హెడ్‌కోచ్‌గా కేన్‌ విలియమ్సన్‌.. ప్రకటన విడుదల | Kane Williamson Appointed As SA20 Durban Super Giants Head Coach Kane Williamson Appointed As SA20 Durban Super Giants Head Coach | Sakshi
Sakshi News home page

హెడ్‌కోచ్‌గా కేన్‌ విలియమ్సన్‌.. ప్రకటన విడుదల

Nov 25 2026 7:07 PM | Updated on Nov 25 2026 7:15 PM

Kane Williamson Appointed As SA20 Durban Super Giants Head Coach Kane Williamson Appointed As SA20 Durban Super Giants Head Coach

కేన్‌ విలియమ్సన్‌ (PC: Blackcaps X/DSG X)

న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజం కేన్‌ విలియమ్సన్‌ కొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ (SA20)-2027 సీజన్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ హెడ్‌కోచ్‌గా పనిచేయనున్నాడు.

ప్రకటన విడుదల
ఈ మేరకు విలియమ్సన్‌కు బాధ్యతలు అప్పగించినట్లు సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం బుధవారం ప్రకటన విడుదల చేసింది. లాన్స్‌ క్లూసెనర్‌ స్థానంలో ఈ కివీస్‌ మాజీ కెప్టెన్‌ హెడ్‌కోచ్‌గా పనిచేయనున్నట్లు తెలిపింది. కాగా లీగ్‌ అరంగేట్ర 2023 సీజన్‌ నుంచి జట్టుతో ఉన్న క్లూసెనర్‌తో డర్బన్‌ ఫ్రాంఛైజీ యాజమాన్యం తెగదెంపులు చేసుకుంది.

ఐపీఎల్‌లో వ్యూహాత్మక సలహాదారుగా
కాగా కేన్‌ విలియమ్సన్‌ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే, ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగ్‌లలో ఆడిన అనుభవం అతడికి ఉంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లకు ఆడాడు. అనంతరం లక్నో సూపర్‌ జెయింట్స్‌ వ్యూహాత్మక సలహాదారుగా లీగ్‌లోకి తిరిగి వచ్చాడు.

ఆటగాడిగా రిటైన్‌ చేసుకుని
తాజాగా సూపర్‌ జెయింట్స్‌ కుటుంబానికి చెందిన డర్బన్‌ జట్టుకు కేన్‌ విలియమ్సన్‌ హెడ్‌కోచ్‌గా నియమితుడు కావడం గమనార్హం. 2025, 2026 సీజన్లలో డర్బన్‌ జట్టుకు ఈ కివీస్‌ దిగ్గజం ఆడటం విశేషం. రెండు సీజన్లలో 15 మ్యాచ్‌లలో కలిపి కేన్‌ మామ 343 పరుగులు సాధించాడు. అంతేకాదు 2027 వేలానికి ముందు ఆటగాడిగా యాజమాన్యం అతడిని రిటైన్‌ చేసుకుంది. అయితే, ఇప్పుడు హెడ్‌కోచ్‌గా కొత్త బాధ్యతలు అప్పగించింది.

కేన్‌ విలియమ్సన్‌తో పాటు టామ్‌ మూడీ డర్బన్‌ జట్టులో భాగమయ్యాడు. డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా అతడు వ్యవహరిస్తాడు. మిగిలిన కోచింగ్‌ స్టాఫ్‌ గురించి స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. జనవరి 19న ప్రిటోరియా క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో సూపర్‌ జెయింట్స్‌ వచ్చే సీజన్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగ్‌లలో ఆడిన కేన్‌ మామ
కాగా కేన్‌ విలియమ్సన్‌ చివరగా ఈ ఏడాది జనవరిలో టీ20 ఫార్మాట్లో ఆడాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాజ్‌షాహి వారియర్స్‌ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి 69 పరుగులు చేశాడు. ది హండ్రెడ్‌ 2025 లీగ్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 204 పరుగులు సాధించాడు.

ఇక మొత్తంగా తన టీ20 క్రికెట్‌ కెరీర్‌లో కేన్‌ మామ.. 293 మ్యాచ్‌లలో 7454 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 26 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌, ఎస్‌ఏ20, బీపీఎల్‌, సీపీఎల్‌, విటలిటి బ్లాస్ట్‌, ది హండ్రెడ్‌ లీగ్‌లలో కేన్‌ విలియమ్సన్‌ ఆడాడు. అత్యుత్తమంగా ఐపీఎల్‌లో 2128 పరుగులు చేశాడు.

ఇవీ చదవండి: Asia Cup Rising Stars: సెమీ ఫైనల్స్‌ షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు
‘ఆర్సీబీ నన్ను కొనకపోయినా పర్లేదు.. అతడికి పోటీగానైనా ఆడతా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement