source: IPL X
ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. మినీ వేలం తేదీ, సమయం, వేదికను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 18, బుధవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ వివరాలతో ప్రకటన విడుదల చేసింది.
దీంతో వేలం తేదీ, వేదికపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. డిసెంబర్ 16న ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది. ఈసారి మినీ వేలానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. 2023 తర్వాత ఐపీఎల్ వేలం తిరిగి భారత్‌లో జరగనుండటం విశేషం.
వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సాధారణంగా ఐపీఎల్ వేలాలు మధ్యాహ్నం ప్రారంభమవుతుంటాయి. అయితే ఈసారి సమయాన్ని ముందుకు మార్చడం వెనుక ప్రసారకర్తల ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్-దక్షిణాఫ్రికా వన్డేకు ముందే వేలం
డిసెంబర్ 16న భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. అంతకంటే మూడు గంటల ముందే వేలం మొదలవుతుంది. దీంతో అభిమానులు మ్యాచ్ ప్రారంభమయ్యేలోపు వేలాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. కాగా, ఐపీఎల్ 2027కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ నిన్ననే ముగిసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: ధోని రిటైర్మెంట్.. ఆ ముగ్గురే ఆల్ సీజన్ ప్లేయర్స్


