source: X
వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జట్టు మారాడు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు ఆడిన అతడు.. 2027 సీజన్ కోసం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జతకట్టాడు. ఇవాళ జరిగిన వేలంలో పోలార్డ్‌ను సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.
వేలానికి ముందు కేప్‌టౌన్ పోలార్డ్‌ను విడుదల చేసింది. దీంతో అతను 1.5 మిలియన్ ర్యాండ్‌ల (సుమారు రూ. 87 లక్షలు) బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. పోలార్డ్ సూపర్ కింగ్స్ జట్టులో విండీస్ సహచరులు జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్ తదితరులతో కలుస్తాడు.
2027 సీజన్ కోసం జోబర్గ్ సూపర్ కింగ్స్ నిలుపుకున్న ఆటగాళ్లు..
జారెన్ బాచర్, మాథ్యూ డివిలియర్స్, లియుస్ డు ప్లూయ్, డోనోవన్ ఫెరీరా, డయాన్ ఫారెస్టర్, అకీల్ హొసేన్ (వెస్టిండీస్), డువాన్ జాన్సెన్, రిలీ రోసోవ్, జాంకో స్మిత్, ప్రేనెలన్ సుబ్రాయెన్, జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్)
ప్రీ సైనింగ్: జేసన్ హోల్డర్ (వెస్టిండీస్)
కాగా, ఇవాళ జరుగుతున్న వేలంలో పోలార్డ్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్, ఫాఫ్ డుప్లెసిస్ మార్కీ ప్లేయర్లుగా బరిలో ఉన్నారు. మొత్తం 19 ఖాళీల కోసం ఇవాల్టి వేలం జరుగుతుంది. 2027 సౌతాఫ్రికా టీ20 లీగ్ జనవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు జరగనున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: దంచికొట్టిన వార్నర్.. బంగ్లాదేశ్‌పై ఆసీస్ ఘన విజయం


