జింబాబ్వేను వణికించిన 20 ఏళ్ల ఆఫ్గన్‌ క్రికెటర్‌ | 20 Years AFG Cricketer Nasser Khan-Broke Several Records Vs ZIM-2nd-Test | Sakshi
Sakshi News home page

జింబాబ్వేను వణికించిన 20 ఏళ్ల ఆఫ్గన్‌ క్రికెటర్‌

Nov 17 2026 8:34 PM | Updated on Nov 17 2026 8:47 PM

20 Years AFG Cricketer Nasser Khan-Broke Several Records Vs ZIM-2nd-Test

జింబాబ్వేతో జ‌రిగిన టెస్టు సిరీస్‌ను 1-0తో కోల్పోయిన‌ప్ప‌టికీ అఫ్గానిస్తాన్ మాత్రం ప‌లు రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది. మ్యాచ్‌లో వీరోచిత శ‌త‌కంతో మెరిసిన ఆఫ్గ‌న్ ఆల్‌రౌండ‌ర్ నాసర్ ఖాన్ మరూఫ్‌ఖిల్ చ‌రిత్ర సృష్టించాడు. తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచ‌రీతో పాటు ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన అతి పిన్న వ‌య‌స్కుడిగా నాస‌ర్ ఖాన్ నిలిచాడు. 

ప్ర‌స్తుతం నాస‌ర్ ఖాన్ వ‌య‌సు 20 ఏళ్ల 287 రోజులు. నాస‌ర్ ఖాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 20 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 101 నాటౌట్ శ‌త‌కంతో మెరిశాడు. ఇక బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవ‌ర్లు వేసి 151 ప‌రుగులిచ్చి ఏడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవ‌ర్లు వేసి 106 ప‌రుగులిచ్చి రెండు వికెట్లు.. మొత్తంగా 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

👉టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచ‌రీతో పాటు ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన రెండో క్రికెటర్‌గానూ నాస‌ర్ ఖాన్ రికార్డుల‌కెక్కాడు. 1965లో కోల్‌క‌తా వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన టెస్టులో న్యూజిలాండ్ క్రికెట‌ర్‌ బ్రూస్ టేల‌ర్ ఈ ఫీట్ సాధించ‌గా, తాజాగా నాస‌ర్ ఖాన్ ఈ ఘ‌న‌త సాధించిన రెండో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు.

👉డెబ్యూ టెస్టులో వందకు పైగా ప‌రుగులు, 8 ప్ల‌స్ వికెట్లు తీసిన రెండో క్రికెట‌ర్‌గా నాస‌ర్ ఖాన్ నిలిచాడు. నాస‌ర్ ఖాన్ రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి 121 ప‌రుగులు చేయ‌డంతో పాటు 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెట‌ర్‌గా ఆల్బ‌ర్ట్ ట్రాట్ ఉన్నాడు. 1895లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆల్బ‌ర్ట్ ట్రాట్ 110 ప‌రుగులు చేయ‌డంతో పాటు బౌలింగ్‌లో 8 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

👉డెబ్యూ టెస్టులో బ్యాటింగ్‌లో 300 ప్ల‌స్ బంతులు ఎదుర్కోవ‌డంతో పాటు , బౌలింగ్‌లో 486 బంతులు విసిరిన తొలి ప్లేయ‌ర్‌గా నాస‌ర్ ఖాన్ రికార్డుల‌కెక్కాడు.

👉40 ఏళ్ల దాటిన త‌ర్వాత టెస్టుల్లో ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు నెగ్గిన మూడో క్రికెట‌ర్‌గా బ్రెండ‌న్ టేల‌ర్ నిలిచాడు. గ‌తంలో 1993లో ఇంగ్లండ్ దిగ్గ‌జం గ్ర‌హం గూచ్ ఆస్ట్రేలియాపై, 2016లో మిస్బా ఉల్ హ‌క్ ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించారు. ఇక మ్యాచ్‌లో జింబాబ్వే 57 ప‌రుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఇదీ చదవండి: ఆఫ్గన్‌ను కాపాడ‌ని వీరోచిత సెంచ‌రీ.. జింబాబ్వే సంచ‌ల‌న విజ‌యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement