PC: CA/X
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన పుస్తకం ‘సబర్’లో ప్రస్తావించిన ‘సాండ్‌పేపర్ గేట్’ వివాదం ఆసీస్ క్రికెట్‌లో ప్రకంపనలు రేపింది. దక్షిణాఫ్రికాతో ఎనిమిదేళ్ల క్రితం నాటి టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడినందుకు అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బౌలర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం పడిన సంగతి తెలిసిందే.
అయితే, నాడు జట్టులో ప్రతీ ఒక్కరికి తాము బాల్ టాంపరింగ్ చేస్తున్న విషయం తెలుసు అంటూ ఖవాజా తాజాగా తన పుస్తకంతో బాంబు పేల్చాడు. ప్రతీ ఆటగాడు ఇందులో భాగమే అయినా ముగ్గురు మాత్రమే బలిపశువులు అయ్యారని ఆరోపించాడు. దీంతో ఆసీస్ క్రికెట్‌పై తీవ్ర విమర్శలు రాగా.. ప్రస్తుత టెస్టు జట్టు కెప్టెన్, నాడు జట్టులో భాగమైన ప్యాట్ కమిన్స్ తీవ్రంగా స్పందించాడు.
కొట్టిపారేసిన కమిన్స్
దాదాపు గంటకు పైగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కమిన్స్.. ఖవాజా చేసిన ఆరోపణలు నిజం కాదని కొట్టిపారేశాడు. అతడు రాసింది వంద శాతం తప్పు అని.. ఇదంతా చెత్త అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో కమిన్స్ వ్యాఖ్యలపై ఖవాజా తాజాగా స్పందించాడు.
ది గ్రేడ్ క్రికెటర్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగా, నాయకుడిగా ప్యాట్ కమిన్స్ అంటే నాకెంతో ఇష్టం. లీడర్‌గా అతడు గొప్పవాడు. కానీ అలాంటి వ్యక్తి నన్ను వ్యక్తిగతంగా ఇంతలా విమర్శిస్తాడని అస్సలు ఊహించలేదు.
నువ్వు బాగానే ఉన్నావా?
అసలు కమిన్స్‌లో ఇలాంటి ఒక కోణం ఉందని నాకు తెలియదు. అతడి మాటలు నన్ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అతడి ప్రెస్‌మీట్ నేను చూడాలనుకోలేదు. కానీ చూడక తప్పలేదు. ఆ సమయంలో నా భార్య రేచల్ నా పక్కనే ఉంది. కమిన్స్ మాటల్ని ఆమె కూడా నమ్మలేకపోయింది. గడియ గడియకు.. ‘నువ్వు బాగానే ఉన్నావా’ అంటూ నా గురించి ఆందోళన చెందింది.
నిజంగా ఆ సమయంలో నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. తనకి సమాధానం ఇచ్చే పరిస్థితిలో కూడా లేను. నాకు ప్యాటీతో ఎలాంటి సమస్యా లేదు. క్రికెట్ ఆస్ట్రేలియాలో కొంతమంది వల్లే ఇదంతా జరుగుతోంది. ప్యాటీకి బదులు ఆ వ్యక్తులు మాట్లాడి ఉంటే బాగుండేది.
ప్యాటీ పట్ల నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు
ఇది కేవలం కమిన్స్ సమస్య కాదు. ఇది క్రికెట్ ఆస్ట్రేలియా సమస్య. ఏం చేసినా సరే గెలవాలనే కసి కోచ్‌లు, కొంతమంది ప్లేయర్లను ఎంతకైనా దిగజారేలా చేసింది. ఈ విషయంలో మార్పు రావాలి. ప్యాటీ పట్ల నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. నేను ఎవరిపై అయినా ద్వేషం పెంచుకునే వ్యక్తిని కాదు’’ అని ఖవాజా ఉద్వేగానికి లోనయ్యాడు.
ఇవీ చదవండి: Asia Cup Rising Stars: సెమీ ఫైనల్స్ షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
‘ఆర్సీబీ నన్ను కొనకపోయినా పర్లేదు.. అతడికి పోటీగానైనా ఆడతా’


