AM | Updated on Nov 26 2026 11:32 AM

Rishabh Pant Appearance in Christchurch local match 21 ball power show

రిషభ్‌ పంత్‌ (PC: BCCI X)

వెల్లింగ్‌టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. మొత్తంగా 153 బంతులు ఎదుర్కొని... పది ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 128 పరుగులు సాధించాడు.

ఈ క్రమంలో SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆసియా క్రికెటర్‌గా పంత్‌ రికార్డులకెక్కాడు. మొత్తంగ SENA దేశాల్లో టెస్టు క్రికెట్‌లో అతడు 50 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. ఇక క్రైస్ట్‌చర్చ్‌లో శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టులోనూ రాణించాలని ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ పట్టుదలగా ఉన్నాడు.

సిక్సర్ల వర్షం
అయితే, అంతకంటే ముందే రిషభ్‌ పంత్‌ న్యూజిలాండ్‌ గడ్డ మీద సిక్సర్ల వర్షం కురిపించాడు. రెండో టెస్టుకు వేదికైన హగ్లే ఓవల్‌ మైదానానికి దగ్గరలో ఉన్న ఓ పార్కులో పంత్‌ క్లబ్‌ క్రికెట్‌ ఆడాడు. ఓపెన్‌ హౌజ్ స్వింగర్స్‌ జట్టు ఆటగాడు మహ్మద్‌ సఫీ కోరిక మేరకు బ్యాట్‌ పట్టిన పంత్‌.. ‘ది చూసెన్‌ వన్స్‌’ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

21 బంతుల్లోనే 
కేవలం 21 బంతుల్లోనే 54 పరుగులతో విధ్వంసం సృష్టించిన పంత్‌.. మొత్తంగా 26 బంతుల్లోనే 72 పరుగులు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మాతో కలిసి ఆడాడు
ఈ విషయం గురించి ఓపెన్‌ హౌజ్ స్వింగర్స్‌ జట్టు ఆటగాడు మహ్మద్‌ సఫీ మాట్లాడుతూ.. ‘‘రిషభ్‌ పంత్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ మీద వెళ్లడం చూశాను. అతడిని ఆపి.. ఫొటోలు తీసుకున్నాము. ఆ తర్వాత కాసేపటికి మాతో కలిసి ఆడతావా? అని అడిగాను. 

అందుకు అతడు సరేనన్నాడు. మీ కోసం వచ్చి ఆడతాను అన్నాడు. అన్నట్లుగానే ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్‌కు వచ్చి సిక్సర్లు బాదాడు’’ అని సంతోషం వ్యక్తం చేశాడు.

గొప్ప విషయం
ఇక టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ పంత్‌ చర్య పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పంత్‌ అలా గార్డెన్‌లో ఆడటం చూసి నమ్మలేకపోయానన్నాడు. ఇక న్యూజిలాండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌.. న్యూజిలాండ్‌లో పంత్‌ క్లబ్‌ ఆటగాళ్లతో కలిసి ఆడటం గొప్ప విషయమని కొనియాడాడు. 

కాగా టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనలో చివరిదైన రెండో టెస్టు శుక్రవారం నుంచి మొదలుకానుండగా.. ఇందుకు క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్‌ మైదానం వేదిక. 

ఇవీ చదవండి: వైభవ్‌ ప్రతిభావంతుడే.. కానీ ఇదేం పద్ధతి?
అతడు సూపర్‌ బౌలర్‌.. అరంగేట్రానికి సిద్ధమే: టీమిండియా కోచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement