source: X
క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటనకు మహిళల బిగ్‌బాష్ లీగ్ 2027 వేదికైంది. ఈ టోర్నీలో భాగంగా బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ప్లేయర్ డియాండ్రా డాటిన్ విచిత్ర పరిస్థితుల్లో ఔటైంది.
డాటిన్ బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రావడానికి 75 సెకన్లకంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో ప్రత్యర్థి బౌలర్ సారా గ్లెన్‌కు వికెట్లపై బంతి వేసే అవకాశం లభించింది. ఆమె వేసిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో డాటిన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్‌కు చేరింది.
ONE OF THE RARE DISMISSAL IN CRICKET HISTORY 🤯 Deandra Dottin was late to arrive in the middle so Sarah Glenn got a free delivery to dismiss her by hitting the stumps as per rule & Dottin is gone. ❌ https://t.co/LYEoAj1jnp
— Johns. (@CricCrazyJohns) November 25, 2026
డబ్ల్యూబీబీఎల్, బీబీఎల్ టోర్నీల్లో ఆట ఆలస్యాన్ని తగ్గించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కొత్త బ్యాటర్ 75 సెకన్లలోపు క్రీజులోకి వచ్చి సిద్ధంగా ఉండాలి.
ఆ గడువు దాటితే బ్యాటర్‌ను వికెట్ల ముందు నుంచి పక్కకు తప్పించి బౌలర్‌కు ఖాళీ వికెట్లపై బంతి వేసే అవకాశం ఇస్తారు. ఆ బంతి వికెట్లను తాకితే బ్యాటర్ ఔటవుతారు. ఒకవేళ బంతి వికెట్లను తాకకపోతే బ్యాటర్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించవచ్చు.
పై ఉదంతంలో సారా గ్లెన్ వేసిన బంతి వికెట్లను తాకడంతో డియాండ్రా డాటిన్ ఔటైంది. సాధారణ టైమ్‌డ్ ఔట్‌లో బ్యాటర్‌పై అప్పీల్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ డబ్ల్యూబీబీఎల్ నిబంధనలో ఆలస్యమైన బ్యాటర్‌కు ఖాళీ వికెట్లపై బంతి ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే ఈ ఘటనలో ప్రత్యేకత.
క్రికెట్ చరిత్రలో డాటిన్ ఔటైన తీరు కనీవినీ ఎరుగనది అయినప్పటికీ.. సాధారణ టైమ్‌డ్ ఔట్ ఉదంతాలు మాత్రం కొన్ని చోటు చేసుకున్నాయి.
సాధారణ క్రికెట్ నిబంధనల ప్రకారం.. వికెట్ పడిన తర్వాత వచ్చే బ్యాటర్ నిర్ణీత సమయంలో క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉండాలి. అలా చేయకపోతే ప్రత్యర్థి జట్టు అప్పీల్‌పై వారిని 'టైమ్‌డ్ ఔట్'గా ప్రకటించవచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌లో సాధారణంగా ఇందుకు రెండు నిమిషాల గడువు ఉంటుంది. అయితే, ఈ నిబంధనను అమలు చేసే విధానం టోర్నీ ప్లేయింగ్ కండిషన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఉదంతాలు రెండు సార్లు చోటు చేసుకున్నాయి. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఏంజెలో మాథ్యూస్, 2023లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ఘనా ఆటగాడు గాడ్‌ఫ్రెడ్ బకీవేయెమ్ టైమ్‌డ్ ఔటయ్యాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇలాంటి ఉదంతాలు ఏడు సార్లు చోటు చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: అగ్రపీఠం దిశగా దూసుకొచ్చిన బుమ్రా.. పంత్, గిల్‌కు ప్రమోషన్


