ధోని వీడ్కోలు.. వైరల్‌గా మారిన రుతురాజ్‌ లెటర్‌! | Ruturaj Gaikwad-Emotional Note-About-MS-Dhoni-IPL Retirement | Sakshi
Sakshi News home page

ధోని వీడ్కోలు.. వైరల్‌గా మారిన రుతురాజ్‌ లెటర్‌!

Nov 17 2026 6:09 PM | Updated on Nov 17 2026 6:12 PM

Ruturaj Gaikwad-Emotional Note-About-MS-Dhoni-IPL Retirement

Photo Credit: Twitter

ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్ర‌క‌టించి టీమిండియా దిగ్గ‌జ కెప్టెన్ ఎంఎస్ ధోని అభిమానులంద‌ర్నీ ఆశ్య‌ర్య‌ప‌రిచాడు. 2027 ఐపీఎల్ సీజ‌న్‌లో ధోనిని ఆట‌గాడిగా చివ‌రిసారి చూసుకోవ‌చ్చ‌ని ఆశ‌ప‌డిన అభిమానుల‌కు ధోని నిర్ణ‌యం ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ధోని తీసుకున్న నిర్ణ‌యం అభిమానుల‌నే కాదు, సీఎస్‌కే ఆట‌గాళ్ల‌లోనూ ఏదో తెలియ‌ని క‌ల‌వ‌రం క‌లిగిన‌ట్ల‌యింది. ఈ నేప‌థ్యంలో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త‌న అభిమాన ఆట‌గాడు ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంపై ఎమోష‌న‌ల్‌కు గుర‌య్యాడు.

''సింప్లిసిటీ అనే దానికి ధోని ప‌ర్యాయ‌ప‌దం. 2019లో మొద‌టిసారి సీఎస్‌కేలో జాయిన్ అయిన స‌మ‌యంలో సింప్లిసిటీ అనే ప‌దానికి స‌రైన అర్థాన్ని తెలుసుకున్నా. ధోనితో అనుబంధాన్ని ఒ‍క్క మాటలో చెప్పాలంటే అది నిరాడంబరతే. కెరీర్‌లో ఎన్ని ఘనతలు సాధించినప్పటికీ ధోనీ ఎంతో సాధారణంగా, హుందాగా ఉంటాడు. 

ధోనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, 22 గజాల పిచ్‌పై కలిసి ఆడుతూ జట్టును గెలిపించడం ద్వారా కల నిజమైనట్లుగా అనిపించింది. పాత్ర మారినా ఎప్పటికీ మా ‘తలా’ మీరే. ధోని ఏ పాత్రలో ఉన్నా సరే, ఆయనే ఎప్పటికీ మా ‘తలా’, మా కెప్టెన్‌, మా లీడర్‌. థాంక్యూ మహీ భాయ్ ఫర్ ఎవ్రీతింగ్‌'' అని రుతురాజ్ ముగించాడు.

దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ ఐపీఎల్ ప్రయాణం తర్వాత ధోనీ ఆటగాడిగా తప్పుకున్నాడు. గాయం కారణంగా 2026 సీజన్‌కు దూరమైన ఆయన, రిటెన్షన్ గడువుకు ముందే ఆటగాడిగా తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన ఎంఎస్ ధోని సీఎస్‌కేకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. ఇప్పటిదాకా ఆటగాడిగా ఐపీఎల్‌లో కొనసాగిన ధోని 2027 సీజన్ నుంచి సీఎస్‌కే మెంటార్‌గా జట్టును మార్గనిర్దేశం చేయనున్నాడు.

ఇదీ చదవండి: ఆట‌గాడిగా వీడ్కోలు.. ఐపీఎల్‌లో ధోని టాప్‌-5 రికార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement