క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని సిక్సర్‌.. | Historic Six Wide Bouncer Sails Over Pollard Head In Canada Super60 Semifinal And Leaving Fans Stunned, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని సిక్సర్‌..

Oct 5 2026 1:04 PM | Updated on Oct 5 2026 1:31 PM

Historic Six-Wide-Bouncer Sails Over Pollard-Head-Canada Super60 Semis

Photo Credit: Twitter

వాంకోవర్ వేదికగా జరుగుతున్న కెనడా సూపర్ 60 క్లాష్ టోర్నీలో టొరంటో సిక్సర్స్‌, మిస్సిసాగా మాస్టర్స్ మధ్య జరిగిన సెమీఫైనల్‌-1 మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టొరంటో సిక్సర్స్‌ ఇన్నింగ్స్ సమయంలో కీరన్ పొలార్డ్ క్రీజులో ఉన్నాడు. ఈ సమయంలో మిస్సిసాగా మాస్టర్స్ బౌలర్ అలీ ఖాన్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి పొలార్డ్ బ్యాట్‌కు తాకుకుండానే వైడ్‌లైన్ దాటి గాల్లోకి లేచి స్టాండ్స్‌లో పడింది. 

నిజానికి ఇది సిక్సర్‌గా పరిగణించాల్సి ఉన్నప్పటికీ, ఎంసీసీ నిబంధనల ప్రకారం బంతి పొలార్డ్ బ్యాట్‌కు తగలకుండా వెళ్లడంతో అంపైర్ వైడ్ సహా బౌండరీ ఇచ్చాడు. దీంతో  సిక్సర్ కాస్తా బౌండరీగా మారిపోయింది. ఏడు పరుగులు (వైడ్ ప్లస్ సిక్సర్‌) రావాల్సిన చోట ఆరు పరుగులు (వైడ్ ప్లస్ బౌండరీ) వచ్చాయి. 

అంతేకాదు కేవలం 40 మీటర్ల దూరంలోనే బౌండరీ ఉండడంతో అలీ ఖాన్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి బౌండరీ అవతల పడింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ‘చారిత్రక సిక్స్ వైడ్‌’ అంటూ ఫన్నీగా ట్రోల్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

ఇక మ్యాచ్‌లో టొరంటో సిక్సర్స్‌ తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టొరంటో సిక్సర్స్‌ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (16 బంతుల్లో 40 పరుగులు), ఆండ్రీస్ గౌస్ (11 బంతుల్లో 33 నాటౌట్‌) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఓపెనర్ ఇమాద్ వసీమ్ (26) రాణించాడు.  అనంతరం బ్యాటింగ్ చేసిన మిస్సిసాగా మాస్టర్స్ 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులకు పరిమితమైంది. 

అలెక్స్ లీస్ (39) టాప్ స్కోరర్‌గా నిలవగా, జార్జ్ మున్సీ (23) రాణించాడు. టొరంటో బౌలర్లలో ఇమాద్ వసీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు కెనడా సూపర్ 60 క్లాష్ టైటిల్‌ను కూడా టొరంటో సిక్సర్స్ సొంతం చేసుకుంది. ఫైనల్లో వాంకోవర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గిన టొరంటో సిక్సర్స్ చాంపియన్‌గా నిలిచింది.

ఇదీ చదవండి: కివీస్‌తో టెస్టు సిరీస్‌.. ఆ ఇద్దరు స్టార్‌ బౌలర్లకు చాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement