వైభవ్‌ ప్రతిభావంతుడే.. కానీ ఇదేం పద్ధతి? | Sanjay Manjrekar Questions Bat Ball Balance After Vaibhav 53 Ball 204 | Sakshi
Sakshi News home page

వైభవ్‌ ప్రతిభావంతుడే.. కానీ ఇదేం పద్ధతి?

Nov 26 2026 8:59 AM | Updated on Nov 26 2026 9:07 AM

Sanjay Manjrekar Questions Bat Ball Balance After Vaibhav 53 Ball 204

వైభవ్‌ సూర్యవంశీ (PC: BCCI X)

టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌-2026 వన్డే టోర్నీలో యూఏఈతో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. కేవలం 53 బంతుల్లోనే ఏకంగా 204 పరుగులు సాధించాడు.

రికార్డు డబుల్‌ సెంచరీ
ఖతార్‌లోని దోహా వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఏడు ఫోర్లతో పాటు ఏకంగా 28 సిక్సర్ల సాయంతో రికార్డు డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. యూఏఈ బౌలర్లకు పీడకల మిగిల్చి.. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు.

ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ పవర్‌ హిట్టింగ్‌ సామర్థ్యంపై ప్రశంసలు కురుస్తుండగా.. భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఈ బిహారీ పిల్లాడిని పొగుడుతూనే.. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో బౌలర్లకు అన్యాయం జరుగుతోందని వాపోయాడు.

వైభవ్‌ ప్రతిభావంతుడే.. కానీ ఇదేం పద్ధతి?
ఈ మేరకు.. ‘‘వైభవ్‌ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వైట్‌ బాల్‌ క్రికెట్ ఏ స్థాయికి దిగజారిందో అతడు మరోసారి నిరూపించాడు. 

క్రికెట్‌ అభిమానులు ఇది మాత్రమే కోరుకుంటున్నారని అనుకుంటే మాత్రం తప్పే అవుతుంది. ఇది బ్యాట్‌, బాల్‌ గేమ్‌. కేవలం బ్యాట్‌ మాత్రమే మాట్లాడకూడదు’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ ఆధునిక తరం పిచ్‌ల రూపకల్పన తీరును విమర్శించాడు.

ఇవీ చదవండి: Asia Cup Rising Stars: సెమీ ఫైనల్స్‌ షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు
నా విధ్వంసానికి కార‌ణం అత‌డే: వైభ‌వ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement