అజేయంగా.... | Indian team wins the last fifth league match against Japan | Sakshi
Sakshi News home page

అజేయంగా....

Nov 26 2026 3:37 AM | Updated on Nov 26 2026 3:37 AM

Indian team wins the last fifth league match against Japan

భోపాల్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ లీగ్‌ దశను అజేయ విజయంతో ముగించింది. జపాన్‌తో జరిగిన చివరిదైన ఐదో లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 4–0తో గెలిచింది. భారత్‌ తరఫున దీపిక (16వ, 48వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... లాల్‌రెమ్‌సియామి (12వ ని.లో), నేహా (28వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. లీగ్‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్‌ 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రేపు జరిగే సెమీఫైనల్స్‌లో మలేసియాతో భారత్‌; జపాన్‌తో చైనా ఆడతాయి. తాజా గెలుపుతో భారత జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకి తమ అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement